జగన్ హయాం అంతా దోపిడీ రాజ్యమేలింది.!

Publish Date:Jul 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లాయరు, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ కుమార్  నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఈ సారి ఆయన   వైసీపీ టార్గెట్ లో విరుచుకుపడ్డారు.  వైసీపీ నేతల ఆర్థిక మూలాలు,  పార్టీ ఫండింగ్ వ్యవహారాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..వైసీపీ నేతలు..అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు వెనకేశారన్న జడ శ్రవణ్ కుమార్.. వాళ్లు ఎంగిలి మెతుకులను కూడా వదిలిపెట్టకుండా దోచుకున్నారని విమర్శించారు. 

నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు. 

జగన్  హయాంలో తీసుకున్న  పలు   నిర్ణయాలను విమర్శలతో తూర్పారబట్టారు. జగన్ ఐదేళ్ల పాలనలో వందల కొద్దీ కాంట్రాక్టులు, మైనింగ్ లీజులు కేవలం పార్టీకి అనుకూలంగా ఉండే క్రోనీ క్యాపిటలిస్టులకు మాత్రమే దక్కాయన్న జడ శ్రవణ్ కుమార్.. ఆ క్రమంలో దాదాపు 5 వేలకోట్ల రూపాయలకు పైగా నిధులు క్విడ్ ప్రో కో పద్ధతిలో పార్టీ ఫండింగ్ రూపంలోకి మారాయన్నారు.  మద్యం పాలసీ, ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు 35 శాతం నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కే చేరిందని సంచలన ఆరోపణలు చేశారు. సాధారణ ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన పన్నుల సొమ్మును ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు   ఉపయోగించారన్నారు.  

ఎంతో నైతికతతో రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకున్న వైసీపీ నేతలు, ఇప్పుడు అడ్డగోలుగా దొరికిపోతున్నారన్న ఆయన..  అమరావతి భూముల వ్యవహారంలోనూ, విశాఖపట్నంలో ల్యాండ్ గ్రాబింగ్ ద్వారా సుమారు రూ. పది వేల కోట్ల విలువైన భూములను వైసీపీ అస్మదీయులు హస్తగతం చేసుకున్నారనీ,  దళిత, వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, కేవలం కొద్దిమంది బడా బాబుల జేబులు నింపడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిందని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక అక్రమాలపై పూర్తిస్థాయి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరగాలని.. అప్పుడే అసలు దొంగలు బయటపడతారనీ జడ శ్రావణ్ అన్నారు.  

YSRCP Funding Allegations, AP Politics Shocking Comments, YSRCP Corruption Scandals, Andhra Pradesh Latest News

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.