Publish Date:Jul 12, 2022
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తాజా మాజీ మంత్రి పేర్ని నానీ వ్యాఖ్యలు, వాటికి కౌంటర్‌గా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు, ట్వీట్ కౌంటర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. వైసీపీలోని కొందరు మరీ ముఖ్యంగా పేర్ని నాని వంటి వారు నోటి విరోచనాలతో బాధపడుతున్నారని నాగబాబు ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. పేర్నికి ఇప్పుడు కావలసింది తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమేననీ, బందరులో వైద్యుడు ఉంటే.. ఆయన నోటి విరోచనాలకు మందు ఇవ్వాలని కోరుతున్నాననీ నాగబాబు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.
అదే సమయంలో జనసేనానిపై పేర్ని నాటి వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్లీనరీలో ఇష్టారీతిన మాట్లాడి జగన్ వద్ద మార్కులు కొట్టేయడానికి చేసిన ప్రయత్నం ఫ్లాప్ అయ్యిందని పేర్ని నానిని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఎంత తాపత్రేయపడినా నానికి మార్కులు పడలేదనీ, మరో తాజా మాజీ మంత్రి అనీల్ కుమార్ జగన్ వద్ద గుడ్ విల్ సంపాదించేశాడన్న దుగ్ధతోనే, ఫ్రస్ట్రేషన్ తోనే ప్లీనరీ ముగిసిన 24 గంటల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చి మరీ పవన్ కల్యాణ్ మీద ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో నవరత్నాలంటూ ఇచ్చిన హామీలు నకిలీవని ఇప్పుడు తేలిపోవడం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. మీడియా సమావేశంలో పేర్ని నాని జనం జగన్ ను నమ్మారు, నమ్మారంటూ పదేపదే చెప్పడాన్ని కూడా ప్రశ్నించి ఎద్దేవా చేస్తున్నారు.
నిజంగా జగన్ ను జనం నమ్మి ఉంటే ప్రశాంత్ కిశోర్ వ్యూహాల అవసరమేమిటని ప్రశ్నించారు. ఇటీవల బందరులో స్థానిక ఎంపీ బాలశౌరి పర్యటనను అడ్డుకొనేందుక నీ రైట్ హ్యాండ్ స్థానిక కార్పొరేటర్, నీ కుమారుడి జాన్ జిగ్రీ దోస్త్‌ను ఎగదోసి... ఆ తర్వాత జగన్, సజ్జల చేత అక్షింతలు వేయించుకొన్న పేర్ని నాని, తాడేపల్లి ప్యాలెస్ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వద్ద ఘొల్లు మని ఏడ్చింది నిజంకాదా అని నిలదీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బందరులో తన గెలుపు సాధ్యం కాదని ముందే తెలుసుకున్ననాని, ఓటమి బలిపీఠంపై కుమారుడు పేర్ని కిట్టును నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-perneni-in-frustration-25-139545.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.