Publish Date:Jun 13, 2022
మంత్రులు, ఎమ్మెల్యేలు వారి పనులు వారు చేయాలి. ముఖ్యమంత్రి మంత్రివర్గంతో కలిసి రాష్ట్ర అభి వృద్ధి పనుల మీద దృష్టిపెట్టాలి. కానీ యోగీ ఆదిత్యనాథ్ పద్ధతి అందుకు విరుద్ధంగా వుందని కోపగించు కున్నారు అసదుద్దీన్ ఒవైసీ.
ప్రయాగ్‌రాజ్ అల్లర్ల సందర్భంగా అరెస్టయిన ప్రధాన నిందితుడు జావెద్ మహమ్మద్ అలియాస్ పంప్ ఇంటిని కూలదోయమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశించడమేమిటి? ఆయన ముఖ్యమంత్రా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమర్తా? అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండి పడ్డారు. జూన్ పదో తేదీన అల్లర్లకు కారకుడు అని పోలీసులు మహమ్మద్ ను అరెస్టు చేశారు. ఆదివారం ప్రయాగ్ రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పిడిఏ) అతని ఇంటిని కూల్చివేసింది.
జావెద్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు, యాక్టివిస్ట్ అఫ్రీన్ ఫాతిమా తండ్రి. గత ఏడాది కేంద్ర వివాదాస్పద సిటిజన్‌షిన్ చట్టాన్ని తీ వ్రంగా వ్యతిరేకించినవారితో ఫాతిమా వుంది. అసలు గత వారం జరిగిన అల్లర్లలోనూ ఆమె పాత్రగురించి విచారణా జరుగుతోంది. జావెద్ ఇంట్లో 12 బోర్ పిస్టల్, 315 బోర్ పిస్టల్, కాట్రెడ్జ్‌లు లభించాయని సీనియ ర్ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ కుమార్ వాదన. జావెద్ మహమ్మద్ ఇంటి నిర్మాణానికి అసలు అనుమతే లేదని కూల్చివేయాల్సి వస్తుందని, జూన్ 12 ఉదయం 11 గంటలకల్లా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసు పంపారు. కానీ చిత్రమేమంటే అసలు ఆ ఇంటి యజమాని జావెద్ భార్య.
ఆమె పేరుతో వున్న ఇంటిని కూల్చివేయాలంటే నోటీసు ఆమె పేరుమీద పంపాలి. అందుకు భిన్నంగా మహ్మద్ పేరుతో నోటీసు పంపడమేమిటని అసదుద్దీన్ విమర్శించారు.బిజెపి మాజీ అధికార ప్రతినిధి మహమ్మద్ ప్రవక్త పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో ప్రార్ధనల అనంతరం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగేయి. శనివారం ఉదయం మునిసిపల్ సిబ్బంది పోలీసుల పహారాలో షాహారాన్‌పూర్‌లో ఇద్దరు నిందితుల ఇళ్లను కూల్చివేసేరు. అలాగే కాన్పూర్‌లోనూ ఇళ్ల కూల్చివేత జరిగింది. గుజరాత్ కచ్‌లో జరిగిన సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ విధంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిలా ఆదేశాలు జారీ చేయడం, వెంటనే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఇళ్ల కూల్చివేతను చేపట్టడమేమిటని మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఈ మధ్య అల్లర్ల సందర్భంగా 300 మందికి పైగా అరెస్టయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణ పేర యోగి రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-yogi-up-cm-or-high-court-chief-justice-39-137557.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.