ఇరాన్ అధ్యక్షుడి రాజీనామా?

Publish Date:Jun 1, 2026

Advertisement

అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో..  ఇరాన్ దేశాధినేతకు సంబంధించిన ఒక సంచలన వార్త ప్రపంచవ్యాప్తంగా  కలకలం రేపింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేస్తూ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కార్యాలయానికి అధికారిక లేఖ పంపారంటూ లండన్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ఆదివారం(మే31) ఒక  కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త బయటకు రాగానే అంతర్జాతీయంగా ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. దేశంలోని మిలిటరీ శక్తులు,  ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ) కమాండర్లు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారని, కీలక నిర్ణయాల నుండి దేశ అధ్యక్షుడిని,  రక్షణ రంగానికి చెందని పౌర ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆ  లేఖలో పెజెష్కియాన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది.

  అంతర్గత నివేదికల ప్రకారం.. ఇరాన్ ప్రభుత్వంలో   ఈ అధికార శూన్యతను ఆసరాగా చేసుకుని ఐఆర్జీసీలోని తీవ్రవాద గ్రూపులు దేశ వ్యవహారాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నాయనీ,  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాను పౌర ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపలేననీ, తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించలేనని పేర్కొంటూ మసూద్ పెజెష్కియాన్ తక్షణమే తనను పదవి నుండి తప్పించాలని సుప్రీం లీడర్‌ను కోరారన్నది ఆ కథనం సారాంశం. ముఖ్యంగా అమెరికాతో జరుగుతున్న యుద్ధ నిర్వహణ తీరు, దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనోపాధిపై దాని విధ్వంసక ప్రభావాల విషయంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మరియు ఐఆర్జీసీ చీఫ్‌కు మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారనే వార్తల నడుమ ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అయితే ఈ రాజీనామా వార్తలను ఇరాన్ అధికార యంత్రాంగం ఖండించింది. ఇరాన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సయ్యద్ మెహదీ తబాతబాయి ఈ నివేదికలను పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.  విదేశీ మీడియా సంస్థలు ఆడుతున్న  మీడియా గేమ్ గా అభివర్ణించారు.  ఐఆర్జీసీ అనుబంధ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ కూడా ఈ వార్తలను ఖండిస్తూ, అధ్యక్షుడు తన విధుల్లోనే కొనసాగుతున్నారని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమంపై, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిపై కఠినమైన షరతులతో కూడిన శాంతి ప్రతిపాదనను పంపిన తరుణంలోనే ఈ రాజీనామా వివాదం వెలుగు చూడడం గమనార్హం.  

By
en-us Political News

  
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.