వల్లభనేని వంశీ... ఉతుకుడు మొదలైందా?
Publish Date:Aug 3, 2024
Advertisement
నోట్లో నాలుకలకు బదులు దురదగుంట ఆకులు వున్న వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, బందరు పిచ్చోడు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు.... ఇలాంటి రాక్షస పార్టీ నాయకులంటే జనానికి ఎందుకో చెప్పలేనంత కసి. వాళ్ళని అర్జెంటుగా అరెస్టు చేసి కుళ్ళబొడిచేయాలని కోరుకుంటూ వుంటారు. ఇలాంటి కోరిక తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి వుంటే ఒకరకంగా అదొకరకం న్యాయం. కానీ, ఏ పార్టీకి చెందని సాధారణ జనబాహుళ్యం ఇలా కోరుకుంటున్నారు అదీ వెరైటీ! ఇంతకీ ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి, విధ్వంసం సృష్టించిన కేసులో అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా నిందితుడిగా వున్నారు. ఆయన ప్రత్యక్షంగా ఈ దాడిలో పాల్గొనకపోయినప్పటికీ, పర్‌ఫెక్ట్ స్కెచ్ వేసి, ఆయన అనుచరులను పురమాయించి దాడి జరిపించారు. రాక్షస పార్టీ అధికారంలో వుండగా వీళ్ళని పోలీసులు అరెస్టు చేయాలేదు. ఇప్పుడు అరెస్టు చేయడానికి రెడీ అయితే, అయ్యగారు జంప్! పోలీసులు వల్లభనేని వంశీని వెతికేపనిలో బిజీగా వున్న నేపథ్యంలో సార్ అమెరికా పారిపోయాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న అంటే, శుక్రవారం నాడు వల్లభనేని వంశీ అరెస్టు అయ్యాడన్న వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. దాంతో అదేంటో, జనం హ్యాపీగా ఫీలయ్యారు. ఒక వికెట్ పడింది.. ఇక మిగతా వికెట్లు కూడా పడాలి అనుకున్నారు. అయితే వాళ్ళు అలా ఆనందిస్తూ వుండగానే, మరో న్యూస్ బయటకి వచ్చింది. వల్లభనేని వంశీ అరెస్టు కాలేదు. అరెస్టు అయింది అతని ప్రధాన అనుచరుడు అని. సాధారణంగా ఈ న్యూస్ వినగానే జనం నిరాశపడిపోవాలి. అడ్డెడ్డే.. అనవసరంగా హ్యాపీగా ఫీలయ్యామే అనుకోవాలి. కానీ, జనం అలా అనుకోవడం లేదు. వల్లభనేని వంశీ నిజంగానే అరెస్టు అయ్యాడు. పోలీసులు అతని అరెస్టు విషయాన్ని బయటపెట్టడం లేదు. ఓ వారం పదిరోజులు వీరబాదుడు బాది, ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే అరెస్టు చేశాం అని చెబుతారు. వల్లభనేని వంశీని రాష్ట్రంలో ఏ మారుమూల పోలీస్ స్టేషన్లోనే ఇప్పటికే ఉతకడం ప్రారంభించేసే వుంటారు... అనుకుంటున్నారు. ఈ దండుపాళ్యం బ్యాచ్ మీద జనానికి ఎంత కసి పెరిగిపోయి వుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. దేశంలో జనం వ్యతిరేకత పొందిన రాజకీయ నాయకులు చాలామంది వున్నారు. కానీ, ఈ రాక్షస జగన్ పార్టీ నాయకులంత వ్యతిరేకత ఇంతవరకు ఎవరూ పొందలేదని అనిపిస్తూ వుంటుంది.
http://www.teluguone.com/news/content/is-vallabhaneni-vamsi-arrested-39-182148.html





