విశాఖ గ‌ర్జ‌న ప్ర‌భావ‌మెంత‌?

Publish Date:Oct 16, 2022

Advertisement

ప్ర‌శాంత విశాఖ‌ప‌ట్నంలో ఊహిం చ‌నివిధంగా రాజ‌కీయ‌ వాతా వ‌ర‌ణం వేడెక్కింది. మూడు రాజ‌ ధానుల కోరుతూ వైసీపీ విశాఖ గ‌ర్జ‌న ప్ర‌క‌ట‌న విశాఖ‌పై ఎంతో ప్ర‌భావం చూపింది. పాలనా వికేం ద్రీకరణకు మద్దతుగా విశాఖ పట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వ హించిన 'విశాఖ గర్జన'కు పెద్దఎత్తున ప్రజలు పోటెత్తారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి పార్క్‌ హోటల్‌ వైఎస్సార్‌ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాసంఘాల నేతలు, పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు పాల్గొన్నారు. సాయంత్రం జన సేన అధినేత పవన్‌కల్యాణ్‌ మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలకడానికి జన సైనికు లు, ఆయన అభి మానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. వీరంతా స్వచ్ఛందంగా వచ్చినవారు కావడంతో పోలీసులు  బెదిరించినా కదలకుండా ఆయన వచ్చిన దగ్గర నుంచి బీచ్‌ రోడ్డులో హోటల్‌కు చేరేంత వరకు ఆయనతో పాటే ఉన్నారు. ఆయన వాహనం లో టాప్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా తరలివెళ్లారు.  

శివారు ప్రాంతాల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో హ‌ఠాత్తుగా క్లాసులు రద్దు చేసి బస్సుల్లో విద్యార్థులను నగరంలోని ర్యాలీకి తీసుకువచ్చార‌న్న మాటా విన‌ప‌డుతోంది. ఇంకా నర్సింగ్‌ విద్యార్థులను ర్యాలీ ప్రారంభ వేదిక  అంబేడ్కర్‌ సెంటర్‌కు తీసుకు వచ్చారు. ఇంత చేసినా అధి కార పార్టీ నాయకుల ప్రయత్నం ఫలించలేదు. విశాఖలో శని వారం ఉదయం ఆరు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. తొమ్మిది గంటల సమయంలో వర్షం కాసేపు విరామం ఇవ్వడంతో ఆ నగరం నలు మూలల నుంచి జనాలను గుంపులుగా తరలించారు. పది గంటల సమయానికి సుమారు గా పది వేల మంది వరకు చేర‌గానే పాత జైలు రోడ్డు మార్గం కిక్కిరిసిపోయింది. అదే పదివేలుగా భావించిన పార్టీ నాయకులు ఉద‌యం 10.30 సమయంలో పాద యాత్ర ప్రారంభించారు. ఆ సమయంలోనే చిన్నగా మళ్లీ చినుకులు ప్రారంభమయ్యాయి.

సీనియర్‌ మంత్రి బొత్స సత్య నారా యణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీకృష్ణ, మాజీ మంత్రి కురసాల కన్న బాబు, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల, చిం తలపూడి తదితరులు ర్యాలీకి ముందుండి నడిచారు. ఆ తరువాత దశలవారీగా మేయర్‌ వెంకట హరికుమారి, మంత్రి రోజా తది తరులు రెండో బృందంగా బయలుదేరారు. ఆ తరువాత మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్‌ తదితరులు, మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఇంకా పలు వురు ర్యాలీలో పాల్గొన్నారు. వీరంతా పైడా కాలేజీ ముందు నుంచి సెవెన్‌ హిల్స్‌ జంక్షన్‌కు చేరి కాసింత ముందుకువెళ్లేసరికి మళ్లీ వర్షం మొదలైంది. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని గొడుగులు వేసుకొని ఆ వర్షంలోనే ముందుకు నడిచా రు. సుమారుగా 3.5 కిలోమీటర్ల దూరం నడిచి అంతా 11.45 గంటలకల్లా ర్యాలీ ముగింపు వేదిక అయిన పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ దగ్గరున్న వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ ర్యాలీ వల్ల ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దువ్వాడలోని విజ్ఞాన్‌ కాలేజీ నుంచి సుమారు పది బస్సుల్లో వేయి మంది విద్యార్థుల ను ఈ ర్యాలీ కోసం తీసుకువచ్చారు. వారు పార్క్‌హోటల్ వ‌ద్ద‌కు చేరుకునే సరికి సభ ముగిసిపోయింది. విశాఖ డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. దీనికి ముందు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పా టు చేశారు. విద్యార్థులు వాటిని ఆసక్తిగా తిలకించారు. ర్యాలీ ప్రారంభమై అవన్నీ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోగానే విద్యార్థు లు పక్కకు తప్పుకొన్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు వచ్చేశారు. వారిని తిరిగి ర్యాలీలోకి మళ్లించ డానికి నేతలు యత్నించినా ఫలితం కనిపించలేదు. 

ఈ సభకు హాజరైన వారిని గమనిస్తే విశాఖ జిల్లాలో పోటీ చేసే మా పార్టీ వారికి కనీసం డిపాజిట్‌ కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. సేవ్‌ విశాఖ పిలుపు ప్రజల్లో బలంగా వినిపిస్తోంద‌ని వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణరాజు అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. విశాఖ గర్జన సభ వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే బాగుండదని భావించి జేఏసీ పేరిట ఏర్పాటు చేశారన్నారు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి విశాఖ నగరంలో గర్జన ఫ్లెక్సీలు, హోర్డింగులను ఏర్పాటు చేశారని, జేఏసీకి అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇంత ప్రచారం చేసుకున్నా సభకు కనీసం 5 వేల మంది కూడా హాజరుకాలేదని తెలి పారు.

కాగా, అమరావతి రైతులు కాళ్లు కందిపోయేలా పాదయాత్ర చేస్తుంటే వారిని పెయిడ్‌ ఆర్టిస్టులని కొంతమంది నాయకులు అపహాస్యం చేయడం దారుణమని మండిపడ్డారు. విశాఖ జేఏసీ కేవలం పేరుకేనని, జేఏసీ నాయకులుగా వ్యవహ రించిన లజ పతి రాయ్‌, సాయిబాబాలు ఎవరికీ తెలియదన్నారు. విశాఖ గర్జనకు మంత్రులు రోజా, రజని, బొత్స సత్యనారా యణ, గుడివాడ అమర్నాథ్‌, అప్పలరాజు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్థానిక నేతలు మాత్రమే హాజర య్యారని, ధర్మాన ప్రసాద రావు ఎందుకు హాజ రు కాలేదని ప్రశ్నించారు. విశాఖలో లేనిది ఏదీ లేదని, విశాఖకు రావల సిన అంతర్జా తీయ విమానా శ్రయం రాలేదని, స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి పెడితే డీల్‌ కుదుర్చుకున్నారని, రైల్వే జోన్‌ కోసం ప్రయత్నమే చేయలేదని విమర్శించారు. విశాఖ గర్జనకు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, డ్వాక్రా మహిళలే హాజరయ్యారని, ఆంధ్ర వర్సి టీ విద్యా ర్థులకు బస్సులను ఏర్పాటు చేసి సభకు తరలించారని, డ్వాక్రా మహిళలను బలవంతంగా తెచ్చారని తెలిపారు.

విశాఖను రాజధానిగా స్థానికుల్లో అత్యధిక శాతం మంది వ్యతిరేకించారని రఘు రామ తెలిపారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సినిమాలు మాత్రం విశాఖలో ఆడాలి కానీ విశాఖను రాజధానిగా వద్దంటారా అంటూ కొంతమంది తమ పార్టీ నేతలు ప్రశ్నించా రని, అమరావతిని రాజధానిగా, విశాఖను మహా నగరంగా అభివృద్థి చేస్తామం టే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. కాగా, సేవ్‌ విశాఖ ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దామని, రాజ ధాని అమరావతిని కాపాడు కుందామని పిలుపునిచ్చారు.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.