ఒకే రోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చేసిన ఇరాన్

Publish Date:Apr 4, 2026

Advertisement

ఇరాన్ గగనతలంలో ఒకే రోజు అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోయిన ఘటనపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం తాము యుద్ధంలో ఉన్నామన్న ఆయన యుద్ధంలో యుద్ధ విమానాలకు నష్టం జరగడం అన్నది సర్వసాధారణమని పేర్కొన్నాడు. ఈ విమానాలు కూలిపోయిన సంఘటనలు శాంతి చర్చలకు ఎలాంటి ఆటంకం కాబోవని ట్రంప్ అన్నారు.  గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ..  ఇరాన్‌తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు.  

మధ్యప్రాచ్యంలో శుక్రవారం (ఏప్రిల్ 3) ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది. పదే పదే శాంతి చర్చల జపం చేస్తున్నది. ఇరాన్ నిర్ద్వంద్వంగా నో అంటున్నప్పటికీ బాబ్బాబు కాల్పుల విరమణ ఒప్పందానికి రండి అంటూ బతిమలాడుకుంటున్నట్లుగా అమెరికా తీరు ఉందని యుద్ధ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.  తొలుత అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ అనే అత్యాధునిక యుద్ధ విమానాన్ని ఇరాన్  కూల్చివేసింది. ఈ విమానంలో ని ఇద్దరు సిబ్బందిలో ఒకరిని   సహాయక బృందాలు  కాపాడాయి. రెండో పైలట్ కోసం గాలింపు జరుగుతోంది.

అతడిని ప్రాణాలతో పట్టుకుని అప్పగిస్తే భారీ నజరానా ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే ఇరాన్ మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసింది. అయితే అమెరికా మాత్రం రెండో యుద్ధ విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపం కారణమంటున్నది.  రెండో విమానం కూలిపోయిన ఘటనలో ఆ విమాన సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది కూడా తెలియరాలేదు.  కాగా ఒకే రోజు రెండు అమెరికా విమానాలను ఇరాన్ కూల్చివేయడంతో యుద్ధ తీవ్రత మరింత పెరిగినట్లైంది. ఈ విమానాల కూల్చివేతకు ప్రతిగా అమెరికా ఏ విధంగా ముందుకు సాగుతుంది, అమెరికా దుడులకు ఇరాన్ ఎలా బదులిస్తుందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఘ నెలకొంది. 

By
en-us Political News

  
డిసెంబర్‌లోనే కిషన్‌సింగ్ అలియాస్ పప్పుకు సుపారీ అప్పగించినట్లు అనుమానిస్తున్న పోలీసులు… ఈ హత్యను ప్రమాదంలా చూపించేందుకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఈ ముఠా కారు స్టంట్స్‌లో దీటైన అభిజిత్‌ను రంగంలోకి దింపారు.
ఈ మ్యాచ్‌లో లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా ఈ హై-వోల్టేజ్ పోరు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు అత్యంత ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
జయమ్మ, సోమయ్య దంపతులు ప్రతిరోజూ ఇతర కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే సోమయ్యకు 60 ఏళ్లు నిండడంతో, తమతో పాటు ప్రతిరోజూ చెమటోడ్చి పని చేసే తోటి కూలీల సమక్షంలోనే ఈ వేడుకను జరుపుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్ బహదూర్‌పురాలో బ్యాటరీ వ్యాపారం నిర్వహిస్తున్న రాకేష్ వర్మకు ముంబైకి చెందిన మజార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ పరిచయంతోనే గత డిసెంబర్‌లో మజార్ వద్ద నుంచి కోకైన్ కొనుగోలు చేసినట్లు రాకేష్ వర్మ సిట్‌కు తెలిపినట్టు సమాచారం.
దాదాపు 11 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో హీరా గ్రూప్‌కు చెందిన ఆస్తుల విక్రయాలు, అనుమతులు, అధికారిక నిర్ణయాలపై వివరణలు కోరినట్లు సమాచారం. హీరా గ్రూప్‌పై మనీలాండరింగ్‌, పెట్టుబడిదారుల మోసం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఇప్పటికే పలు ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అటాచ్‌ చేసిన ఆస్తులను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో అమోయ్ కుమార్ సహకరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పరిధిలో అమెరికా నౌకాదళ ఆస్తులపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడులు పరిమిత సైనిక చర్య మాత్రమేనని, పూర్తి స్థాయి యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించడం తమ ఉద్దేశం కాదని అమెరికా సీనియర్ అధికారులు పేర్కొన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భీతావహంగా మారింది.
ముఖ్యంగా ప్లేఆఫ్స్ చేరని జట్ల కెప్టెన్లపై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేళాడుతోంది. టీ20 ఫార్మాట్‌లో నాయకుడి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, జట్టు ఓటమికి కెప్టెన్ బాధ్యత వహించక తప్పదు. ఈ నేపథ్యంలో మూడు జట్ల కెప్టెన్లు ఆ బాధ్యతల నుంచి వైదొలగడమో, ఉద్వాసనకు గురి కావడమో తప్పదని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ నూతన గ్రీన్ కార్డ్ విధానం అమెరికా టెక్ పరిశ్రమను అతలాకుతలం చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న భారతీయ ప్రతిభను దూరం చేసుకుంటే ఐటీ రంగానికి భారీ నష్టం వాటిల్లుతుందని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
ఒప్పందంలో అమెరికా విధించిన షరతులకు తాము అంగీకరించలేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఇరాన్ లో శుద్ధి చేసిన యురేనియంను విదేశాలను తరలించేందుకు ఆ దేశం అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఇరాన్ సెమీ అఫీషియల్ వార్తా సంస్థ తస్నీమ్ తెలిపింది. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను దేశం నుంచి తరలించడానికి సిద్ధంగా ఉందని సౌదీ అరేబియాకు చెందిన అల్ హదత్ మీడియా ప్రచురించిన కథనాన్ని తస్నిమ్ ఖండించింది. ఈ కథనంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది.
11 రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ ధర ఆరు రూపాయలు పెరిగింది. మే 15న కిలో సీఎన్జీ పై రూ. 2, మే 18న రూ. 1, మే 23న మరో రూపాయి చొప్పున ధరలను పెంచారు. తాజా పెంపుతో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో సీఎన్‌జీ ధర రూ. 88.70కి చేరింది. గురుగ్రామ్‌లో రూ. 86.12, ముంబైలో రూ. 84గా ఉంది.
ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.