చంద్రబాబంటే ఐటీ ..ఐటీఅంటే చంద్రబాబు!

Publish Date:Oct 31, 2023

Advertisement

అవును, ఆయనేమీ దేవుడు కాదు, ఇంద్రుడు కాదు , చంద్రుడు కాదు. ఎందరో నాయకుల్లో ఆయనొకరు, కానీ, ఎక్కడెక్కడి నుంచో, ఎవరెవరో వచ్చి ఆయన కోసం గళం విప్పడం ఏమిటి? కులం గోత్రాలతో, రాజకీయ రంగులతో  సంబంధం లేకుండా దేశ విదేశాల నుంచి వచ్చిన విభిన్న వర్గాల ప్రముఖులు, సామాన్యులు ఒకటిగా ఆయన కోసం గళం విప్పడం ఏమిటి?  నిజంగా నడుస్తున్న చరిత్రలో ఇదొక అనూహ్య పరిణామం. ఒక అద్భుత దృశ్యం.

రాజకీయ కక్షతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పన్నిన కుట్రలో చిక్కుకుని,యాభై రోజులకు పైగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చిన దృశ్యం నిజంగా చంద్రబాబు నాయుడు గొప్ప తనాన్ని మరో మారు గుర్తు చేసింది. మరో  మారు ప్రపంచం కళ్లకు కట్టింది.
 అవును, రెండురోజుల క్రితం ఆదివారం రోజున హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘సైబర్ టవర్స్ రజతోత్సవ’ కార్యక్రమం చంద్రబాబు నాయుడు దార్శనికత, ముందు చూపుకు దర్పణంగా నిలిచింది. ఎప్పుడో,పాతికేళ్ళ నాడు కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు  నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై నిలిచిన దృశ్యం దర్శనమిచ్చింది. చంద్రన్నకు ఐటీ వందనం చేసింది. తెలుగు యువత హైటెక్  భవితకు బంగరు బాటలు పరిచిన  విజనరీకి వందనం చేసింది. వందనం చేయటమే కాదు. గళం విప్పింది. గర్జించింది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో, అత్యధికులు యువకులే కావటం ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భంగా పెల్లుబుకిన అభిమానం కొత్త చర్చకు తెర తీసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువ కిశోరాలు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలుస్తామని.. సంఘీభావాన్ని ప్రకటించటంతో పాటు.. ఆయన విజన్ వల్లే తాము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకున్న వైనం చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు ఇప్పడు ఎక్కడున్నా, ప్రజల గుండెల్లో స్థిరంగా ఉన్నరనే విషయాన్ని ఈ ఈవెంట్ రుజువు చేసింది. వేలాది ఐటీ ఉద్యోగులు.. చంద్రబాబుకు జై కోట్టారు.. సీబీఎన్ జిందాబాద్.. మేము సైతం బాబు కోసం లాంటి స్లోగన్లు పెద్ద ఎత్తున వినిపించాయి.

నిజానికి ఆదివారం జరిగింది, చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు పండగో, పెళ్లిరోజు వేడుకో కాదు. తెలుగు దేశం పార్టీ కార్యక్రమం కాదు. అసలు రాజకీయాలతో సంబంధమే లేని  కార్యక్రమం. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ను నిర్మించి పాతికేళ్లు అవుతున్న వేళ.. ఐటీ రంగానికి బీజం వేసిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమలో  పలువురు మాట్లాడిన మాటలు.. చేసిన ప్రసంగాలు చంద్రబాబు ఇమేజ్ ను మరింతగా పెంచే విధంగా ఉన్నాయి. అందుకే, బావోద్రేకంతో ఒకరిద్దరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా, మాట్లాడిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు దార్శనికత   గురించే మాట్లాడారు. 

ఆయన ముందు చూపుతో నాటిన విత్తు ఈరోజు ఏ విధంగా మహా వట వృక్షమై, తమవంటి లక్షల మందికి  ఎలా నీడను అందిస్తున్నదో, దేశ  విదేశాల్లో తాము సాధించిన విజయాలకు చంద్రబాబు నాయుడు ఏవిధంగా ఆదర్శంగా నిలిచారో వివరించారు. అలాగే చంద్రబాబు నాయుడు నడకను, నడతను దగ్గర నుంచి చూసిన పెద్దలు, ఆయనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు.
జనసామాన్యం చంద్రబాబును తమ తల్లిదండ్రులతో, అంత కన్నా మిన్నగా దేవుడితో సమానంగా ఎలా చూస్తారో సోదారహరంగా వివరించారు. ఒక డ్రైవర్ రోజూ తాను అన్నం తినే ముందు తల్లిదండ్రులతో సమానంగా భావించే చంద్రబాబు కోసం ఓ ముద్ద వదిలి మరీ తాను తింటాడు. తెలుగు ఇళ్లళ్లో వ్రతాలు, పూజలూ చేయడం కద్దు. అలా చేసిన ప్రతి సారీ దేవుడి ఆకును ఉంచి.. వండిన పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. అలాగే చంద్రబాబు విజన్ వల్ల తమ జీవితాలు నిలబడ్డాయని భావించచే ప్రతి ఉద్యోగీ, వారి కుటుంబం చంద్రబాబును దేవుడితో సమానంగా భావిస్తారనడానికి ఆ డ్రైవర్ తాను తినే ముందు ఒక ముద్దను చంద్రబాబుకు నైవేద్యంగా సమర్పించడమే నిదర్శనం.

   నిజానికి, హైటెక్ సిటీ అంటే, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రమే గుర్తు కొస్తారు. ఆ నిజాన్ని ఎవరూ కాదన లేరు.  నిజానికి, రాష్ట్ర విభజన తర్వాత కూడా  తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించ గలుగుతోంది, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అంటే ఆది చంద్రబాబు చలవే  తప్ప మరొకటి కాదు. ఐటీ రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే  ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి. చంద్రబాబు మానస పుత్రిక విజన్ 2020 పుణ్యానే, ఈరోజున హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. విశ్వనగరంగా ఎదిగింది. ఎదుగుతోంది. అయితే  ఆ రోజుల్లోకి వెళితే ఒక నొక సందర్భంలో చంద్రబాబు నాయుడు అన్నట్లుగా  ఆరోజుల్లో విజన్ 2020 అంటే.. 420 అని ఎగతాళి చేశారు. కానీ ఈ రోజున కళ్ళ ముందు కనిపిస్తున్న విజన్ 2020 ఫలాలను ఎవరూ కాదన లేరు..  ఎవరో కాదు..అసలు ఎవరిదాకానో ఎందుకు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు సైతం.. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసిన కృషే కారణమని ఒక సారి కాదు పలు సందర్భాలలో పేర్కొన్నారు. అందుకే, ఈరోజున చంద్రబాబు నాయుడుకు ఐటీ రంగం జేజేలు పలుకుతోంది. బాబంటే ఐటీ ..ఐటీఅంటే బాబు అంటోంది ఐటీ ప్రపంచం.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.