పబ్లిగ్గా పాటపాడింది.. అంతే...!
Publish Date:Aug 8, 2024
Advertisement
ఇరాన్లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలన్న నిబంధన వుంది. అయితే జారా ఇస్మాయిలీ అనే సింగర్ హిజాబ్ ధరించకుండా పబ్లిగ్గా ఓ ఇంగ్లీషు పాటపాడింది. ఈ సందర్భంగా పోలీసులు ఆమెని అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత ఆమెని ఎక్కడకి తీసుకెళ్ళారో, ఆమె ఏమైపోయిందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. కొంతమంది మహిళలు ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నారు. వారిలో జారా ఇస్మాయిలీ కూడా ఒకరు. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూనే ఆమె పబ్లిగ్గా హిజాబ్ లేకుండా పాట పాడినట్టు తెలుస్తోంది. రెండేళ్ళ క్రితం మాసా అమీని అనే యువతి హిజాబ్ని సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలోనే ఆమె మరణించింది. ఆ సందర్భంలో మహిళలు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు జారా ఇస్మాయిలీకి కూడా మాసా అమీనికి వచ్చిన పరిస్థితే వస్తుందేమోనని పలువురు భయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/iranian-woman-arrested-for-singing-in-public-without-hijab-25-182518.html





