విశాఖ గర్జన ప్రభావమెంత?
Publish Date:Oct 16, 2022
Advertisement
ప్రశాంత విశాఖపట్నంలో ఊహిం చనివిధంగా రాజకీయ వాతా వరణం వేడెక్కింది. మూడు రాజ ధానుల కోరుతూ వైసీపీ విశాఖ గర్జన ప్రకటన విశాఖపై ఎంతో ప్రభావం చూపింది. పాలనా వికేం ద్రీకరణకు మద్దతుగా విశాఖ పట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వ హించిన 'విశాఖ గర్జన'కు పెద్దఎత్తున ప్రజలు పోటెత్తారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాసంఘాల నేతలు, పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు పాల్గొన్నారు. సాయంత్రం జన సేన అధినేత పవన్‌కల్యాణ్ మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలకడానికి జన సైనికు లు, ఆయన అభి మానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. వీరంతా స్వచ్ఛందంగా వచ్చినవారు కావడంతో పోలీసులు బెదిరించినా కదలకుండా ఆయన వచ్చిన దగ్గర నుంచి బీచ్ రోడ్డులో హోటల్‌కు చేరేంత వరకు ఆయనతో పాటే ఉన్నారు. ఆయన వాహనం లో టాప్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా తరలివెళ్లారు. శివారు ప్రాంతాల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో హఠాత్తుగా క్లాసులు రద్దు చేసి బస్సుల్లో విద్యార్థులను నగరంలోని ర్యాలీకి తీసుకువచ్చారన్న మాటా వినపడుతోంది. ఇంకా నర్సింగ్ విద్యార్థులను ర్యాలీ ప్రారంభ వేదిక అంబేడ్కర్ సెంటర్‌కు తీసుకు వచ్చారు. ఇంత చేసినా అధి కార పార్టీ నాయకుల ప్రయత్నం ఫలించలేదు. విశాఖలో శని వారం ఉదయం ఆరు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. తొమ్మిది గంటల సమయంలో వర్షం కాసేపు విరామం ఇవ్వడంతో ఆ నగరం నలు మూలల నుంచి జనాలను గుంపులుగా తరలించారు. పది గంటల సమయానికి సుమారు గా పది వేల మంది వరకు చేరగానే పాత జైలు రోడ్డు మార్గం కిక్కిరిసిపోయింది. అదే పదివేలుగా భావించిన పార్టీ నాయకులు ఉదయం 10.30 సమయంలో పాద యాత్ర ప్రారంభించారు. ఆ సమయంలోనే చిన్నగా మళ్లీ చినుకులు ప్రారంభమయ్యాయి. సీనియర్ మంత్రి బొత్స సత్య నారా యణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీకృష్ణ, మాజీ మంత్రి కురసాల కన్న బాబు, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల, చిం తలపూడి తదితరులు ర్యాలీకి ముందుండి నడిచారు. ఆ తరువాత దశలవారీగా మేయర్ వెంకట హరికుమారి, మంత్రి రోజా తది తరులు రెండో బృందంగా బయలుదేరారు. ఆ తరువాత మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్ తదితరులు, మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఇంకా పలు వురు ర్యాలీలో పాల్గొన్నారు. వీరంతా పైడా కాలేజీ ముందు నుంచి సెవెన్ హిల్స్ జంక్షన్‌కు చేరి కాసింత ముందుకువెళ్లేసరికి మళ్లీ వర్షం మొదలైంది. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని గొడుగులు వేసుకొని ఆ వర్షంలోనే ముందుకు నడిచా రు. సుమారుగా 3.5 కిలోమీటర్ల దూరం నడిచి అంతా 11.45 గంటలకల్లా ర్యాలీ ముగింపు వేదిక అయిన పార్క్ హోటల్ జంక్షన్ దగ్గరున్న వైఎస్‌ఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ ర్యాలీ వల్ల ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దువ్వాడలోని విజ్ఞాన్ కాలేజీ నుంచి సుమారు పది బస్సుల్లో వేయి మంది విద్యార్థుల ను ఈ ర్యాలీ కోసం తీసుకువచ్చారు. వారు పార్క్‌హోటల్ వద్దకు చేరుకునే సరికి సభ ముగిసిపోయింది. విశాఖ డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. దీనికి ముందు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పా టు చేశారు. విద్యార్థులు వాటిని ఆసక్తిగా తిలకించారు. ర్యాలీ ప్రారంభమై అవన్నీ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోగానే విద్యార్థు లు పక్కకు తప్పుకొన్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వచ్చేశారు. వారిని తిరిగి ర్యాలీలోకి మళ్లించ డానికి నేతలు యత్నించినా ఫలితం కనిపించలేదు. ఈ సభకు హాజరైన వారిని గమనిస్తే విశాఖ జిల్లాలో పోటీ చేసే మా పార్టీ వారికి కనీసం డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. సేవ్ విశాఖ పిలుపు ప్రజల్లో బలంగా వినిపిస్తోందని వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణరాజు అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. విశాఖ గర్జన సభ వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే బాగుండదని భావించి జేఏసీ పేరిట ఏర్పాటు చేశారన్నారు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి విశాఖ నగరంలో గర్జన ఫ్లెక్సీలు, హోర్డింగులను ఏర్పాటు చేశారని, జేఏసీకి అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇంత ప్రచారం చేసుకున్నా సభకు కనీసం 5 వేల మంది కూడా హాజరుకాలేదని తెలి పారు. కాగా, అమరావతి రైతులు కాళ్లు కందిపోయేలా పాదయాత్ర చేస్తుంటే వారిని పెయిడ్ ఆర్టిస్టులని కొంతమంది నాయకులు అపహాస్యం చేయడం దారుణమని మండిపడ్డారు. విశాఖ జేఏసీ కేవలం పేరుకేనని, జేఏసీ నాయకులుగా వ్యవహ రించిన లజ పతి రాయ్, సాయిబాబాలు ఎవరికీ తెలియదన్నారు. విశాఖ గర్జనకు మంత్రులు రోజా, రజని, బొత్స సత్యనారా యణ, గుడివాడ అమర్నాథ్, అప్పలరాజు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్థానిక నేతలు మాత్రమే హాజర య్యారని, ధర్మాన ప్రసాద రావు ఎందుకు హాజ రు కాలేదని ప్రశ్నించారు. విశాఖలో లేనిది ఏదీ లేదని, విశాఖకు రావల సిన అంతర్జా తీయ విమానా శ్రయం రాలేదని, స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెడితే డీల్ కుదుర్చుకున్నారని, రైల్వే జోన్ కోసం ప్రయత్నమే చేయలేదని విమర్శించారు. విశాఖ గర్జనకు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, డ్వాక్రా మహిళలే హాజరయ్యారని, ఆంధ్ర వర్సి టీ విద్యా ర్థులకు బస్సులను ఏర్పాటు చేసి సభకు తరలించారని, డ్వాక్రా మహిళలను బలవంతంగా తెచ్చారని తెలిపారు. విశాఖను రాజధానిగా స్థానికుల్లో అత్యధిక శాతం మంది వ్యతిరేకించారని రఘు రామ తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలు మాత్రం విశాఖలో ఆడాలి కానీ విశాఖను రాజధానిగా వద్దంటారా అంటూ కొంతమంది తమ పార్టీ నేతలు ప్రశ్నించా రని, అమరావతిని రాజధానిగా, విశాఖను మహా నగరంగా అభివృద్థి చేస్తామం టే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. కాగా, సేవ్ విశాఖ ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దామని, రాజ ధాని అమరావతిని కాపాడు కుందామని పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/is-visakha-garjana-affective-39-145505.html





