ఢిల్లీ హత్యాచార నిందితుడు మామూలోడు కాదు.. విస్తుపోయే విషయాలు!

Publish Date:Apr 23, 2026

Advertisement

 

ఢిల్లీలో సీనియర్ ఐఆర్‌ఎస్ ఆఫీసర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి, వారి నివాసంలోనే హత్య చేసిన నిందితుడు రాహుల్ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు . దేశ రాజధాని అమర్ కాలనీలో బుధవారం ఉదయం గతంలో వారి ఇంట్లో పనిచేసిన యువకుడే అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేశాడు. ఐఆర్ఎస్ అధికారి, ఆయన భార్య ఉదయం జిమ్‌కు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వారి కుమార్తె ఒక్కరే ఇంట్లో ఉండగా.. టెర్రస్‌పై ఉండే ఆమె గదిలోకి నిందితుడు చొరబడి ఘాతుకానికి పాల్పడ్డాడు. 

దీనికి కొద్ది గంటల ముందు మరో మహిళపై అత్యాచారం చేశాడని విచారణలో వెల్లడైంది. నిందితుడు రాజస్థాన్‌లోని అల్వార్‌లో తన స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసి.. ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించినట్టు బయటపడింది. అక్కడ నుంచి అంబులెన్స్‌లో ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అల్వార్‌ జాతీయ రహదారిపై అంబులెన్స్ ఎక్కిన నిందితుడు.. డ్రైవర్‌కు రూ.5,000-రూ.6,000 ఇస్తానని అన్నాడు. కానీ, ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆ డబ్బు ఇవ్వకుండా పారిపోయాడు. స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసి, ఆమెను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిన కొన్ని గంటల తర్వాతే అతను ఈ ప్రయాణం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదుచేసి.. రాజస్థాన్, ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి నిందితుడు తన ఇంట్లోకి బలవంతంగా చొరబడి, లైంగిక దాడి చేసి, కరిచి, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడని అల్వార్ బాధితురాలు ఆరోపించింది. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే తన భర్త, పిల్లలను చంపేస్తానని కూడా రాహుల్ బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి భర్త బంధువుల వివాహం కోసం సొంతూరుకు వెళ్లగా.. ఇద్దరు పిల్లలతో ఆమె అల్వార్‌లోనే ఉందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 

ఈ ఘటన జరిగిన వెంటనే తమకు ఫిర్యాదు అందిందని, వెంటనే కేసు నమోదు చేశామని అల్వార్ పోలీసులు తెలిపారు.  అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకున్న తర్వాత నిందితుడు తాను గతంలో పనిచేసిన దక్షిణ ఢిల్లీలోని ఐఆర్ఎస్ అధికారి నివాసానికి వెళ్లాడు. గతంలో అక్కడ పనిచేసి ఉండటంతో ఆ ఇంటి గురించి అతడికి బాగా తెలుసని దర్యాప్తు అధికారులు తెలిపారు. నిందితుడు హత్యాచారం తర్వాత ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో సుమారు రూ. 2.5 లక్షలు దొంగిలించినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.