నా కుమారుడిని ఐటీ అధికారులు కొట్టారు.. మల్లారెడ్డి ఆరోపణ
Publish Date:Nov 23, 2022
Advertisement
మంత్రి మల్లారెడ్డి నివాసాలు కార్యాలయాలు సహా ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి నివాసం, కార్యాలయం అలాగే బంధువులు సన్నిహితుల నివాసాలలో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు సురారంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, కుమార్తె, అల్లుడు, వియ్యంకుడి ఇళ్లలో నిన్న ఉదయం నుంచీ ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి విదితమే. సోదాల నేపథ్యంలో మహేందర్ రెడ్డి నిన్నటి నుంచీ తన నివాసంలోనే ఉన్నారు. ఇంతలో ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సోదాలు చేసిన ఐటీ అధికారులు ఎక్కడ సోదాలు నిర్వహిస్తున్నారో అక్కడే ఆ రాత్రి పడుకున్నారు. కాగా ఈ సోదాలలో భారీ ఎత్తున నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలా ఉండగా అస్వస్థతకు గురైర మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఇలా ఉండగా మంత్రి మల్లారెడ్డి సోమవారం ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. తెలంగాణలో మోడీ ఆటలు సాగవని పేర్కొన్నారు. మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు ప్రారంభం కావడం విశేషం. అదలా ఉంచితే తన కుమారుడిని ఐటీ అధికారులు ఐటీ రెయిడ్స్ పేరుతో వేధించడమే కాకుండా కొట్టారని మంత్రి ఆరోపించారు. తన కుమారుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వచ్చిన మల్లారెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. వారు భౌతిక దాడికి పాల్పడటం వల్లనే తన కుమారుడు ఆసుపత్రి పాలయ్యారన్నారు. రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శించారు. రు.
http://www.teluguone.com/news/content/it-officers-man-handled-my-son-says-minister-mallareddy-25-147529.html





