ఉండవల్లి శ్రీదేవి పోలిటికల్ కెరీర్ కు ఫుల్ స్టాపేనా?!

Publish Date:Aug 23, 2022

Advertisement

నిత్యం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నామ జపం చేసు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజకీయ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లేనా? అంటే వైసీపీ శ్రేణులు, పరిశీలకులు కూడా ఔననే అంటున్నారు. జగన్ ఏం మాట్లాడమంటే అదే మాట్లాడి, ఏం చేయమంటే అదే చేసిన ఉండవల్లి శ్రీదేవికి పార్టీలో ఒక్కసారిగా ఆదరణ లేకుండా పోవడం ఒకింత ఆశ్చర్యమే. ఎందుకంటే అసెంబ్లీ అయినా, బహిరంగ సభ అయినా.. సందర్బం ఉన్నా, లేకపోయినా ఉండవల్లి శ్రీదేవిది ఒకటే మాట.. ఒకటే నామస్మరణ.. జగన్.. జగన్.. జగన్. ఆపరేషన్ అయిన గుండె సైతం జగన్.. జగన్ .. జగన్ అని కొట్టుకొంటోందంటూ.. అంత జగన్ నామస్మరణ చేసిన శ్రీదేవికి తాను మాత్రం జ  జగన్నాటకంలో చిన్న పాత్ర మాత్రమేనని ఆలస్యంగా తెలుసుకున్నారు. అప్పటికే తాడికొండ నియోజకవర్గం పార్టీ అదనపు సమన్వయకర్తగా డొక్క మాణిక్య వర ప్రసాద్‌ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసేసింది. దీంతో ఆ విషయం తెలుసుకొని.. తత్వం బోధపడి.. అంతా తెలుసుకునే సరికే జరగాల్సిన పని జరిగిపోయింది. నియోజవర్గంలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరిని వెంట పెట్టుకొని.. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి ముందు అర్ధరాత్రి ఆందోళనకు దిగి నినాదాలతో కొద్ది సేపు హడావుడి చేసిన శ్రీదేవి ఆ తరువాత ఓ అల్టిమేటం జారీ చేసి ఆందోళన విరమించారు.  పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ హోంమంత్రి సుచరిత నివాసం ముందు అర్ధరాత్రి ఉండవల్లి శ్రీదేవి ఆందోళన ఒక్కసారిగా సంచలనం రేపింది. దీంతో సుచరిత ఇంటి నుంచి బయటకు వచ్చి.. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామని.. అధిష్టానం ఎలా ఆదేశిస్తే.. అలా నడుచుకుందామంటూ ఎమ్మెల్యే శ్రీదేవిని.. సముదాయించారు, దీంతో ఉండవల్లి ఆందోళన విరమించారు. అయితే 10 గంటల్లో పార్టీ నిర్ణయం మార్చుకోవాలని నియోజకవర్గ అదనపు సమన్వయ కర్తగా డొక్కా నియామకాన్ని వెనక్కు తీసుకోవాలనీ లేకుంటే నాలుగు మండలాల్లోని నాయకులంతా ముకుమ్మడి రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్టానానికి శ్రీదేవి వర్గంగా చెప్పుకుంటున్న ఆ నాలుగు మండలాల నాయకులు అల్టిమేటం ఇచ్చారు. 

అయితే ఇంతలా జగన్ నామస్మరణలో మునిగిపోయిన ఎమ్మెల్యే శ్రీదేవి పట్ల సీఎం జగన్ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించారన్న ఓ సందేహం ఆమె వర్గాన్ని పట్టి పీడిస్తోంది.   శ్రీదేవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆరోపణలు, విమర్శలు గట్టిగానే ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొని.. ముందుగానే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సీఎం జగన్ చెక్ పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆమెను సీఎం జగన్ దూరం పెడుతూ వచ్చారనీ, అందుకే ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తాడికొండ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను సీఎం జగన్ ఏరి కొరి మరీ నియమించారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   మూమూలుగా ఎమ్మెల్యేలే వారి వారి నియోజకవర్గాల సమన్వయకర్తలుగా  వైసీపీలో వ్యవహరిస్తుంటారు. దీంతో ఇతరులను నియమించే అవకాశం ఉండదు... ఉండబోదు. కానీ తాడికొండలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగానే.. అదనపు సమన్వయకర్తగా జగన్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించారు. 

 అయితే పార్టీ ఏం చెబితే అదే ఆమె చేశారని శ్రీదేవి అనుచరులు అంటున్నారు. ఆ క్రమంలోనే ఆమె అమరాతి రాజధానికి వ్యతిరేకంగా గళమెత్తారని... తమకు రాజధాని అవసరం లేదని స్పష్టం చేశారట. అలాగే  సొంత నియోజకవర్గంలోని రైతుల్ని సైతం పెయిడ్ ఆర్టిస్టులు అని అభివర్ణించారు. రాజధాని భూములన్నీ ఓ సామాజికవర్గానివే అని విమర్శలు సైతం గుప్పించారు. చివరికి ఫ్యాన్ పార్టీలో చోటు చేసుకున్న వర్గ పోరాటాల్ని సైతం టీడీపీకి అంటగట్టి కుల ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారారు.
 
అయితే ఎన్ని చేసినా జగన్ పార్టీలో శ్రీదేవికి సరైన గుర్తింపు లేకుండా పోయిందని ఆమె వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తరచు ఆమెపై వివాదాలు ముసురుతూ వచ్చాయని... డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారని పలువురు సొంత పార్టీ నేతలు సైతం ఆరోపణలు ఆమెపై గుప్పించారు. ఇలా ఒకటా రెండో.. శ్రీదేవి చేసిన ఘన కార్యాలు గురించి చెప్పుకుంటే పొతే.. కొండవీటి చాంతాడంత ఉంటుందనే ఓ చర్చ  తాడికొండలో ఓ రేంజ్ లో సాగుతోంది.


అదీకాక.. తాడికొండ నియోజకవర్గం రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంది. జగన్ అధికారంలోకి రావడంతో.. అమరావతి ఎగిరిపోయింది. దీంతో ఆమెకు ఇదే పెద్ద మైనస్ అయిందట. అలాగే నియోజకవర్గంలో ఆమె అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కాగడా పట్టి వేదికనా కనిపించవని.. ఆ పార్టీ వారే పేర్కొంటునారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు అయినా.. నియోజకవర్గ ప్రజలకు అరకొరగానే అందుతున్నాయని తెలుస్తోంది. అసైన్డ్ రైతులకు కౌలు, పెన్షన్ 5 వేలు, టిడ్కో గృహాలు కేటాయింపుల్లో శ్రీదేవి చేసిందేమీ లేదనే ఓ చర్చ సైతం నేటికి ఉందట.  

 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శ్రీదేవికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే.. పట్టిసీమ ప్రయాణంలో.. పడవ బోల్తా పడినట్లు తాడికొండ నియోజకవర్గ అసెంబ్లీ సీటు చేయి జారీ గల్లంతయ్యే అవకాశం ఉందని.. భావించిన సీఎం జగన్ ముందుగానే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అదీకాక.. తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా తాజాగా నియమితులైన డొక్కా మాణిక్య వర ప్రసాద్.. గతంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి రెండు సార్లు గెలుపొంది మంత్రిగా కూడా పని చేశారు.

ఆ తర్వాత జగన్ పార్టీలో చేరదామనుకుని.. చివరి నిమిషంలో మనస్సు మార్చుకొని.. సైకిల్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరితపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో... మూడు రాజధానులు తెరపైకి రావడం.. దానికి వ్యతిరేకంగా టీడీపీతోపాటు ఎమ్మెల్సీ పదవికి సైతం డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసేశారు.

ఆ తర్వాత ఆయన మళ్లీ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన చేరారు. అంతేకాదు.. ఇదే పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగు పెట్టారు. తాజాగా తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా నియమితులు కావడంతో.. తాడికొండ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డొక్క అని ఇప్పటికే శ్రీదేవి అనుచర వర్గం   పక్కాగా ఫిక్స్ అయిపోయిందట. ఎంతైనా డొక్క.. వారు అనుకున్నారంటే.. అది సాధించే క్రమంలో విపక్షంలో అయినా.. స్వపక్షంలో అయిన..  ప్రత్యర్థి డొక్క చించి డొలు కడతాడనే ఓ టాక్ అయితే ఆయన అనుచరుల్లో నాటికే కాదు నేటికి అదే బలంతో బలంగా నడుస్తోంది.

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.