Publish Date:Sep 15, 2025
సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాయిస్ సజ్జల రామకృష్షారెడ్డే. వైసీపీ అధికారంలో ఉండగా సజ్జల డిఫాక్టో సీఎంగా వ్యవహరించారు. సకల శాఖల మంత్రిగా పేరు గడించారు. ఏ శాఖకు సంబంధించైనా సరే ఆ శాఖ మంత్రికి సంబంధం లేకుండా, కనీస సమాచారం కూడా లేకుండా సజ్జల నిర్ణయాలు తీసుకునే వారు. మీడియా సమావేశాలు నిర్వహించే వారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొంత కాలం సజ్జల మౌనం వహించినా.. ఆ తరువాత షరా మామూలే. జగన్ కుడి భుజంగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. పార్టీలో జగన్ తరువాత స్థానం సజ్జలదే అని పార్టీ శ్రేణులు కూడా చెబుతాయి.
అయితే తాజాగా జగన్ దగ్గర సజ్జల సీన్ అయిపోయిందని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. ఇంత హఠాత్తుగా సజ్జలకు అంతటి మర్యాద? ఎందుకయ్యా అంటే.. పార్టీ వర్గాలు చెబుతున్నదానిని పట్టి.. ఇటీవల అమరావతి రాజధాని విషయంలో వైఎస్ జమన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అంటున్నారు పరిశీలకులు, ఐను ఇటీవల జస్జల చేసిన ప్రకటన,వ్యాఖ్యలు వైసీపీకి తీరని డ్యామేజీ చేశాయని అంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇక మూడు రాజధానుల మాటే ఎత్తదు? అమరావతే రాజధాని, విశాఖ కానే కాదు. జగన్ తాడేపల్లిలోనే ఉంటారు. గుంటూరు, విజయవాడల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానికి అభివృద్ధి చేస్తారు. అని ఆయన మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టేశారు.
జగన్ అమరావతి రాజధానిక సానుకూలంగా ఉన్నారనీ, విశాఖ ఊసే ఎత్తరు అని చెప్పడం ద్వారా జగన్ హయాంలో మూడు రాజధానుల విధానం తప్పు అని ఒప్పుకోవడమే కాకుండా.. ఎలాంటి ప్రణాళికా, వ్యూహం లేకుండా కేవలం చంద్రబాబుపై కక్షతోనే ఇప్పుడు జగన్ అమరావతికి జై కొడుతున్నారన్న ప్రచారం ప్రజలలో బలంగా వెళ్లిపోయింది. అంతే కాకుండా అధికారంలో ఉన్నంత కాలం మూడు రాజధానులంటూ జగన్ కాలక్షేపం చేయడం కక్ష సాధింపుతోనే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోపం కాదని సజ్జల తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేసినట్లైంది. దీంతో జగన్ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది. ఈ కారణంగానే జగన్ సజ్జలను పూర్తిగా పక్కన పెట్టేశారని అంటున్నారు. అంతే కాదు సొంత మీడియాలో కానీ, పార్టీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా సజ్జల పేరు, ఫొటో కనిపించడానికి వీల్లేదన్న ఆదేశాలు కూడా జారీ చేసినట్ల చెబుతున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా జగన సొంత మీడియాతో పాటు సామాజిక మాధ్యమంలో కూడా సజ్జల నిపించడం లేదు. వినిపించడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-sajjala-chapter-closed-in-ycp-39-206202.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.