వల్లభనేని వంశీ... ఉతుకుడు మొదలైందా?

Publish Date:Aug 3, 2024

Advertisement

నోట్లో నాలుకలకు బదులు దురదగుంట ఆకులు వున్న వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, బందరు పిచ్చోడు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు.... ఇలాంటి రాక్షస పార్టీ నాయకులంటే జనానికి ఎందుకో చెప్పలేనంత కసి. వాళ్ళని అర్జెంటుగా అరెస్టు చేసి కుళ్ళబొడిచేయాలని కోరుకుంటూ వుంటారు. ఇలాంటి కోరిక తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి వుంటే ఒకరకంగా అదొకరకం న్యాయం. కానీ, ఏ పార్టీకి చెందని సాధారణ జనబాహుళ్యం ఇలా కోరుకుంటున్నారు అదీ వెరైటీ! 

ఇంతకీ ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి, విధ్వంసం సృష్టించిన కేసులో అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా నిందితుడిగా వున్నారు. ఆయన ప్రత్యక్షంగా ఈ దాడిలో పాల్గొనకపోయినప్పటికీ, పర్‌ఫెక్ట్ స్కెచ్ వేసి, ఆయన అనుచరులను పురమాయించి దాడి జరిపించారు. రాక్షస పార్టీ అధికారంలో వుండగా వీళ్ళని పోలీసులు అరెస్టు చేయాలేదు. ఇప్పుడు అరెస్టు చేయడానికి రెడీ అయితే, అయ్యగారు జంప్! పోలీసులు వల్లభనేని వంశీని వెతికేపనిలో బిజీగా వున్న నేపథ్యంలో సార్ అమెరికా పారిపోయాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న అంటే, శుక్రవారం నాడు వల్లభనేని వంశీ అరెస్టు అయ్యాడన్న వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. దాంతో అదేంటో, జనం హ్యాపీగా ఫీలయ్యారు. ఒక వికెట్ పడింది.. ఇక మిగతా వికెట్లు కూడా పడాలి అనుకున్నారు. అయితే వాళ్ళు అలా ఆనందిస్తూ వుండగానే, మరో న్యూస్ బయటకి వచ్చింది. వల్లభనేని వంశీ అరెస్టు కాలేదు. అరెస్టు అయింది అతని ప్రధాన అనుచరుడు అని.

సాధారణంగా ఈ న్యూస్ వినగానే జనం నిరాశపడిపోవాలి. అడ్డెడ్డే.. అనవసరంగా హ్యాపీగా ఫీలయ్యామే అనుకోవాలి. కానీ, జనం అలా అనుకోవడం లేదు. వల్లభనేని వంశీ నిజంగానే అరెస్టు అయ్యాడు. పోలీసులు అతని అరెస్టు విషయాన్ని బయటపెట్టడం లేదు. ఓ వారం పదిరోజులు వీరబాదుడు బాది, ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే అరెస్టు చేశాం అని చెబుతారు. వల్లభనేని వంశీని రాష్ట్రంలో ఏ మారుమూల పోలీస్ స్టేషన్లోనే ఇప్పటికే ఉతకడం ప్రారంభించేసే వుంటారు... అనుకుంటున్నారు. ఈ దండుపాళ్యం బ్యాచ్ మీద జనానికి ఎంత కసి పెరిగిపోయి వుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. దేశంలో జనం వ్యతిరేకత పొందిన రాజకీయ నాయకులు చాలామంది వున్నారు. కానీ, ఈ రాక్షస జగన్ పార్టీ నాయకులంత వ్యతిరేకత ఇంతవరకు ఎవరూ పొందలేదని అనిపిస్తూ వుంటుంది. 

By
en-us Political News

  
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.!
ఫ్రీ బస్సులో భార్య.. నవ్వులు పూయిస్తున్న భర్త ఆవేదన. !
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.