ఉగ్రవాదానికి మతం ఉంటుందా!

Publish Date:Jul 2, 2016

Advertisement

 

నిఘావర్గాల పుణ్యమా అని హైదరాబాద్‌ పెను విపత్తు నుంచి తృటిలో బయటపడింది. మారణహోమం తప్పిందంటూ ఊపిరి పీల్చుకుంది. అయినా ఇంకా భాగ్యనగరం బిక్కుబక్కుమంటూనే ఉంది. వరుస పండుగలు, సెలవలని ఉపయోగించుకునేందుకు ఉగ్రవాదులు ఏ మూలన నక్కి ఉన్నారో అంటూ ప్రజలు భయపడుతూనే ఉన్నారు. కానీ ఇదే సమయంలో... ధ్వంసరచనకు పూనుకొన్న ఐఎస్‌ తీవ్రవాదుల చుట్టూ మతరాజకీయాలు కమ్ముకుంటున్నాయి.

 

మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ ఒకవైపు ఐఎస్‌ తీవ్రవాద తీరుని ఖండిస్తూనే, వారికి న్యాయసహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. పనిలో పనిగా నిఘావర్గాలు తరచూ అమాయకులైన కుర్రవాళ్లని హింసిస్తోందంటూ దుమ్మెత్తిపోశారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎంతటి నేరం చేసినవారికైనా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది. అలా నిరూపించుకునేందుకు వీలుగా ఒక న్యాయవాదిని నియమించుకునే హక్కూ ఉంది. ఒకవేళ వారికి ఆ స్తోమత లేకపోతే ప్రభుత్వమే వారి తరఫున వాదించేందుకు ఓ న్యాయవాదిని నియమిస్తుంది. ఇన్ని హక్కుల మధ్య ఒవైసీ తానే ఆ ముద్దాయిలకి న్యాయం అందించేందుకు ఎందుకు త్వరపడుతున్నారన్నది ప్రశ్న!

 

ఉగ్రవాదం ఏదో ఒక మతపు రంగుని పులుముకోవచ్చుగాక! కానీ వారికి తన మన అన్న బేధాలు ఉండవు. లేకపోతే రంజాన్‌వంటి పవిత్రమాసంలో పెను విధ్వంసానికి పాల్పడేందుకు ఎందుకు కుట్రపన్నినట్లు? హిందువులని రెచ్చగొట్టి ముస్లింలను బలిచేయాలన్న ప్రణాళికను ఎందుకు రచించినట్లు? ఈ విషయాన్ని కొందరు ముస్లిం పెద్దలు సైతం గ్రహించారు కనుకనే మసీదుల గుండా నిఘావర్గాలు ప్రవేశించేందుకు అనుమతిని ఇచ్చారు. మత ప్రాబల్యం ఉన్న పాతబస్తీలో ఇలాంటి సాయం... నిజంగానే అపురూపం. కానీ కొందరు రాజకీయ నేతలు, పట్టుబడ్డవారు అమాయకులేమో అంటూ ముందుగానే వెనకేసుకు రావడం దురదృష్టకరం.

 

ఇది కేవలం ఐఎస్‌ తరహా ఉగ్రవాదానికి సంబంధించిన సమస్య కాదు. గుజరాత్‌ అల్లర్లు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన పేలుళ్లు, మాలేగావ్‌లో జరిగిన బాంబుదాడులు... వంటి సంఘటనల్లో హిందూ తీవ్రవాదులు పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలే చోటుచేసుకున్నాయి. సదరు సంఘటనలకి కాంగ్రెస్‌ ఒకలాగా, బీజేపీ మరొకలాగా స్పందించి ప్రజాస్వామ్యాన్ని ఇరుకున పెట్టాయి. ఇలా ఉగ్రవాదాన్ని మత కోణంలోంచి చూడటం మానుకున్న రోజునే నిందితులకు శిక్ష, నిర్దోషులకు రక్షణ లభిస్తాయి. లేకపోతే రాజకీయ పార్టీలు ఉగ్రవాదాన్ని కూడా అనుకూలంగా వాడుకునే రోజులు దాపురిస్తాయి.

 

అమెరికా వంటి ఆధునిక దేశాలలోనే తీవ్రవాదం అన్న పేరుతో అన్యమతస్తులను పీడించడం జరుగుతోంది. ఆ దేశ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన వెంటనే బట్టలూడదీసి మరీ తనిఖీలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితితో పోల్చుకుంటే మన దేశం చాలా సహృద్భావంగానే వ్యవహరిస్తున్నట్లు లెక్క. ఈ దేశం ఏ ఒక్క మతం వారిదో కాదన్నది భారతీయుల నమ్మకం కాబట్టే, ప్రభుత్వాలు ఉదారంగా ఉన్నా ప్రమాదాలు ముంచుకురావడం లేదు. ఒకవేళ లెక్క తప్పి నిఘావర్గాలు ఎవరనన్నా నిర్దోషిని పట్టుకుంటే గొంతెత్తే అధికారం అసదుద్దీన్ వంటి నేతలకు ఎలాగూ ఉంది. అలాంటప్పుడు ముందుగానే మన దేశ రక్షణ దళాలను ఎందుకు దుమ్మెత్తిపోయడం అన్న ప్రశ్న ఎవరికైనా తట్టక మానదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.