Publish Date:Jul 25, 2022
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో తిరిగినన్ని, తిరుగుతున్నన్ని మలుపులు గతంలో ఏ కేసులోనూ జరిగి ఉండక పోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగింది.
తన సొంత ఇంట్లో వివేకా హత్యకు గురయ్యారు. అప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. వివేకా అన్న కొడుకు వైఎస్ జగన్ విపక్ష నేత. వివేకా మరణించారన్న వార్త బయటకు రాగానే ఆయన గుండె పోటుతో మరణించారంటూ జగన్, ఆయన అనుచరులు విజయసాయి తదితరులంతా ఒకరి తరువాత ఒకరు ప్రకటనలు గుప్పించేశారు. గంటల వ్యవధిలోనే వివేకా గుండె పోటుతో మరణించలేదు... ఆయన హత్యకు గురయ్యారన్నది వెల్లడైంది. అంతే జగన్ తదితరులందరి స్వరం మారిపోయింది. చంద్రబాబు, లోకేష్ ల హస్తం ఈ హత్య వెనుక ఉందంటూ విమర్శలు గుప్పించి.. ఎన్నికలలో సానుభూతి పవనాల కోసం తమ వంతు ప్రయత్నం చేసేశారు. ఆయన హత్యపై సీబీఐ విచారణకు స్వయంగా జగన్ డిమాండ్ చేశారు.
సరే ఆ తరువాత జగన్ ఎన్నికలలో విజయం సాధించారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత తన సొంత బాబాయ్ వివేకా హత్య కేసు విచారణను నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. బాబాయ్ హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన ఆయనే అధికారంలోకి వచ్చాకా సీబీఐ విచారణ అవసరం లేదని అన్నారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి మాత్రం తన తండ్రి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అందుకు అంగీకరించి కేసును సీబీఐకి అప్పగించింది. అయితే ఏపీలో సీబీఐ అయినా, అంత కంటే గోప్ప సంస్థైనా సరే చేయగలిగేదీ ఏదీ ఉండదని జగన్ సర్కార్ హయాంలో నిర్ద్వంద్వంగా రుజువైపోయింది.
కేసు దర్యాపు వేగంగా జరుగుతున్న సమయంలో సీబీఐకి బెదరింపులు వచ్చాయి. సీబీఐ అధికారులపైనే ప్రైవేటు కేసులు దాఖలయ్యాయి. వీటన్నిటి వెనుకా ఉన్నది వివేకా హత్య విచారణ సజావుగా సాగకుండా ఆపే యత్నమే. దీంతో గత కొంత కాలంగా సీబీఐ ఈ హత్య కేసు విషయంలో సైలెంటైపోయింది. అంతకు ముందు ఈ హత్య కేసులో అరెస్టయిన ఎవన్ ముద్దాయి ఎర్రగంగిరెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అప్పటికే వివేకా హత్య కేసులో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సీబీఐ విచారణ విషయంలో హఠాత్తుగా మౌనం వహించింది.
ఈ క్రమంలోనే ఈ కేసులో కొందరు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ పరిస్థితుల్లో గత కొంత కాలంగా మౌనంగా ఉన్న సీబీఐ హఠాత్తుగా ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కోరుతూ సుప్రీంను ఆశ్రయించింది. ఎర్రగంగిరెడ్డి బెయిలుపై ఉంటే సాక్షులను బెదరించే, ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొంది. దీంతో ఇక వివేకా హత్య కేసు విచారణ వేగవంతం య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు విచారణలో ఎర్రగంగిరెడ్డి బెయిలు పిటిషన్ పై సుప్రీం నిర్ణయం అత్యంత కీలకం కానున్నద.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-cbi-became-active-again-in-viveka-murder-case-25-140503.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?