కిందపడ్డా పై చేయి మాదే అంటే ఎలా సారూ.. ట్రంప్ కు ఇరాన్ షాక్

Publish Date:Mar 25, 2026

Advertisement

ఓటమిని విజయంగా చిత్రీకరించుకునేందుకు అగ్రరాజ్యం ప్రయత్నిస్తోందంటూ ఇరాన్ ఎద్దేవా చేసింది. తాజా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ చేసిన ఐదు రోజుల యుద్ధ విరామ ప్రకటనను, 15 సూత్రాల శాంతి ప్రణాళికను ఎద్దేవా చేస్తూ ఇరాన్ అమెరికాది ద్వంద్వ నీతి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

ఘోర ఓటమిని దౌత్య విజయం(డిప్లమాటిక్ సక్సెస్)గా కలర్ ఇస్తోందని దుయ్యబట్టింది.    అమెరికా తన అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలతో ఇరాన్ దాడులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైందనీ, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి శాంతి చర్చలు,  దౌత్య విజయం  అంటూ కొత్త నాటకానికి తెర లేపిందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఎండగట్టారు. ఇరాన్ ప్రయోగించిన అత్యంత వేగవంతమైన క్షిపణులు అమెరికా రక్షణ కవచాలను ఛేదించి మరీ లక్ష్యాలను తాకాయనీ, దీంతో అమెరికా డిఫెన్స్ లో పడిందనీ ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ముందు పరువు కాపాడుకోవడానికి ట్రంప్.. ఈ ఘోరపరాభవాన్ని, పరాజయాన్ని ఒక విజయంగా చెప్పుకోవడానికి నానా తంటాలూ పడుతోందన్నారు. 

హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకల వెనకడుగును, తమ ఎఫ్-35 విమానాల వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.  
అమెరికా ఒకవైపు శాంతి ప్రణాళికలను పంపిస్తూనే, మరోవైపు ఇజ్రాయెల్‌కు ఆయుధాలను సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఈ ద్వంద్వ వైఖరిని తాము సహించబోమని, తమ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  అమెరికా తన అబద్ధపు ప్రచారాలను ఆపకపోతే, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగి అమెరికా   ఉనికికే ముప్పు తప్పదని హెచ్చరించారు.

అదలా ఉంటే..  అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణితో దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ససాక్ష్యంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. అయితే ఈ దాడిని అమెరికా ఇంకా ధృవీకరించాల్సి ఉంది.   యూఎస్ఎస్ అబ్రహం లింకన్  విమాన వాహక నౌక కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నానమీ, ఆ నౌక లక్ష్యంగా దాడులు చేస్తామని ప్రకటించిన గంట వ్యవధిలోనే ఇరాన్ దాడి చేయడం గమనార్హం. ఇరాన్ దాడిలో  యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహన నౌక బాగా దెబ్బతిందని కూడా ఇరాన్ ఆ ప్రకటనలో పేర్కొంది.  

అదలా ఉంటే.. యుద్ధ విరమణ అంటూ  అమెరికా చేసిన దౌత్య ప్రయత్నాలకు ఇరాన్ హెచ్చరిక గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.  కాల్పుల విరమణ కోసం అమెరికా పంపిన 15 సూత్రాల ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాకిస్థాన్, ఈజిప్టుల మధ్యవర్తిత్వంతో అమెరికా తన శాంతి ప్రణాళికను ఇరాన్ కు పంపింది. అయితే ఇరాన్ మాత్రం యుద్ధం ఎప్పుడు, ఎలా ముగించాలో తానే నిర్ణయించుకుంటానని స్పష్టం చేసింది. ఇరాన్ శాంతి ప్రణాళిక మోసపూరితమనీ, తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదిలా ఉందనీ కుండబద్దలు కొట్టింది.  

అంతే కాదు.. అమెరికాకు నిజంగా శాంతి కావాలనుకుంటే.. తమ షరతులకు అంగీకరించాలని పేర్కొంది. యుద్ధ విరమణకు ఇరాన్ ఐదు షరతులు విధించింది. ఇరాన్ పై దాడులను పూర్తిగా నిలిపివేయాలనీ, అలాగే యుద్ధం పునరావృతం కాదన్న స్పష్టమైన హామీ ఇవ్వాలనీ, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలన్న డిమాండ్లను అమెరికా ముందు ఉంచింది. అంతే కాకుండా, దౌత్యపరంగా చర్చలు జరుగుతున్న సమయంలో కూడా తాము దాడులను ఆపేది లేదని విస్ఫష్టంగా తేల్చి చెప్పింది.  

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.