అరటి రైతన్నకు ‘పశ్చిమ యుద్ధం’ సెగ... దళారుల దోపిడీతో కన్నీళ్లు

Publish Date:Mar 14, 2026

Advertisement

 

కడప జిల్లా అరటి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను సాకుగా చూపుతూ ట్రేడర్లు అరటి ధరలను ఒక్కసారిగా భారీగా తగ్గించడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట కోతకు వచ్చిన వేళ, కనీసం పెట్టుబడి కూడా తిరిగి వస్తుందా లేదా అన్న అనిశ్చితిలో రైతులు మగ్గుతున్నారు.

జిల్లాలో ప్రధానంగా పులివెందుల, లింగాల, వేముల, సింహాద్రిపురం మండలాల్లో అరటి సాగు విస్తారంగా జరుగుతోంది. ఇక్కడ పండే అరటికి అరబ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఎగుమతులు నిలిచిపోయాయని చెప్పుతూ వ్యాపారులు ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

గత నెల వరకు టన్ను అరటి రూ.25 వేల నుంచి రూ.27 వేల వరకు పలికింది. ప్రస్తుతం మాత్రం మొదటి క్రాప్‌కు కేవలం రూ.15 వేలే చెబుతుండగా, రెండో క్రాప్‌కు రూ.10 వేలకే కొనుగోలు చేయాలని ట్రేడర్లు ఒత్తిడి చేస్తున్నారు. అంటే ఒక్క నెలలోనే టన్నుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పడిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

అరటి సాగుకు ఎకరాకు దాదాపు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సాధారణంగా ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు ఆశిస్తారు. కానీ ప్రస్తుత ధరలతో చూస్తే ఖర్చులు కూడా తిరిగి రావడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో ధరలు పెరుగుతాయని భావించిన రైతులకు వ్యాపారుల సిండికేట్ పెద్ద దెబ్బతీసింది.

పులివెందుల ప్రాంత అరటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇతర ప్రాంతాల్లో పండే అరటి 7 నుంచి 8 రోజులు మాత్రమే నిల్వ ఉంటే, పులివెందుల అరటి మాత్రం సుమారు 14 రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇక్కడి చౌడు నేలల వల్ల వచ్చే రుచి, నాణ్యత కారణంగా విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది.

ఇలాంటి నాణ్యమైన పంట పండించినా ధర విషయంలో రైతులకు న్యాయం జరగడం లేదని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధాన్ని సాకుగా చూపి ధరలను తగ్గిస్తున్న దళారీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించి, ఎగుమతులు నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను అన్నదాతలు వేడుకుంటున్నారు.
 

By
en-us Political News

  
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.