బొమ్మ దించేయ‌డం అంత‌ సులువా సంజ‌యా!

Publish Date:Jul 12, 2022

Advertisement

చాలాకాలం క్రితం ఒకాయ‌న‌కు ఇంటిద‌గ్గ‌ర చౌరాస్తాలో బొమ్మ న‌చ్చ‌లేద‌ని తీసేయించాడ‌ట‌. మ‌రో పెద్దా య‌న త‌న స్నేహితుడి పెయింటింగ్ గురించి పొగ‌డ్త‌లు వినివినీ చిరాకేసి బొమ్మ‌ను చీప్‌గా అమ్మే శాడ‌ట‌. సినీ హీరోల వీరాభిమానులు ఫ్లెక్సీల యుద్ధాలు త‌రచూ చూస్తూనే వున్నాం, వింటూనే వున్నాం. ఇపుడు బిజెపి తెలంగాణా అధ్య‌క్షుడు బండి సంజయ్ కూడా ఇలాంటి ప‌ట్టుద‌ల‌తోనే వున్నారు.. కేసీఆర్‌ను గ‌ద్దె దించేయాల‌ని! 

రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకుని, రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌జాద‌ర‌ణ వున్న వ్య‌క్తిని అమాంతం ఎలా దించేస్తా రో  క‌మ‌ల‌నాధుల‌కే ఎరుక‌.  తెలంగాణా ప్ర‌భుత్వం ఏర్ప‌డి నప్ప‌టి నుంచి బిజెపి వారికి ఏమాత్రం నిద్ర ప‌ట్టడం లేదు. కేసీఆర్‌ను ఏదో విధంగా ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టి,  అధికారాన్ని చేజిక్కించుకోవ‌డా నికి విశ్వ‌య‌త్నాలు చేస్తూనే వున్నారు. ప్ర‌తీ రోజు ఏదో ఒక మిష‌తో ధ్వ‌జ‌మెత్త‌డం ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే చేస్తున్నారు. కాషాయం దండు ఎన్నిక‌ల కోస‌మే ఎదురుచూస్తున్న‌ట్టుగా అనిపిస్తుంది. వారిని ఏ క్ష‌ణాన్న యినా ఈల వేయ‌గానే రంగంలోకి దిగాల‌ని బండివారి ఆదేశం మ‌రి!

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్‌ అన్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, సీఎం సీటు నుంచి కేసీఆర్ ను ప్రజలు దింపేయడం ఖాయమని చెప్పారు. రాత్రిపూట కేసీఆర్‌ చేసిన సవాల్‌ను ఎవరూ నమ్మరని, ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని చెప్పారు. బీజేపీని బద్‌నాం చేసి కేసీఆర్‌ రాజకీయ లబ్ధి పొందుతున్నారని, దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికలు తాము చెబితే జరిగాయా? అని ప్రశ్నించారు. అయినా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గతంలో ఇచ్చిన హామీ మేరకు పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, ధరణి పోర్టల్‌లో తలెత్తిన లోపాలను సరిదిద్ది ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కరీంనగర్‌లో సంజయ్‌ మౌనదీక్ష చేపట్టారు. దీక్షానం త‌రం మాట్లాడుతూ ఆయ‌న‌ అడవి బిడ్డల దగ్గరికే వచ్చి కుర్చీ వేసుకుని కూర్చొని పోడు భూముల సమస్య లు పరిష్క రిస్తానని, పట్టాలిస్తానని, ధరణి లోపాలను సవరిస్తానని కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.

అవినీతిని తగ్గించడానికే ధరణి పోర్టల్‌ తెచ్చామంటూ.. ప్రశాంతంగా ఉన్న ఊళ్లలో కేసీఆర్‌ చిచ్చుబెట్టా రని బండి సంజయ్‌ మండిపడ్డారు. సుమారు యాభ‌య్యేళ్ల  క్రింద‌ట‌ భూములు అమ్ముకున్నవాళ్లు, వాటిని వదిలేసి వెళ్లి పోయిన వాళ్లంతా ఇవాళ ఊర్లోకి వచ్చి రైతులమీద పడి భూములు లాక్కుంటున్నారని, దీంతో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల గుండెలు పగిలిపోతున్నాయని తెలిపారు.  కరెక్షన్‌ చేసు కునే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్‌ అంటున్నారని, ప్రజలు ఓటు అనే ఆయుధంతో కరెక్షన్‌ చేస్తా రనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిన్నటిదాకా జర్నలిస్టులు ప్రశ్నిస్తే దబా యించిన సీఎం ఈ రోజు జర్నలిస్టులను బతిమిలాడుకునే స్థితికి వచ్చారంటే అది బీజేపీ చేసిన పోరాట మేనని అన్నారు. పోడు భూముల్లో పంటలు సాగు చేసుకోవాలని సీఎం కేసీఆరే చెప్పారని, పంట వేసుకొని తీరా చేతికి వచ్చాక అటవీశాఖ అధికారులు, పోలీసులతో దాడులు చేయించి పంటను నాశనం చేయించ డమే కాకుండా వారిపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. పేదలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించాలని, పోడు భూములకు పట్టాలిచ్చి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.

అయితే, బిజెపివ‌న్నీ తాటాకు చ‌ప్పుళ్లే అని ఏదో విని, ఏదో చూసి ఖంగారెత్తి అరిచే పిల్లాడిలా గోల చేయ డం త‌ప్ప వీస‌మెత్తు రుజువు చేసే స్థితిలో బిజెపి నాయ‌కులు లేర‌ని టిఆర్ ఎస్ నాయ‌కుల మాట‌. దేశ మంతా  జోరీగ‌లా గోల చేయ‌డంతో రాజ్యాధికారం ఖాయం చేసుకోవ‌చ్చ‌న్న పిచ్చి న‌మ్మ‌కాల‌తో  అన్ని ప్రాంతాల్లో  ఉద్య‌మాలు చేయాల‌న్న ఉత్సాహం నింపుకోవ‌డం బండి సంజ‌య్ కి మ‌హా స‌ర‌దాగా వుంది. జ‌నాన్ని వేసుకుని తిర‌గ‌డం, ఉద్య‌మిస్తున్నామ‌ని భారీ ప్ర‌చారంతో నాలుగు జంక్ష‌న్ల‌లో హ‌డావుడి చేయ డం  బిజెపి వారికి వెన్న‌తో పెట్టిన విద్య‌. ఆ వెన్న తెలంగాణాలో చేదెక్కిన సంగ‌తి ప్ర‌జ‌లు, ఓట‌ర్లు గ్ర‌హిస్తు న్నార‌న్న‌ది క‌మ‌ల‌నాధులు తెలుసుకోవాల‌ని టిఆర్ ఎస్ హాస్యోక్తులు జోడించి మ‌రీ చెబుతోంది. 

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ, టిఆర్ ఎస్‌, బిజెపి వారి దూకుడు, ఆవేశాల‌న్నీ మౌనంగా చూస్తున్న కాంగ్రెస్ నాయ కులు న‌వ్వుకుంటున్నారు. వీరిద్ద‌రి నాట‌కాలు, చిత్ర‌విచిత్ర భాషోద్య‌మం తెలంగాణా ప్ర‌జ‌లు వింటూ, చూస్తూ బ‌హు పెద్ద హాస్య కామెడీ చూస్తున్నామ‌నే భావ‌న‌లోకి వ‌చ్చేశారని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. చిత్ర‌మేమంటే వారూ, వీరూ కొట్టుకుని వెన‌కాలున్న‌వాడికి దారిచ్చార‌న్న సామెత‌గా వుంది. కాంగ్రెస్ ఈ ప‌రిస్థితుల‌ను చాలా తెలివిగా ఉప‌యోగించుకోవ‌డంలోనే తెలంగాణాలో ఆ పార్టీ నిల‌బ‌డేందుకు వీల‌వు తుంది. ప్ర‌జ‌లు కేవ‌లం ఓట‌ర్లు కాద‌న్నది బిజెపికి ఇంకా గ్ర‌హించ‌క‌పోవ‌డం మ‌రీ విడ్డూరం. 

By
en-us Political News

  
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.