Publish Date:Nov 12, 2024
మాజీ మంత్రి కెటీఆర్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వహాయంలో ఫార్ములా ఈ రేస్ కుంభకోణం జరిగిందని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధారాలు సేకరించింది. ఐఎఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం 55 కోట్ల నిధులను కెటీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకే నిర్వహణ సంస్థకు బదిలీ చేసి నట్లు చెప్పారు.
అవినీతి నిరోధక చట్టం 17 ఏ క్రింద కెటిఆర్ ను అరెస్ట్ చేయనుందని తెలుస్తోంది. గతంతో ఎపిలో ఇదే చట్టం క్రింద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసింది. నిధుల దుర్వినియోగం జరిగితే కెటీఆర్ తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశముంది. ఏడు సంవత్సరాలు చట్ట సభలకు పోటీ చేసే అవకాశం ఉండదు. గవర్నర్ అనుమతి తీసుకుని ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇదే యాక్ట్ క్రింద అరెస్ట్ చేస్తే మూడు నెలల వరకు బెయిల్ రాకపోవచ్చు. తన ఆదేశం మేరకే అరవింద్ నిధులు బదిలీ చేశారని కెటీఆర్ సైతం అంగీకరించడంతో అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. మంత్రి పొంగులేటి గత నెలలో సియోల్ పర్యటనలో ఉన్నప్పుడే కెటీఆర్ అరెస్ట్ కావచ్చు అని సూచనాప్రాయంగా తెలిపారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబు పేలనున్నట్లు తెలిపారు. కెటీఆర్ అరెస్ట్ తో అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించింది. నిధుల దుర్వినియోగం కేసులో ఎసిబి ఫైల్ సిద్దం చేసింది. ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట పెరిగిందని బిఆర్ఎస్ అంటోంది. కెటీఆర్ బావమరిదికి లాభం చేకూరేలా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారని కాంగ్రెస్ ఆరోపించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-the-field-ready-for-the-arrest-of-former-minister-ktr-39-188277.html
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.