పొలిటికల్ మైలేజి కోసమేనా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు ?

Publish Date:Jul 21, 2022

Advertisement

నేషనల్‌ హెరాల్డ్‌-ఏజేఎల్‌ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ, అలాగే అదే పార్టీకి చెందిన మరి కొందరు ముఖ్య నేతలపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. ఇది ఇప్పుడు నమోదైన కేసు కాదు, కాంగ్రెస్ హయాంలో, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో నమోదైన కేసు. అయితే, అప్పట్లో విచారణ లేకుండానే, విచారణ సంస్థలు కేసును కొట్టేశాయి.ఆ తర్వాత  సుభ్రమణ్య స్వామి కోర్టును ఆశ్రయించడంతో,కోర్టు ఆదేశాల  మేరకు ఈడీ విచారణ చేపట్టింది.  

ఈ నేపధ్యంలో కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్  డైరెక్టరేట్,(ఈడీ) ఇతరులతో పాటుగా సోనియా గాంధీకి కూడా సమన్లు జారీ చేసింది. నిజానికి,  గత నెలలోనే ఈడీ నోటీసులు జారీ అయినా... అనారోగ్యం (కొవిడ్) కారణంగా ఆమె, అప్పుడు ఈడీ విచారణకు హాజరు కాలేక పోయారు. వాయిదా కోరారు.ఈడీ ఆమె కోరిన విధంగా వాయిదాకు అంగీకరించి, తాజాగా జులై 21, 22 తేదీల్లో విచారణకు హాజరు కావాలని మరో మారు సమన్లు జారీ చేసింది.ఈ నేపధ్యంలో, ఆమె ఈ రోజు ( జులై  21) ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.  

అయితే, సోనియా గాంధీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోది. కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల ద్వారా రాజకీయ వేధింపులకు దిగుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకక్ కాంగ్రెస్ నాయకులే కాదు, ప్రతిపక్షాలు అన్నీ అదే ఆరోపణ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్సనలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే కేసులో రాహుల్ గాంధీని విచారించిన సమయంలోనూ కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఇదే తరహ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

అయితే, కేసు ఏమిటి? విచారణ ఏమిటి? తీర్పు ఎలా ఉంటుంది? చివరకు ఎమి జరుగుతుంది, ఏమి జరగదు, అనే విషయాలను పక్కన పెడితే, కాంగ్రెస్ శ్రేణులు నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనల వలన పార్టీకి కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి, అనే విషయంలో రాజకీయ వర్గాల్లో , ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  గతంలో మాజే ప్రధాని పీవీ నరసింహ రావు, ఇతర నేతలు కూడా సీబీఐ,ఈడీ, ఎన్ఐఎ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ఎదుర్కున్నారు.

గోద్రా అనంతర గుజరాత్ అల్లర్ల కేసులో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ , ‘సిట్’ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఎదుట, గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో రోజుల తరబడి విచారణకు హాజరయ్యారు. ఇంకా విచారణను హుందాగా ఎదుర్కున్న నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ, అప్పట్లో పార్టీ మొత్తంగా వీధుల్లోకి రాలేదు. నిరసన ర్యాలీలు నిర్వహించిన దాఖలాలూ లేవు. చట్టాన్ని గౌరవించారు. నిజానికి, ఇదే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్టీ మరో సీనియర్ నేత పవన్ బన్సల్ ను కూడా ఈడీ విచారించింది. అయినా, ఖర్గే , బన్సల్ విచారణకు కాంగ్రెస్ అభ్యంతరం చెప్పలేదు. నిరసన ప్రదర్శనలు చేయలేదు. అసలు విచారణ ఎప్పుడు జరిగిందో కూడా ఎవరికీ తెలియకుండా విచారణ పూర్తయింది.

కానీ, రాహుల్ గాంధీని విచారించిన ఐదు రోజులూ కాంగ్రెస్ పార్టీ దెశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఇప్పడు మళ్ళీ సోనియా  గాంధీ విచారణ సందర్భంగా, పార్టీ  సీనియర్ నేతలంతా రోడ్డు మీదకు వచ్చారు. అయితే, ఈనిరసన ప్రదర్శనల వలన విచారణ సంస్థలు ప్రభావితం అవుతాయా అంటే, అలాంటి అవకాశం కనిపించడం లేదు. అలాగే, నిరసన ప్రదర్శనల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్న పొలిటికల్ మైలేజి అయినా వస్తుందా, అంటే  అదీ అనుమానమే అంటున్నారు.

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.