అయోథ్య రామమందిరం ఒక్కటే కాదు.. బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకల గోల్ మాల్.!

Publish Date:Jul 4, 2026

Advertisement

విరాళాలు కానుకల స్కామ్  ఒక్క అయోధ్య రామమందిరంలోనే కాదు..  ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయంలోనూ జరిగిందని తేలడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయోధ్య రామమందిరంలో విరాళాల స్కామ్ పై విచారణ సాగుతుండగా సరిగ్గా అలాంటే స్కామే భద్రీనాథ్ ఆలయంలోనూ జరిగిందన్న ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది.   బద్రీనాథ్‌ ధామ్‌లో భక్తులు  సమర్పించిన కానుకల నిర్వహణలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఈ అంశం తీవ్ర వివాదానికి దారితీయడంతో..  బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ (బీకేటీసీ) ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.  

ఈ ఆరోపణలపై  బీకేటీసీ  అధ్యక్షుడు హేమంత్‌ ద్వివేది.. తాము ఈ అక్రమాల ప్రచారాన్ని చాలా  తీవ్రంగా పరిగణిస్తున్నామనీ,  ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ సమించేది లేదనీ పేర్కొన్నారు  నిజానిజాలను నిరూపించేందుకు  ప్రత్యేక విచారణ కమిటీని వేసినట్లు చెప్పిన ఆయన  ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.   ప్రత్యేక కమిటీ జరిపే అంతర్గత విచారణలో ఎవరైనా ఉద్యోగి తప్పు చేసినట్లు  నిరూపితమైతే, వారిపై చట్టపరంగా  కఠినమైన చర్యలు తీసుకుంటామని  హేమంత్‌ ద్వివేది చెప్పారు. 

ఇదే సమయంలో ఆలయ కమిటీ పై వస్తున్న  ప్రచారాలనుఆయన ఖండించారు. కానుకల గోల్ మాల్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి తనకు పీఏగా వ్యవహరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన హేమంత్  తనకు వ్యక్తిగత కార్యదర్శి లేరని, ఆ సదరు వ్యక్తి ఆలయ కమిటీలో పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి మాత్రమేనని స్పష్టం చేశారు. పైగా సదరు ఉద్యోగి  గత మూడు కమిటీల  అధ్యక్షుల హయాంలోనూ అదే స్థానంలో  విధులను నిర్వహించాడని గుర్తుచేశారు.   రామ మందిరం వివాదం మరువక ముందే బద్రీనాథ్‌లో ఇలాంటి కానుకల నిర్వహణ లోపాలు తెరపైకి రావడం దేశవ్యాప్తంగా ఉన్న  భక్తులలో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.  

Badrinath Temple controversy, BKTC probe, Donation mismanagement allegations, Hemant Dwivedi statement, Teluguone

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.