సోషల్ మీడియాలో యూఎస్, ఇజ్రాయెల్‌లను ఆడుకుంటున్న ఇరాన్
Publish Date:Apr 17, 2026
Advertisement
అమెరికాపై నాన్‌స్టాప్ సెటైర్లు వేస్తూ, ఏఐ, లెగో వీడియోలతో ఇరాన్ ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ వర్షన్‌ను కూడా వినాల్సిందేనంటూ ట్రంప్ స్టేట్‌మెంట్లకు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తోంది. అగ్రరాజ్యం సైనిక శక్తి గురించి అందరికి తెలిసిందే. తాము అనుకుంటే చాలు ఏ దేశాన్నైనా నయానో, భయానో తమ దారికి తెచ్చుకోగలమని అమెరికా భావిస్తుంటుంది. అలాంటి అమెరికాకు ప్రస్తుతం ఇరన్ కొరకరాని కొయ్యగా మారింది. యుద్ధంలో మేమే గెలిచాం.. అనుకున్న లక్ష్యాలను సాధించామని అమెరికా చెబుతున్నా.. ప్రపంచం మొత్తం ఈ మాటలను పూర్తిగా నిజమని నమ్మే పరిస్థితి లేదు. దీనికి ఓ కారణం ఉంది. అదే ఇరాన్ ఎప్పటికప్పుడు ప్రపంచానికి ఇస్తున్న అప్‌డేట్స్. వార్ ఫేర్‌లో అమెరికాను మించిన సైనిక శక్తి ప్రపంచంలో లేదు. ఇది ఎవరు అవునన్నా కాదన్న పూర్తిగా నిజం. కానీ తాము చేసే యుద్ధాలను, దాడులను సమర్థించుకోవడంలో అమెరికా ఎప్పుడూ పైచేయి సాధిస్తుంది. గతంలో గల్ఫ్ దేశాలపై అమెరికా చేసిన దాడులను ప్రపంచం మొత్తం సమర్థించింది. కారణం.. అమెరికా ఆ యుద్ధాలు చేయడానికి చూపిన కారణాలు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ప్రపంచానికి చూపించలేదనేది వేరే విషయం. కానీ వెస్ట్రన్ మీడియాలో దానికి సంబంధించిన ఆర్టికల్స్, వీడియోలు వచ్చేవి. వాటినే ప్రపంచం మొత్తం చూసేది. వాటినే తిరిగి రాసేది. ఏది ఏమైనా తాము చేసింది సరైనది అని ప్రపంచానికి బలంగా చూపించేది. దీనికి సంబంధించిన హాలీవుడ్ మూవీస్‌ను తీసి.. తమ వారిని హీరోలుగా చూపించేది. కానీ అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ వార్‌లో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా చేసే ప్రకటనలు.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే స్టేట్‌మెంట్‌లకు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తోంది ఇరాన్. గతంలోలాగా వన్‌సైడ్ స్టోరీ కాదు.. మా ఆవేదన కూడా వినాలి.. మా వర్షన్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి అంటోంది . ఇందుకోసం సోషల్ మీడియాను తమ అస్త్రంగా మార్చుకుంది. నిజానికి ఇరాన్ వెర్షన్‌ను రిపోర్ట్ చేసే మీడియా ప్రస్తుతం లేదు. వారు వారి దేశంలో ప్రసారం చేసుకునే కథనాలు ఎవరూ తిరిగి పబ్లీష్ చేయరు. అందుకే సోషల్ మీడియానే తన అస్త్రంగా మార్చుకుంది. ప్రస్తుతం ఈ లెగో స్టైల్ వీడియోలు ఓ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. తాము చెప్పాలనుకున్న విషయాలను సాంగ్స్ రూపంలోనో.. డైలాగ్స్ రూపంలోనో చెప్పేస్తుంది ఇరాన్. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును టార్గెట్‌గా చేసుకుంటుంది ఇరాన్. ట్రంప్ ఏదో టైమ్‌పాస్ కోసం యుద్ధం చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని, వారి ఉద్దేశాలను ఎప్పటికప్పుడు వీడియోలతో చెబుతోంది ఇరాన్. అసలు ఈ యుద్ధం చేస్తున్నది అమెరికానే అయినా.. వెనకుండి కథ నడిపిస్తున్నది ఇజ్రాయెల్ అని మొదటి నుంచి ఆరోపిస్తున్నది ఇరాన్. నిజానికి గతంలో ఈ కామెంట్స్‌ను చేసింది. కానీ ఈ మెసేజ్ చాలా తక్కువ మందికి రీచ్ అయ్యింది. బట్.. ఒక్క ఏఐ వీడియో ఈ కథను ఇప్పుడు అనేక మందికి చేరవేసింది. ఇరాన్ 40 వేల మంది నిరసనకారులను చంపింది అంటూ అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే దీనికి కూడా ఓ వీడియోతో సమాధానం ఇచ్చింది ఇరాన్. అంతేకాదు చంపడం గురించి వస్తే.. మీరు చంపిన వారి సంగతేంటి అంటూ ఇరాన్ చేసిన ఓ పోస్ట్ అయితే తెగ వైరల్‌గా మారింది. ఇంతేనా హర్మూజ్ జలసంధి మూసేయడంపై వచ్చిన మీమ్స్, ఏఐ వీడియోలు అన్నీ ఇన్నీ కావు. ఓవరాల్‌గా చూస్తే ఇరాన్ తన వ్యూహాన్ని మార్చినట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. కేవలం అమెరికా, ఇజ్రాయెల్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ఓ వైపు ట్రేడిషనల్ వార్ ఫేర్ కంటిన్యూ చేస్తూ సోషల్ మీడియాలో కూడా తమ శత్రుదేశాల మోరల్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. అయితే ఈ వీడియోలలో ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు కొన్ని.. అమెరికన్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లినట్లు కొన్ని ఇమేజేస్, వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ వీటిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం ఈ వీడియోలు మాత్రం వెస్ట్రన్ కంట్రీస్‌లోని జనాలకు మాత్రం రీచ్ అవుతున్నాయి. అమెరికా చెప్పింది మాత్రమే కాదు.. ఈ వెర్షన్ కూడా నిజమే కదా అని ఆలోచించే పరిస్థితి అయితే తీసుకువచ్చింది ఇరాన్. అంతేకాదు అమెరికా రాజకీయాల్లోని అంతర్గత విభేదాలను ఇరాన్ తనకు అనుకూలంగా వాడుకుంటోంది అనేది వాస్తవం. అమెరికాలో యుద్ధ వ్యతిరేక గ్రూపులను, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోస్ట్‌లు పెడుతున్నారు. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, బ్లూ స్కై వంటి ప్లాట్‌ఫామ్‌లలో వేల సంఖ్యలో బాట్ అకౌంట్స్‌ను ఉపయోగించి హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తోంది ఇరాన్. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఇరాన్ అఫిషియల్ అకౌంట్స్ అంటే ఇరాన్ ఎంబసీలు చేసే కొన్ని పోస్ట్‌లు మరింత వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పుడు ఇవి కూడా ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి.
ట్రంప్ ఒక రోజు ఇరాన్‌ను అంతం చేస్తామంటారు.. ఆల్రెడీ అంతం చేసేశాం అంటారు మరోరోజు.. ఇరాన్ తలరాతను మార్చేది తామే అంటారు ఇంకో రోజు.. యుద్ధం కొనసాగుతోందని.. కాదు ముగిసిందని.. ఇరాన్ మేము పెట్టిన నిబంధనలకు అంగీకరించిందని.. ఇలా అనేక స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వీటికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉంది ఇరాన్. దీని కోసం మీమ్స్, ఏఐ వీడియోలను ఆయుధంగా మార్చుకుంది. దీనిని స్లోపాగండా.. లేదా మెమెటిక్ వార్‌ఫేర్ అని పిలుస్తారు.
http://www.teluguone.com/news/content/iran-israel-war-36-217614.html





