ఇక కవిత రాజకీయాలకు దూరం అయినట్లేనా.. లిక్కర్ స్కాం ఆరోపణలతో కేసీఆరే దూరం పెట్టారా?
Publish Date:Nov 7, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కవితను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం పెడుతున్నారా? అందుకు అవసరమైన రంగం సిద్ధం చేసేశారా? అంటే తెరాస వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమెను రాజకీయాల నుంచి దూరంగా ఉంచి బీఆర్ఎస్ జాతీయ, అంతర్జాతీయ మీడియా కోఆర్డినేటర్ గా హస్తినకే పరిమితం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోదని తెలుగు వన్ ముందే చెప్పింది. తెలుగు వన్ అంచనా వాస్తవమే అనడానికి కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ..ఉద్యమ కాలం నుంచీ తెరాసలో అత్యంత చురుకుగా ఉన్న కవిత.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎవరికీ కనిపించకుండా ముఖం చాటేయడమే నిదర్శనం అని చెప్పవచ్చు. మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చే సంరంభంలో కూడా కవిత ఎక్కడా కనిపించలేదు. చివరాఖరికి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించిన తరువాత ఆమె నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించారు. అదీ కార్తీక సోమవారం సందర్భంగా. అసలు ఇన్ని నెలల పాటు ఎక్కడ ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు ప్రజలకు మొహం చాటేశారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను కేసీఆర్ ఉద్దేశ పూర్వకంగా దూరం పెట్టారా? అంటే తెరాస శ్రేణులు ఔననే అంటున్నాయి. అయితే మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు. కార్తీక సోమవారం సందర్భంగా నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజలు ఉంటారనే విషయం మరోసారి రుజువైందన్నారు. టీఆర్ఎస్ పై విమర్శలు చేసేవారికి ఈ ఉప ఎన్నికలో ప్రజల తీర్పు చెంపపెట్టు అని అమె అభివర్ణించారు. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు తప్పకుండా కేసీఆర్ పక్షానే ఉంటారనే విశ్వాసం ఉందని కల్వకుంట్ల కవిత ఉద్గాటించారు. అయితే కల్వకుంట్లు కవిత.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన.. దాదాపు 18 గంగటల తర్వాత ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంపై సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు సెటైర్లు సంధిస్తున్నారు. సినిమాలో జరగాల్సిందంతా జరిగాకా.. క్లైమాక్స్ సీన్‌లో పోలీసులు వచ్చినట్లు.. మునుగోడు ఉప ఎన్నిక ఎపిసోడ్ పూర్తయిపోయిన తరువాత కవిత మీడియా ముందుకు వచ్చిందని నెటిజనులు సెటైరికల్‌గా కామెంట్ చేస్తున్నారు. అప్పుడే అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చినట్లుగా కవిత వ్యవహారశైలి ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అంతే కాదు... మునుగోడు ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన నాటి నుంచి ఆ ఉప ఎన్నిక ఫలితం వెలువడే వరకు ఎక్కడ ఉన్నారంటూ కవితని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదీ కూడా టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న తర్వాత వెలువడిన తొలి ఫలితం కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయని.. వాటిలో కూడా కవిత ఎక్కడ కనిపించలేదు. మరోవైపు ఈ ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొందని... ఆ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ సంస్థల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లతోపాటు కీలక నేతలను సైతం సీఎం కేసీఆర్.. మునుగోడులో మొహరించారని... సదరు నియోజకవర్గాన్ని యూనిట్లుగా విభజించి... వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. స్వయంగా సీఎం కేసీఆర్ కూడా మనుగోడు బహిరంగ సభలో పాల్గొన్నారు. కేటీఆర్ సైతం నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేశారు. ఇలా పార్టీ మొత్తం మునుగోడు ఉప ఎన్నిక కోసం చెమటోడిస్తే.. స్వయానా కేసీఆర్ కుమార్తె అయి ఉండీ, ఎమ్మెల్సీ అయి ఉండీ ప్రచారంలో ఎక్కడా ఎందుకు కనిపించలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ లీక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆమెను మునుగోడు ఉప ఎన్నికకు దూరంగా ఉంచారని టీఆర్ఎస్ వర్గాలలో చర్చ అయితే జరుగుతోంది. ఓ వేళ ఆమె ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తే.. ప్రత్యర్థి పార్టీ చేతికి ఆయుధం ఇచ్చినట్లు అవుతోందని భావించడం వల్లనే కేసీఆర్ కావాలనే ఆమెను మునుగోడు పరిసరాలకు కూడా రానివ్వలేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇంకో వైపు కల్వకుంట్ల కవిత ఉత్తర భారతదేశంలోని పలు పుణ్య క్షేత్రాలు, దర్గాలు సందర్శన చేస్తున్నఫొటోలు సోషల్ మీడియా సాక్షిగా తెగ హల్‌చల్ చేయడాన్ని ప్రస్తావిస్తూ... దీంతో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడ ఇంత హడావుడి ఉంటే.. ఆమె అక్కడ డివోషనల్ టూర్ ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ మీడియా సమన్వయ కర్తగా తన కుమార్తె కవిత హస్తినకు పరిమితం చేయడం ద్వారా లిక్కర్ స్కాం ప్రకంపనలు తమ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై ప్రబావం చూపకుండా జాగ్రత్తలు కేసీఆర్ తీసుకున్నారని అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను పూర్తిగా దూరం పెట్టడం ద్వారా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రభావం ఇక్కడ ప్రతిఫలించకుండా ఉండేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస వర్గాలే చెబుతున్నాయి. అందుకే కవిత మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం నుంచి ఫలితం వచ్చేదాకా ఎక్కడా బహిరంగంగా కనబడ కుండా జాగ్రత్త తీసుకున్నారనీ అంటున్నారు.
http://www.teluguone.com/news/content/is-kavita-keepimg-distance-from-politics-is-it-kcr-strategy-25-146748.html





