విద్యాశాఖ మంత్రి బొత్సేనా?.. సమీక్షలకు దూరం, టెన్త్ పేపర్ల లీకులపై మౌనం!

Publish Date:May 4, 2022

Advertisement

ధ్రప్రదేశ్ లో ఓ పక్క శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారై అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతుంటే.. మరో పక్క అత్యంత కీలకమైన విద్యాశాఖ మంత్రి ఉన్నట్టా లేనట్టా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసలు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రేనా అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఏపీ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను గత మునిసిపల్ శాఖ నుంచి మార్చి విద్యాశాఖ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. తనకు ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారని బొత్స అలిగారని చెబుతున్నారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగి పక్షం రోజులు గడుస్తున్నా.. ఆయన అలక వీడలేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. సీఎంను కలుద్దామన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. 
 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన అనంతరం ఇప్పటి వరకూ విద్యాశాఖకు సంబంధించి కనీసం నాలుగు సమీక్షలు జరిగాయి.. వాటి వేటికీ బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. ఈ మధ్య  కాలంలో ఆయన అడపాదడపా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. ఏ సందర్భంలోనూ కూడా విద్యాశాఖకు సంబంధించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ క్వశ్చన్ పేపర్లు లీకౌతున్నాయి. అయినా బొత్స నోరు మెదపడం లేదు. ఆయన ప్రమేయం లేకుండానే టీచర్ల సస్పెన్షన్లు జరుగుతున్నాయి. ముందు ముందు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. వచ్చే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. విద్యాశాఖకు అత్యంత కీలకమైన సమయం ఇది. ఇటువంటి సమయంలో ఆ శాఖ మంత్రి అంటీముట్టనట్టు వ్యవహరిస్తుంటే పరిస్థితి ఏమిటి?

అయినా ఒక కీలక శాఖకు చెందిన మంత్రి ఇన్ని రోజులుగా పదవీ బాధ్యతలు చేపట్టకుండా తన నిరసన వ్యక్తం చేస్తుంటే సీఎం పట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. నిజంగానే ప్రభుత్వం దృష్టిలో విద్య అన్నది అప్రధాన్య అంశమా? విద్యార్థుల భవిష్యత్ పై ప్రభుత్వానికి శ్రద్ధ లేదనుకోవాలా? 

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో పాలన మరింత అస్తవ్యస్థమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  అనుభవజ్ణులకు అప్రధాన్య శాఖలు, కొత్తవారికి కీలక శాఖలు అప్పగించిన ఫలితం పాలనపై ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఏ సమస్యపైనైనా స్పందించి ప్రభుత్వ వాదనను వినిపించే సీనియర్లు అలుకబూని మౌనంగా ఉండటంతో మొత్తం ప్రభుత్వంలోనే స్తబ్దత  ఏర్పడిందని అంటున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని అంటున్నారు. ఏం ఉన్నా లేకపోయినా విపక్షంపై విరుచుకుపడుతూ విమర్శలు గుప్పించే కొడాలి నాని, పేర్ని నాని వంటి వారు మంత్రిపదవులు కోల్పోయి మౌనంతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే.. బొత్స వంటి వారు బాధ్యతలు చేపట్టకుండా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు రాజధానే కాదు..ప్రభుత్వమూ లేని రాష్ట్రంగా మారిపోయిందని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.