పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అక్కడ ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు సరికదా రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా ఇరాన్ అగ్రరాజ్యం అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అండతో రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ను అదుపులో ఉంచాలనీ, లేకుండా తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా గనుక ఇజ్రాయెల్ దేశాన్ని నియంత్రించడంలో విఫలమైతే.. తామ స్పందన తీవ్రాతి తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ను అమెరికా పెంచి పోషిస్తున్న పెంపుడు శక్తి గా ఇరాన్ అభివర్ణించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.
అసలింతకీ ఈ వివాదానికి కారణం ఏమిటంటే.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఇరాన్ దేశ సుప్రీం లీడర్‌కు మరణశిక్ష విధించాలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. గతంలో ఈ ప్రాంతంలో ఘర్షణలను పూర్తిగా నివారించేందుకు ఇరు వర్గాల మధ్య కుదిరిన ముఖ్యమైన 14 పాయింట్ల అవగాహన ఒప్పందాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ఒప్పందం మేరకు ఇజ్రాయెల్‌ను కంట్రోల్ లో ఉంచాల్సిన బాధ్యత అమెరికాదేనని కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్ గనుక తన మొండి వైఖరిని వీడకపోతే, ఆ దేశానికి యుద్ధ రంగంలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iran-warns-america-36-224810.html
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేపట్టింది.
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్‌లో వచ్చే పార్శిల్‌లో మందులు ఉంటాయని భావిస్తారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలో గురువారం తెల్లవారుజామున ఒక ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది.
కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
శ్రీకాకుళం తీరప్రాంతంలో అపారంగా లభ్యమవుతున్న బీచ్ శాండ్ మరియు హెవీ మినరల్స్ (భారీ ఖనిజాలు) ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చగల సత్తా ఉన్న అంశాలు.
గల్ఫ్ దేశంలో ఉద్యోగాల కోసం 20 మంది మహిళలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వీరు విమానం ఎక్కబోతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా అధికారులు అత్యంత గోప్యంగా ఈ సోదాలు చేపట్టాయి.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శతాబ్ద కాలానికి పైగా ఎంతో పవిత్రంగా, చారిత్రక వారసత్వంగా విరాజిల్లుతున్న గురుద్వారాను కొందరు దుండగులు పాక్షికంగా కూల్చివేసి ధ్వంసం చేయడంపై సిక్కు సమాజమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇండియా కూడా తీవ్రంగా స్పందించి పాకిస్థాన్ తీరును గర్హించింది.