ఫ్రోజెన్ బఠానీలు తింటున్నారా? ఇవి తినడం మంచిదా కాదా? అసలు నిజాలివి..!

Publish Date:Feb 11, 2026

Advertisement

శీతాకాలంలో మార్కెట్ లో పచ్చి బఠానీలు అందుబాటులోకి వస్తాయి.  భారతీయ కూరలు,  మసాలా రైస్, వెజిటబుల్ రైస్, కూరగాయలు అన్నీ కలిపి వండే కూరలు, గ్రేవీలు, సూపుల  నుండి స్నాక్స్ వరకు బఠానీలు ప్రతి వంటకం  రుచిని పెంచుతాయి. కానీ శీతాకాలం ముగియగానే తాజా పచ్చి బఠానీలు మార్కెట్ లో కనిపించవు. ఇలాంటి సందర్భాలలో  ప్రజలు తెలివిగా ఆలోచిస్తారు. డీప్ ఫ్రిజ్ లో ఫ్రీజ్ చేసిన  బఠానీలను ఆశ్రయిస్తారు. వీటినే ఫ్రోజెన్ బఠానీలు అని అంటారు. అయితే, చాలా మంది ఫ్రోజెన్ బఠానీలు ఆరోగ్యానికి మంచివా కాదా అనే విషయం ఆలోచించరు. అలాగే  తాజా బఠానీల లాగా ఫ్రోజెన్ బఠానీలు ప్రయోజనకరంగా ఉంటాయా లేదా అని కూడా తెలుసుకోరు.  కానీ ఆరోగ్యం మీద స్పృహ ఉన్న కొద్దిమంది మాత్రం ఫ్రోజెన్ బఠానీ ల గురించి అయోమయంలో ఉంటారు.   అసలు ఫ్రోజెన్ బఠానీలు పచ్చి బఠానీలలాగా ఆరోగ్యానికి మేలు చేస్తాయా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

బఠానీలలో పోషకాలు..

శాకాహారులకు పచ్చి బఠానీలు ప్రోటీన్ పరంగా  అద్భుతమైన వనరు. వాటిలో ప్రోటీన్‌తో పాటు అనేక ముఖ్యమైన విటమిన్లు,  ఖనిజాలు ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ ఆహారంలో బఠానీలను చేర్చుకోవడం వల్ల పోషకాహార లోపాలను అధిగమించవచ్చు. అందుకే సీజన్ ముగిసిన తర్వాత  ఫ్రోజెన్   బఠానీలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.

ఫ్రోజెన్ బఠానీ ప్రాసెస్..

ఫ్రోజెన్ బఠానీలు పూర్తిగా పండినప్పుడు వాటిని సేకరిస్తారు.  వాటిని దాదాపు -18 డిగ్రీల సెల్సియస్ వద్ద స్తంభింపజేస్తారు. ఈ తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని నిల్వ చేయడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల లేదా జీవసంబంధమైన మార్పులు నిరోధించబడతాయి, అవి ఎక్కువ కాలం పచ్చి బఠానీల లాగా ఉంటాయి.

ఆరోగ్యపరంగా..

ఫ్రోజెన్ బఠానీలు అనారోగ్యకరమైనవని,  అనారోగ్యానికి కారణమవుతాయని ప్రజలు తరచుగా అనుకుంటారు. అయితే నిపుణులు దీనిని తోసిపుచ్చుతున్నారు. ఫ్రోజెన్ బఠానీలు తాజా పచ్చి బఠానీల మాదిరిగానే ప్రోటీన్, విటమిన్లు,  ఖనిజాలను కలిగి ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

తాజా బఠానీ, ఫ్రోజెన్ బఠానీ మధ్య తేడా..

నిపుణుల అభిప్రాయం ప్రకారం తాజా బఠానీలు,  ఫ్రోజెన్   బఠానీల పోషక విలువలో గణనీయమైన తేడా లేదు. ఒక అధ్యయనం రెండు సంవత్సరాల పాటు బఠానీలతో సహా తాజా,  ఫ్రోజెన్  కూరగాయలను పోల్చింది. ఈ అధ్యయనంలో రెండింటి పోషక విలువలు దాదాపు ఒకేలా ఉన్నాయని తేలింది. ఇంకా, అనేక ఇతర అధ్యయనాలు కూడా ఘనీభవించిన కూరగాయలు తాజా కూరగాయల మాదిరిగానే ప్రయోజనకరంగా ఉంటాయని చూపించాయి.

ఫ్రిజర్వేటివ్స్..

కొంతమంది  ఫ్రోజెన్ బఠానీల లైఫ్ స్పాన్ పెంచడానికి వాటికి ప్రిజర్వేటివ్‌లు లేదా రసాయనాలు కలుపుతారని అనుకుంటారు. అయితే, పోషకాహార నిపుణులు ఇది నిజం కాదని చెబుతున్నారు. -18 డిగ్రీల సెల్సియస్ వద్ద బఠానీలను గడ్డకట్టించడం  వల్ల అవి సురక్షితంగా ఉంటాయి. దీనికోసం రసాయనాలు అవసరం లేదు.  అయితే, తాజా, ఫ్రోజెన్   బఠానీల మధ్య రుచిలో మాత్రం తేడా ఉంటుంది.

                              *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.