BMI వార్నింగ్..బిఎమ్ఐ ఎంత ఉండే జాగ్రత్త పడాలి తెలుసా.!

Publish Date:Jul 24, 2026

Advertisement

BMI వార్నింగ్..బిఎమ్ఐ ఎంత ఉండే జాగ్రత్త పడాలి తెలుసా.!

బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. అధిక బరువు ఎన్నో వ్యాధులకు ఒక కారణమని వైద్యులు చెబుతారు.  ఊబకాయం అనేది కేవలం శరీరాన్ని లావుగా చేస్తుందని చాలా మంది అనుకుంటారు.. కానీ నిజం దానికంటే చాలా భయంకరమైనది. ఇది హార్మోన్ల సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ సమస్యలు,  మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా చాలా  పెంచుతుంది . చాలామంది బరువు చూసుకుని తాము ఎక్కువ బరువు ఉన్నామా, తక్కువ బరువు ఉన్నామా అని తెలుసుకుని సాటిసిపై అవుతుంటారు. కానీ నిజానికి వెయిట్ మిషన్ లో బరువు చూసుకోవడం అనేది ఆరోగ్యకరమైన బరువును నిర్థారించదు.  ఆరోగ్యకరమైన బరువును బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా నిర్ణయిస్తారు.  దీన్నే బిఎమ్ఐ అని కూడా అంటారు.  బిఎమ్ఐ ఎంత ఉంటే ఆరోగ్యం సేఫ్ గా ఉన్నట్టు? ఎప్పుడు జాగ్రత్త పడాలి? వివరంగా తెలుసుకుంటే..

బిఎమ్ఐ అంటే..

బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనేది  ఎత్తుకు తగ్గట్టు బరువు సాధారణంగా ఉందో లేదో తెలియజేసే ఒక కొలమానం. ఒక వ్యక్తి 70 కిలోగ్రాముల బరువు ఉండి, 1.70 మీటర్ల ఎత్తు ఉంటే, ఆ వ్యక్తి BMI సుమారుగా 24.2 ఉంటుంది. BMIని తెలుసుకోవడానికి,  బరువును (కిలోగ్రాములలో)  ఎత్తు యొక్క వర్గంతో (మీటర్లలో) భాగించాలి.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 25 కంటే ఎక్కువ BMI ఉన్న వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

18.5 కంటే తక్కువ ఉంటే..  తక్కువ బరువు.
18.5- 24.9 మధ్య ఉంటే.. సాధారణ బరువు.
25 29.9 మధ్య ఉంటే..  అధిక బరువు.
30 లేదా అంతకంటే ఎక్కువ  ఉంటే.. ఊబకాయం.

బిఎమ్ఐ ఎక్కువ ఉంటే ఏమవుతుంది?

 BMI ఎక్కువ ఉంటే తరచుగా శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయినట్టు అర్థం. ఇది రక్తనాళాలు , గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
 
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు శరీరంలోకి వాపును కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల ధమనులలో పాచి పేరుకుపోవడం, అధిక కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. కాలక్రమేణా, ఈ పరిస్థితి కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటు , పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు, కణాలు ఇన్సులిన్‌కు తక్కువ సున్నితంగా మారతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఎక్కువ బిఎమ్ఐ వల్ల సమస్యలు..

ఎక్కువ BMI ఉన్నవారికి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని నియంత్రించకుండా వదిలేస్తే, అది కాలేయ వాపు, ఫైబ్రోసిస్ , సిర్రోసిస్‌ సమస్యలకు  దారితీయవచ్చు.

ఊబకాయం వల్ల కనీసం 13 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక  అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో  కొవ్వు శరీరంలో వాపుకు కారణమవుతుంది , ఇన్సులిన్, కొన్ని హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల కణాలు అసాధారణఁగా పెరుగుతాయి.  ఇది చాలా ప్రమాదంగా మారుతుంది.

బిఎమ్ఐ ను ఎలా నియంత్రించాలి?

BMIని నార్మల్ గా ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ,  జీవనశైలి చురుగ్గా ఉంచుకోవడం చాలా కీలకమని వైద్యులు చెబుతున్నారు.

వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి, అదనంగా ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. తగినంత నిద్ర పొవాలి,   ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ రెండూ బరువుపై ప్రభావం చూపుతాయి.  BMI పెరుగుతూ ఉంటే లేదా 25-30 కంటే ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

 

                               *రూపశ్రీ.

 

By
en-us Political News

  
ఇష్టమైన ఆహారం తింటూనే సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ సూచించిన అట్కిన్స్ డైట్ ప్లాన్ విశేషాలు తెలుగులో తెలుసుకోండి.
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ...
గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది.
రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం చేస్తే శరీరం, మనసుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? సరైన విధానం, శాస్త్రీయ ప్రయోజనాలు, ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? అనే వివరాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రీమతి శ్రావంతి రఘు ఈ వీడియోలో వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.