అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. కారణమదేనా?

Publish Date:Aug 23, 2022

Advertisement

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అయిన అమిత్ షా హీరో జూనియర్ ఎన్టీఆర్ ల భేటీ తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించింది. వారి మధ్య భేటీ జరిగి రెండు రోజులు గడిచిపోయినా ఆ విషయంపై చర్చోప చర్చలు ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి. ఎప్పుడో 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ ఆగ్రనేత ఆయనను స్వయంగా ఢిన్నర్ మీట్ కు ఆహ్వానించడం.. ఆ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఆయనను కలవడం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. ఈ భేటీపై పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించారనీ, తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారనీ.. ఇలా పలు రకాల చర్చలు తెరమీదకు వచ్చాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారైతే ఇరువురి మధ్యా రాజకీయ చర్చలే జరిగి ఉంటాయని చెప్పారు. బీజేపీ, వైసీపీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ తో భేటీపై అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ ఓ అద్భుత నటుడితో భేటీ ఎంతో సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు. ఇక బీజేపీ సీనియర్లు అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో ఆయనతో భేటీ కావాలని భావించారని, అందుకే ఆయన ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ భేటీ అయ్యారనీ చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా తెలుగు ఇండస్ట్రీలో మరో టాక్ జోరుగా వినిపిస్తున్నది. 

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. అందుకు సినిమాను కూడా బలమైన ఆయుధంగా వాడుకోవాలని భావిస్తోంది. అందుకే తెలంగాణ సాయుధ పోరాట యోధుల అణచివేతకు నిజాం నవాబు రజాకార్లను పంపిన సంఘటనలపై రజాకార్ ఫైల్స్ అనే సినిమాను తెరకెక్కించాలన్న యోచనలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఆ సినిమాకు ఇప్పటికే కథ సిద్ధమైందని కూడా అంటున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి, ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఆ కథను ప్రధాని మోడీకి వినిపించినట్లు కూడా చెబుతున్నారు. రజాకార్ ఫైల్స్ కథ వినడం కోసం ఐదు నిముషాల పాటు విజయేంద్ర ప్రసాద్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ దానికి ఇరవై నిముషాలకు పెంచినట్లు కూడా చెబుతున్నారు. ఆ కథకు కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ అయితేనే సరిపోతారని విజయేంద్ర ప్రసాద్ భావించారనీ అదే విషయాన్ని మోడీతో చెబితే మోడీ అమిత్ షాతో ఒక సారి జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడాల్సిందిగా  చెప్పారనీ, ఆ పర్యవశానమే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ అని చెబుతున్నారు. రజాకార్ ఫైల్స్ సినిమా తెలంగాణలో బీజేపీ పలుకుబడి పెంచుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని అంటున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్రకు సర్వత్రా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాజాకార్ ఫైల్స్ సినిమాలో నటిస్తే కాశ్మీర్ ఫైల్స్ ను మించి ప్రజలను ఆకట్టుకుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్ ను సినిమాతో ఆపేయకుండా వెబ్ సిరీస్ కూడా తీయాలన్న భావనతో ఉన్నారనీ, రెంటిలోనూ జూనియర్ ఎన్టీఆరే ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని  చెబుతున్నారు. అయితే ఈ వార్త ధృవపడాల్సి ఉంది. మొత్తం మీద అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయ, సినీ రంగాలలో హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ అగ్రనేత అమిత్ షా‌తో జూనియర్ ఎన్టీఆర్‌ భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొన్నేళ్లుగా సినిమాలు తప్ప మరో ప్రపంచమే తెలియని తారక్.. మళ్లీ రాజకీయాల వైపు వస్తున్నారా..? కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో యంగ్ టైగర్ భేటీ వెనక  ఆంతర్యమేంటి..? ట్రిపుల్ ఆర్ కోసమే అయితే.. రామ్ చరణ్ లేకుండా స్పెషల్ మీటింగ్ ఎందుకు..? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడం ఎక్కడలేని ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ వర్గాల్లో కంటే.. రాజకీయంగా ఈ భేటీ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. బీజేపీ అగ్ర నేతతో తారక్‌కు పనేంటి..? అంత ప్రత్యేకంగా ఈ ఇద్దరూ కలవడానికి కారణమేంటంటూ ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ట్రిపుల్ ఆర్‌లో కొమరం భీమ్ పాత్ర నచ్చి.. అమిత్ షా ప్రశంసించారని తారక్ వర్గాలు చెప్తున్న మాట. అయితే ఈ భేటీ వెనుక పాలిటిక్స్ తప్ప మరొకటి లేదన్నది మరికొందరి అభిప్రాయం. భేటీ తర్వాత ఎలాంటి లీకులు రాకపోవడంతో నిజంగా వారిద్దరూ ఏ అంశాలపై చర్చించారన్న ఆసక్తి నెలకొంటోంది.

తారక్, అమిత్ షా భేటీ వెనక మరో వార్త టాలీవుడ్ వర్గాల్లో బాగా వైరల్ అవుతుంది. ది కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే.. రజాకార్ ఫైల్స్ అనే సినిమా ఒకటి త్వరలోనే రాబోతుంది. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. బిజేపీ ప్రభుత్వ సపోర్ట్‌తోనే రజాకార్ ఫైల్స్ భారీ ఎత్తున తెరకెక్కబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో తారక్‌ను నటింపచేయాలనేది పార్టీ ఎత్తుగడలా కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. తారక్, అమిత్ షా మధ్య రాజకీయ చర్చకు తావేం లేదని.. కేవలం ఈ రజకార్ ఫైల్స్ సినిమా గురించి చర్చించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అటు రాజకీయం, ఇటు సినిమాలపై పూర్తి అవగాహన ఉన్న తారక్.. తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తును అంచనా వేసుకునే నిర్ణయం తీసుకుంటారనే అతన్ని దగ్గర్నుంచి గమనించిన వాళ్ళకు అర్థమవుతుంది. మరి రజాకార్ ఫైల్స్ విషయంలో అమిత్ షా తారక మంత్రం ఎంతవరకు పని చేస్తుందనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.