చెమట వాసనకు డియోడరెంట్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!

Publish Date:May 10, 2023

Advertisement

మగవారు  ప్రతి రోజూ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు డియోడరెంట్ వాడటం తప్పనిసరి. ఆడవారి కంటే మగవారిలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇది మగవారికి ఎంతో అవసరం కూడా. అయితే ప్రస్తుతం సబ్బుల నుండి షాంపూలు, లోషన్‌ల వరకు. పెర్ఫ్యూమ్‌ల నుండి డియోడరెంట్స్ వరకు ప్తతి ఒక్కడంటలో రసాయనాలు ఉంటాయి. ఈ ఉత్పత్తులన్నీ రసాయనాల మూలంగానే తయారవుతాయి. ఎక్కడైతే రసాయనాలు ప్రభావం చూపిస్తాయో.. అక్కడ ఆ రసాయనాలకు లోనయ్యే కారకాలు కూడా ఉంటాయి. ఇక్కడ చెప్పుకుంటున్న సౌందర్య సాధనాలు కూడా అంతే… 

రసాయనాలతో తయారయ్యే షాంపులు, సబ్బుల గురించి ఏమోకానీ.. డియోడరెంట్లు మాత్రం చాలా ప్రమాదమట. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చెమట పట్టే సమయంలో అయినా అలా లేకపోయినా డియోడరెంట్ వాడటం అలవాటు. ఇది చెమటను దుర్వాసనను దూరం చేస్తుంది. అయితే దీన్ని తప్పుగా ఉపయోగించడం వల్ల సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి. 

డియోడరెంట్ ఎలా పనిచేస్తుందంటే..

చర్మం ఆమ్లతను పెంచడం ద్వారా దుర్వాసనను నియంత్రించడంలో డియోడరెంట్ పనిచేస్తుంది.  ముఖ్యంగా చంకల్లో దుర్వాసనకు ఈ డియోడరెంట్స్ మంచి ఉపశమనం. ఇవి దుర్వాసనను నియంత్రిస్తాయి కానీ  చెమటను నియంత్రించవు. వీటిలో చెమట వాసన రాకుండా ఉండేందుకు పెర్ఫ్యూమ్‌ను ఉపయోగిస్తారు. దీనితో పాటు, ఆల్కహాల్ కూడా ఉంటుంది. దీన్ని చర్మానికి రాసుకుంటే చర్మం పొడిబారడంతోపాటు రంగు మారడం కూడా జరుగుతుంది. 

అలర్జీలు

డియోడరెంట్లు కొన్నిసార్లు అలెర్జీలను కలిగిస్తాయి. ఇందులో చర్మంపై దద్దుర్లు, మొటిమలు, చర్మం  ఎరుపుకు మారడం, దురద, మంట  లేదా చర్మంపై వాపుతో పాటు, శ్వాసకోశ లక్షణాలు కూడా వస్తాయి. సాధారణంగా ఇది ఒక రకమైన కాంటాక్ట్ డెర్మటైటిస్. ఇది అల్యూమినియం, ఆల్కహాల్, కృత్రిమ సువాసనల సమ్మేళనం.  డియోడరెంట్లో ఉండే పారాబెన్‌లు, రంగులు లేదా ఇతర రసాయనాల వల్ల అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి గుర్తుపెట్టుకోవాలి..

మొదటి విషయం మీ చర్మం గురించి అవగాహన. మీ చర్మం సున్నితంగా ఉంటే చాలా జాగ్రత్తగా డియోడరెంట్ని ఎంచుకోవాలి. వీలైతే.. చర్మ సంబంధ నిపుణుడిని సంప్రదించి మీ చర్మానికి తగినది ఎంచుకోవచ్చు.

శరీరంపై వచ్చే చెమట వల్ల ఎప్పుడూ  దుర్వాసన రాదు. దుర్వాసన అనేది చర్మంపై పెరిగే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కాబట్టి మీరు శరీర దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే ముందుగా దాని కారణాన్ని తెలుసుకోవాలి. కారణం కాకుండా డియోడరెంట్ను ఎక్కువగా ఉపయోగించవద్దు. ఇష్టమొచ్చినట్టు వాడితే చివరకు వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రావొచ్చు. 

డియోడరెంట్ ఎప్పుడూ చర్మంపై నేరుగా అప్లై చేస్తుంటారు. కాబట్టి.. డియోడరెంట్ను అప్లై చేసిన తర్వాత చర్మంపై మంట, దురద, పొడిబారినట్లు అనిపిస్తే, వెంటనే దానిని అప్లై చేయడం మానేయాలి. .

శుభ్రమైన కాటన్ దుస్తులు ధరించడం, రోజూ బాగా స్నానం చేయడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, శరీరంలోని అధిక వెంట్రుకలను తొలగించడం, ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవడం వల్ల చెమట వాసన చాలా వరకు అదుపులో ఉంటుంది.

దుర్వాసన సమస్యను ఆర్మ్పిట్ డిటాక్స్, అలోవెరా, కొబ్బరి నూనె, టీ ట్రీ ఆయిల్, ఎప్సమ్ సాల్ట్ మొదలైన వాటి ద్వారా కూడా నియంత్రించవచ్చు.

డియోడరెంట్ వల్ల ఇబ్బంది ఏర్పడినప్పుడు ఇంటి చిట్కాలు పాటించినా ఉపశమనం కల్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.

                                ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.