Publish Date:Jul 19, 2025
వైసీసీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేర సామ్రాజ్య పునాదులు కదిలిపోతున్నాయా? మిథున్ రెడ్డి అరెస్టు ఆ దిశగా తొలి అడుగా అంటే ఔననే సమాధానమే వస్తోంది. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అరాచకత్వం హద్దులు లేనట్టుగా సాగింది. అధికారాన్ని అడుపెట్టుకుని ఆయన కబ్జాలు, దౌర్జన్యాలకు యథేచ్ఛగా పాల్పడ్డారన్న ఆరోపణలు వాస్తవమేని తేలుతోంది. జగన్ హయాంలో ఆయన హద్దూపద్దూ లేకుండా సాగించిన కబ్జా వ్యవహారాలన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
అటవీ భూములను ఆక్రమణలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్దం కేసు విచారణలో పైళ్ల దగ్దం ప్రమాదశాత్తూ జరిగింది కాదని తేలింది. ఆ ఫైళ్ల దగ్ధం వెనుక ఉన్నది పెద్దిరెడ్డి అనుచరులేనని దర్యాప్తులో తెలడంతో ఆయన అనుచరులు అరెస్టు కూడా అయ్యారు. ఇలా పెద్దిరెడ్డి అక్రమాలు, దౌర్జన్యాలూ ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆయన కుమారుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ శనివారం (జులై 19) అరెస్టు చేయడంతో ఇక పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్య పునాదులు కదిలిపోయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇంత కాలం ఏం చేసినా ఎదురేలేదన్నట్లుగా సాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఇక సాగడం లేదని ప్రస్ఫుటమైందని అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు గతంలో చేసిన అక్రమాలు అన్యాయాలు, దౌర్జన్యాలకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మద్యం కుంభకోణంలో మిధున్ రెడ్డి అరెస్టయ్యారనీ, అలాగే తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, తిరుపతిలో భూ కబ్జాల వ్యవహారంలో పెద్దిరెడ్డి అరెస్టు కూడా తప్పదని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-peddireddy-ramachandrareddy-arrest-inevitable-39-202313.html
కాళేశ్వరం కమిషన్ నివేదికను త్వరలోనే శాసన సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది.
తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు.
ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు.
సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కవితను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని గట్టిగా చెబుతున్నారు.
తొమ్మిదో తేదీ రాఖీ పండగ వస్తోంది. అన్నా చెల్లెళ్ల బంధం మరంత పెరుగుతుందేమో అని చూస్తే.. కేటీఆర్ టార్గెట్ గా కవిత మరిన్ని అస్త్రాలు సంధించడంతో గులాబీ దళాలు మరింత నీరసపడ్డట్టు తెలుస్తోంది. జగదీశ్వర్ రెడ్డిలాంటి వారి చేత తనను తిట్టించడం వెనక పెద్ద నాయకుడు ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయ్.