ఈటల రాజీనామాపై ట్విస్ట్! బైపోల్ కు బీజేపీ భయపడుతుందా..

Publish Date:Jun 3, 2021

Advertisement

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్ర నేతలను కలవడంతో.. ఆయన కమలం గూటికి చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. బీజేపీలో చేరినా.. ఆయన ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారన్నది తేలడం లేదు. నిజానికి మంత్రివర్గం నుంచి తొలగించిన వెంటనే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. తన అనుచరులతో జరిగిన సమావేశంలోనూ ఈటల రాజీనామా చేస్తాననే సంకేతం ఇచ్చారు. కారు సింబల్ పై గెలిచిన పదవి తనకు అక్కరలేదని చెప్పారు. అయితే  రాజీనామాను ఈటల ప్రకటించలేదు. కొందరు టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేయాలని సవాల్ చేసినా... రాజేందర్ మాత్రం స్పందించలేదు. ఇప్పుడు బీజేపీలో చేరినా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్నది అనుమానంగానే కనిపిస్తోందని అంటున్నారు.

ఈటల రాజేందర్ రాజీనామాపై మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. వారం రోజుల్లో బీజేపీలో చేరతారని బండి సంజయ్ చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని తెలిపారు. న్యాయ సలహా తర్వాతే రాజీనామాపై ఈటల నిర్ణయం తీసుకంటారని తెలిపారు. సంజయ్ వ్యాఖ్యలను బట్టి... రాజేందర్ ఇప్పట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవచ్చని తెలుస్తోంది. అసలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి న్యాయ సలహా తీసుకోవడం ఏంటన్న చర్చ వస్తోంది. గతంలో ఎంతో మంది నేతలు.. వేరే పార్టీలో చేరినప్పుడు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఈటల రాజీనామా చేయాలని కోరుకుంటోంది. ఇలాంటి సమయంలో న్యాయ సలహా తీసుకోవాల్సిన అవసరం ఏంటన్నది ఎవరికి అర్ధం కావడం లేదు.

తెలంగాణ బీజేపీ నేతలు, ఈటల రాజేందర్ కదలికలను బట్టి.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాకుండా ఉండాలని వాళ్లు కోరుకుంటున్న
ట్లు కనిపిస్తోంది. ఈటలను కేబినెట్ నుంచి తొలగించిన వెంటనే హుజురాబాద్ పై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. పార్టీ కేడర్ తో మాట్లాడాలని మంత్రి గంగుల కమలాకర్ ను పంపించారు. బోయినపల్లి వినోద్ కుమార్ కూడా అదే పనిలో ఉన్నారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు హుజురాబాద్ బాధ్యతలు అప్పగించారనే చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గ నేతలతో హరీష్ రావు చర్చలు జరపడం ఇందుకు బలాన్నిస్తోంది. ఇటీవలే మండలానికో నేతను ఇంచార్జ్ గా నియమించారు కేసీఆర్. వాళ్లంతా నియోజకవర్గంలో తిరుగుతూ.. గులాబీ కేడర్ అంతా పార్టీలోనే ఉండేలా చూస్తున్నారు. ఇతర పార్టీల నేతలకు గాలం కూడా వేస్తున్నారు. ఇప్పటికే హుజురాబాద్ మున్సిపాలిటీలోని ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు గులాబీ కండువా కప్పుకున్నారు. త్వరలో మరికొందరు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు కారు ఎక్కనున్నారని తెలుస్తోంది. 

హుజురాబాద్ పై కేసీఆర్ ఫోకస్ చేయడంతో.. ఉప ఎన్నికకు బీజేపీ భయపడుతుందని తెలుస్తోంది. తన రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలవకపోతే తన రాజకీయ జీవితం సమాధి అయినట్లేనని రాజేందర్ కుడా భయపడుతున్నారట. ఉప ఎన్నికల్లో గులాబీ బాస్ వ్యూహాలు అద్బుతంగా ఉంటాయని చెబుతారు. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాల ముందు విపక్షాలు నిలవలేకపోయాయి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ బై పోల్ లోనూ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని చిత్తుగా ఓడించింది అధికార పార్టీ. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు రాజేందర్ కు తెలుసు కాబట్టే ఆయన వెనుకాడుతున్నారని చెబుతున్నారు. అన్ని అంశాలు పరిశీలంచాకే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని ఈటలతో పాటు కమలం నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. 

మరోవైపు ఈటల రాజేందర్‌ ఈ నెల 4న టీఆర్ఎస్ కు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. రాజీనామా చేసిన తర్వాత రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని ఈ నెల 8 లేదా 9 న బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఈటెల గురువారం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ముందు ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేసి.. మంచిరోజు చూసుకుని ఢిల్లీకి వచ్చి బీజేపీలో చేరతానని రాజేందర్‌ అన్నట్లు సమాచారం. ఈటల సహా మొత్తం అయిదుగురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు చెబుతున్నారు. 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.