జగన్‌కు ఆ 23 సీట్లు కూడా రావా?.. శివాజీ మాటలు నిజమేనా?
Publish Date:Mar 5, 2022
Advertisement
"వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారు.. ఓటుకు 50 వేలు ఇచ్చినా ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదు.. మూడు రాజధానులంటూ జగన్ ముందస్తుకు వెళతారు.." ఇదీ శివాజీ పేల్చిన పొలిటికల్ బాంబ్. ఆపరేషన్ గరుడ 2.O. శివాజీ అన్నారంటే.. అందులో ఎంతోకొంత నిజం ఉండే ఉంటుంది. కోడికత్తి.. వివేకా హత్య లాంటి ఉదంతాలతో గతంలో ఆయన చెప్పిన గరుడ పురాఠం చాలా వరకూ నిజమైంది. అందుకే ఈసారి కూడా శివాజీ వ్యాఖ్యలపై జోరుగా చర్చ నడుస్తోంది. నిజంగా, వైసీపీకి చెందిన అంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వేరే పార్టీ వైపు చూస్తున్నారా? అలా టచ్‌లో ఉన్నారంటే అర్థం.. వైసీపీ ఓడిపోతుందనేగా? అంటే, ఏపీలో జగన్ గ్రాఫ్ దారుణంగా పతనమవుతోందని.. ఫ్యాన్ గుర్తుపై మళ్లీ గెలిచే ఛాన్స్ లేదని నేతలే భావిస్తున్నట్టేగా? అంటున్నారు. ఇంతకీ, వారిలో గెలుపుపై ఎందుకంత అపనమ్మకం? వారిని అంతలా భయపెడుతున్న అంశాలేంటి? కావొచ్చు.. 49మంది ఎమ్మెల్యేలు.. 9మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నమాట నిజమే కావొచ్చు. గెలవాలంటే.. వైసీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలా.. అంతా బాగుందనే భ్రమ కలిగింది. ఆ భ్రమ ఇప్పుడిప్పుడే తొలగిపోయింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎలాగోలా గెలిచేసినా.. ఈసారి అసెంబ్లీ వార్ అంత ఈజీ కాదంటున్నారు. అదంతా, జగన్ స్వయంకృతాపరాధమే అంటున్నారు సొంతపార్టీ ప్రజాప్రతినిధులు. జగన్ సర్కారుకు బాగా డ్యామేజ్ చేసే అంశాలు చాలానే ఉన్నా.. మరీ ముఖ్యంగా పీఆర్సీ ఎపిసోడ్ జగన్‌ను గద్దె దించడం ఖాయమంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా వేధించి.. మనోవేధనకు గురి చేశారు జగన్మోహన్‌రెడ్డి. ఫిట్‌మెంట్ తగ్గించి.. హెచ్ఆర్ఏ కోతేసి.. డీఏలతో గ్యారడీ చేసి.. ఉద్యోగులు జేబుకు చిల్లు పెట్టారు. చలో విజయవాడతో కాస్త ప్రభుత్వం కాస్త తగ్గినా.. ఉద్యోగులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. అందుకే, జగనన్నపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు వారంతా. ఏపీలో సుమారు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఒక్కో ఉద్యోగి ఇంట్లో కనీసం 6 ఓట్లు వేసుకున్నా.. 42 లక్షల ఓట్లు జగన్‌పై రివేంజ్ తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్నాయి. అక్కడితో అయిపోలేదు లెక్క. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి కనీసం 10 మంది ఓటర్లనైనా ప్రభావితం చేయగలడు. ఇక టీచర్లు అయితే.. ఏకంగా ఊరి వారందరినీ మార్చేయగలరు. అలా రఫ్‌గా లెక్కేస్తే.. సుమారు కోటి మంది ఓటర్లపై ప్రభుత్వ ఉద్యోగుల ప్రభావం ఉంటుంది. ఏపీలో ఉన్నదే 3 కోట్ల ఓటర్లు. అందులో ఓటేసేది సుమారు 2 కోట్లు. అందులో కోటి మంది జగన్‌ను యాంటీ ఓటర్లే అనుకున్నా.. ఇక మిగతా పార్టీలకు వారివారి ఓటుబ్యాంకు ఉంటుందిగా? ఇక జగన్ గెలిచేదెట్టా? అందుకే ఈసారి జగన్.. చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమనే చర్చ నడుస్తోంది. అందుకే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారనే టాక్ అయితే ఉంది. తాజాగా, నటుడు శివాజీ.. ఆ లెక్క 49 మంది ఎమ్మెల్యేలు.. 9 మంది ఎంపీలంటూ గరుడ పురాణం 2.O ను ప్రజల ముందుకు తీసుకురావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం. పీఆర్సీ దెబ్బే ఇంతలా ఉంటే.. ఇక జగన్ చేస్తున్న మిగతా అరాచకాల గురించి చెప్పనక్కరనే లేదు. రాజధాని మూడు ముక్కలాటపై రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. హైకోర్టు ఆదేశాలతో కాస్త ఊరట చెందారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజల చెమట పిండేసుకోవడంపై కోపంతో రగిలిపోతున్నారు. ఇసుక కొరత.. గుంతల రోడ్లు.. మద్యం ధరలు.. సమయానికి రాని జీతాలు.. వాయిదాలు వేస్తున్న పథకాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ఓడిపోవడానికి సవాలక్ష కారణాలే కనిపిస్తున్నాయి. ఇక, ఓవైపు అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తుతో పాటు.. వివేకా హత్య కేసులో అనుమానపు వేళ్లన్నీ అవినాశ్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డిల వైపే చూపిస్తున్నాయి. సీబీఐ విచారణ దూకుడుగా సాగుతోంది. ఎన్నికలు వచ్చేలోపే ఏదో ఒకటి తేలేలా ఉంది. అప్పుడు జగన్ నిజస్వరూపం ప్రజలకు మరింతగా తెలిసొస్తుంది. ఇలా ఎలా చూసినా.. ఏపీలో జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందనే విషయం కాస్త ఆలోచిస్తే తెలిసిపోతోంది. అందుకే, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటి నుంచే జాగ్రత్తపడుతున్నారు. జగన్‌ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని భావిస్తున్నారు. అందుకే, పక్క పార్టీలతో టచ్‌లో ఉన్నారన్న శివాజీ మాటల్లో నిజమే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇలా అన్ని పరిణామాలు లెక్కేస్తే.. గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 23 సీట్లు కూడా ఈసారి జగన్మోహన్‌రెడ్డి పార్టీకి రావని అంచనా వేస్తున్నారు. శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ 2.O నిజమే అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. ఎనీ డౌట్?
http://www.teluguone.com/news/content/is-jagan-party-down-fall-in-ap-25-132630.html





