అయ్యో ఐవైఆర్ కూడానా?
Publish Date:Jul 31, 2025
Advertisement
మాజీ సీఎస్ ఐవైఆర్ కి తత్వం బోధపడింది.. జగన్ కు దిమ్మదిరిగి బొమ్మ కనిపించినట్లేగా?! మద్యం కుంభకోణం కేసులో జగన్ పూర్తిగా ఇరుక్కున్నట్లే కనిపిస్తున్నది. ఒక్కరొక్కరుగా జగన్ కు సన్నిహితంగా లేదా మద్దతుగా నిలిచిన ఒక్కొక్కరుగా ఆయనకు దూరం జరుగుతూ మద్యం కుంభకోణం కేసులో జగన్ ప్రమేయం ఉందన్న విషయాన్ని పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చేరారు. ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన జగన్ కు గట్టి మద్దతుదారు అనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలి సీఎస్ గా ఆయన చంద్రబాబు హయాంలో పని చేశారు. ఆయన పదవీ విరమణ తరువాత ఆయన కోరిక మేరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఐవైఆర్ ను బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ గా నియమించారు. అయితే 2019కు ముందు నుంచీ కూడా ఐవైఆర్ పరోక్షంగా జనగ్ కు సహకరించేలా చంద్రబాబు లక్ష్యంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూవచ్చారు. ఇక 2019 - 2024 మధ్యా కాలంలో అంటే జగన్ అధికారంలో ఉండగా ఐవైఆర్ పూర్తిగా మౌనం వహించారు. జగన్ విధానాలను ప్రశ్నించకుండా పరోక్షంగా మద్దుత ఇచ్చి సహకరించారు. ఆ తరువాత ఆయన బీజేపీలో చేరారు. అప్పటి నుంచీ ఐవైఆర్ జగన్ కు మద్దతుగా నోరు తెరిచిన సందర్భంలేదు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే కూటమి అధికారంలో కొనసాగాలంటే చంద్రబాబు మద్దతు అనివార్యమైన పరిస్థితి నెలకొని ఉండటమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషణ. ఎందుకంటే జనగ్ ను మద్దతుగా మాట్లాడితే తనకే బూమరాంగ్ అవుతుందన్న ఉద్దేశంతో ఐవైఆర్ మౌనం వహించారని అంటారు. అయితే ఈ ఏడాది కాలంలో ఐవైఆర్ ఎన్నడూ కూడా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. లాగే మద్యం విక్రయాలలో కేవలం నగదు మాత్రమే అన్న విధానాన్ని కేవలం అవినీతి కోసమే తీసుకువచ్చారనీ, అలాగే నాసిరకం మద్యం బ్రాండ్లను తీసుకురావడం ద్వారా ప్రజల ఆరోగ్యం గుల్ల కావడానికి కారణమై ఘోర తప్పిదానికి పాల్పడ్డానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో జగన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లేననీ, ఆయన తప్పించుకునే అవకాశం లేదనీ ఐవైఆర్ అన్నారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే చాలా చాలా పెద్దదన్ని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆఖరికి ఐవైఆర్ కృష్ణారావు కూడా జగన్ వదిలేశారని అర్ధమౌతోంది. నిజంగానే మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అవ్వడమంటూ జరిగితే.. ఆయనకు రాజకీయంగా కూడా ఎటువంటి సహకారం అందే అవకాశాలు దాదాపు లేవనే పరిశీలకులు అంటున్నారు.
కానీ హటాత్తుగా ఇటీవల ఐవైఆర్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో నోరెత్తారు. నోరెత్తడమే కాదు.. ఈ కేసులో జగన్ పీకల్లోతు కూరుకుపోయారనీ, తప్పించుకోవడం కష్టమనీ కుండబద్దలు కొట్టేశారు. అంతే కాదు అధికారంలో ఉండగా జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ముఖ్యంగా ఎక్సైజ్ కమిషనర్ గా అనర్హుడిని నియమించడం ద్వారా దిద్దుకోలేని తప్పు చేశారనీ విమర్శించారు. అ
http://www.teluguone.com/news/content/iyr-also-deserted-jagan-39-203177.html





