జగనన్నే భవిష్యత్ అని ఆర్కే భావించడం లేదా?

Publish Date:Apr 18, 2023

Advertisement

జగనన్నే మా భవిష్యత్ అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నమ్మడం లేదా? అందుకే ఆయన ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టేశారా? అంటే మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికులు ఔననే అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆట్టే సమయం లేదు.  ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసి.. వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమానికి ఏప్రిల్ 7న శ్రీకారం చుట్టారు. ఈ నెల  29 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంటే మరో మూడు రోజులలో జగనన్నే మా భవిష్యత్ అన్న కార్యక్రమానికి ఫుల్ స్టాప్పడనుంది.

సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ఇంటింటికి వెళ్లి.. నువ్వే మా నమ్మకం జగనన్న అని ఉన్న స్టిక్కర్లను ఇళ్లకు, సెల్ ఫోన్లకు అతికిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు తీరును ఎమ్మెల్యేలు.. పర్యవేక్షించడమే కాకుండా.. వారు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని.. ప్రజలకు అందుతోన్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.  ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. కానీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు కూత వేటు దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం.. పెద్దగా కనిపించడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కె (ఆళ్ల రామకృష్ణారెడ్డి)  అయితే మొత్తంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇప్పటి వరకూ ఆళ్ల రామకృష్ణారెడ్డి నువ్వే మా నమ్మకం జగనన్నా కార్యక్రమంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆర్కే అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది.  ఏఫ్రిల్ 20వ తేదీతో ముగియనున్న ఈ కార్యక్రమంలో చివరి రోజున ఆర్కే వచ్చి గంటకొట్టి మంగళహారతులిచ్చేసి మ..మ..అనిపించేఅవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణులుచెబుతున్నాయి.  

2014 ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో.. నాడు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే... పక్కా రెబల్‌గా ఉండేవారని..  కానీ 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఫ్యాన్ పార్టీ ఘన విజయం సాధించినా.. ఆళ్లలో మాత్రం నాటి ఊపు ఉత్సాహం పూర్తిగా అవిరైపోయింద అంటున్నారు.  అయితే 2019 ఎన్నికల ప్రచారంలో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నారా లోకేశ్‌ను ఓడించి.. ఆర్కేను గెలిపిస్తే... తన కేబినెట్‌లోకి అతడికి బర్త్ కన్ ఫార్మ్ అంటూ పార్టీ అధినేత జగన్.. అప్పటి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. తమ ఎమ్మెల్యే మంత్రి అవుతాడుగా అని భావించిన మంగళగిరి ప్రజానీకం ఆర్కేను గెలిపించారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పునర్వ్యవస్థీకరణలో సైతం జగన్ ఆర్కేను కన్సిడర్ చేయలేదు. దీంతో ఆర్కేలో అసంతృప్తి  గూడు కట్టుకొని ఉందని ఆయన వర్గం పేర్కొంటోంది. 

జగన్ తొలి కెబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం తనకు చోటు దక్కకపోవడంతోపాటు.. మంగళగిరికి కూతవేటు దూరంలో ఉన్న చిలకలూరిపేట నుంచి గెలుపొందిన విడదల రజినీని మాత్రం.. వైయస్ జగన్ తన కేబినెట్‌లోకి తీసుకోన్నారు. ఇలా పార్టీ మారి.. అలా వచ్చిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా.. ఏకంగా   మంత్రిని చేయడం.. ఆర్కేకు ఏమాత్రం మింగుడు పడని వ్యవహారంగా మారిందని.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ఈ ఆర్కే.. మంగమ్మ మార్క్ శపథం సైతం చేశారనే చర్చ నియోజకవర్గంలో జోరందుకొంది.  

మరోవైపు.. సదరు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత గంజి చిరంజీవిని.. ఫ్యాన్ పార్టీలో చేర్చుకున్నారు. సీఎం వైయస్ జగన్.  వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా చిరంజీవి బరిలో దిగుతారనే ఓ టాక్ సైతం వాడీ వేడిగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతోన్నట్లు... ఆ క్రమంలో ఈ విషయాన్ని   పార్టీ పెద్దల చెవిలో వేసినా జగన్ లైట్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే జగనన్నే మా భవిష్యత్తు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావించడం లేదనే ఓ చర్చనియోజకవర్గంలో సాగుతోంది. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.