జగనానందయ్య శిష్య పరమాణువు వాసిరెడ్డి పద్మ

Publish Date:Jul 20, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో   జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఆయన తొలి, మలి కేబినెట్‌లోని మంత్రి పుంగవులు.. మంత్రులుగా హుందాగా తమ తమ శాఖల వారీగా.. శాఖ పరంగా ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకరు ఇద్దరు మంత్రులు అదీ కూడా మచ్చుకు ఒకటో రెండో  సమావేశాలు సమీక్షలు నిర్వహించడం తప్పితే శాఖ మీద పట్టు సాధించడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.

అయితే  మంత్రులలో అత్యధికులు మాత్రం   ప్రెస్‌మీట్ లు పెట్టి  ప్రతిపక్ష పార్టీలపై, నాయకులపై  బండ బూతులతో విరుచుకు పడిపోవడం, తద్వారా అధినేత జగన్ మొప్పు పొందడం అన్న అంశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు  వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఇప్పుడు ఆ విషయంలో వాసిరెడ్డి పద్మ ఒక అడుగు ముందుకు వేశారని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆమె పై సెటైర్లు వేస్తున్నారు. మహిళా కమిషన్ చైర్మన్ గా ఆమె పదవిని ముఖ్యమంత్రి జగన్ ఊడబీకి చాలా కాలం అయినా ఆ విషయం కూడా తెలియకుండా  ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నానన్న భ్రమతో  వాసిరెడ్డి పద్మ ఇస్తున్న కలరింగ్ సూపర్బ్ గా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.  

ఈ ఏడాది మేలో  ముఖ్యమంత్రి జగన్ ఓ రహస్య  జీవో తో  వాసిరెడ్డి పద్మ ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పదవికి ఎసరు పెట్టారనీ, అయితే ఆ విషయం ఆమెకు తెలియదో.. లేక తెలిసినా అది రహస్య జీవో కనుక మరెవరికీ తెలియదన్న ధీమాయో కానీ వాసిరెడ్డి  పద్మ మాత్రం  ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్‌ హోదాలో  రౌండే టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం,   వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు  జారీ చేయడం వంటి చర్యలతో నవ్వుల పాలౌతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  

అయినా పదవి ఉందో.. ఊడిందో కూడా తెలుసుకోకుండా ఇలా నోటీసులు, జీవోలు, రౌండ్ టేబుల్ సమావేశాలంటూ హడావుడి చేయడం.. ఇంకోవైపు వరుస పెట్టి నోటీసులు జారీ చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి జగనన్న పదవి పీకేసిన సంగతి  ఇంతకీ వాసిరెడ్డి పద్మకు తెలుసా? లేదా? అనే సందేహాలు సైతం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోన్నట్లు సమాచారం. 

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  మూడు నెలలకు వాసిరెడ్డి పద్మను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ పదవిలో నియమించారు. ఈ పదవిలో ఆమె ఐదేళ్ల పాటు కొనసాగనున్నారని అందుకు సంబంధించిన జీవోని  సైతం ఈ ప్రభుత్వం విడుదల చేసింది.  దీంతో అసలు  లెక్క ప్రకారం 2024 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగాల్సి ఉంది.  అయితే జగన్ సర్కారు   సైలెంట్‌గా గుట్టు చప్పుడు కాకుండా  ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవీ కాలాన్ని రెండేళ్లు కుదిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 24న గెజిట్‌ ప్రచురించింది. దీని ప్రకారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ యాక్ట్ -2023 మే 2023 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా జీవోఎంఎస్ నెంబర్ 23 జారీ  చేసింది. ఈ ఏడాది మే 9వ తేదీన ఈ జీవో జారీ అయినట్లు తెలుస్తుంది. మే 15వ తేదీ నుంచి  ఇది  అమల్లోకి వస్తుందని క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది.

దీంతో ఆ రోజుతో వాసిరెడ్డి పద్మ పదవి కాలం ముగిసిపోయినట్లు అయింది. అయినా ఆమె ఇవేమీ పట్టకుండా.. జగనన్న స్ట్టైల్‌లో దూసుకోపోవడం చూస్తుంటే.. గంతకు తగ్గ బొంత అనే వ్యాఖ్యలు   పోలిటికల్ సర్కిల్‌లో  వినవస్తున్నాయి. అయినా పదవి పోయిన తర్వాత.. కూడా  ఇంకా ఆ పదవిలోనే ఉన్నట్లు వాసిరెడ్డి పద్మ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతోన్నాయి. అయినా వాసిరెడ్డి పద్మ భర్త వెస్లీకి ఎమ్మెల్యే సీటు ఇస్తే.. పార్టీలోకి వస్తానన్న ఒకే ఒక్క కండిషన్‌తో  అప్పట్లో ఆమె వైసీపీలోకి  ఎంట్రీ ఇచ్చారు.

ఆ క్రమంలో 2014లోనే కాదు.. 2019 ఎన్నికల్లో కూడా ఆమె భర్తకు ఎమ్మెల్యే సీటు అయితే కేటాయించలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. దానిని కాంపన్ సేట్ చేయడానికే జగన్ వాసిరెడ్డి పద్మకు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారనీ, అయితే అది కూడా  కూడా మూడునాళ్ల ముచ్చటే అయిందని పరిశీలకులు చెబుతున్నారు.   ఏదీ ఏమైనా జగన్ ప్రభుత్వంలో జగనానందయ్య శిష్యులు లెక్కలు మిక్కిలి ఉన్నారని.. వారిలో వాసిరెడ్డి పద్మ అనే ఓ శిష్యు పరమాణువుగా చేరిపోయారనే ఓ వ్యంగ్య చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.