ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం.. సందిగ్ధంలో భారత్

Publish Date:Jun 17, 2025

Advertisement

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్నది. ఇరుదేశాలు దాడి, ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ఇరాన్‌ ధ్వంసం చేసింది. ఇరాన్‌ ఇంతకాలం హమాస్, హెజ్బొల్లా వంటి ప్రాంతీయ శక్తులను ఇజ్రాయెల్‌ పైకి ఎగదోసేది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ నేరుగా ఇరాన్‌పై దాడికి దిగింది. రెండు దేశాలూ డ్రోన్లు, క్షిపణులతో దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఇది పశ్చిమాసియాతోపాటు మిగతా ప్రపంచంపైనా తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ వైరానికి 1979లోనే బీజం పడింది. ఆ ఏడాది ఇరాన్‌లో మతశక్తుల నాయకత్వంలో విప్లవం సంభవించింది. అయతుల్లా ఖొమైనీ సారథ్యంలోని ఇరాన్‌ మత పాలకులు ఇజ్రాయెల్‌ను జియోనిస్టు శత్రువుగా ప్రకటించారు. ఆ తర్వాత లెబనాన్‌లో హెజ్బొల్లా, గాజాలో హమాస్‌కు ఇరాన్‌ మద్దతునిచ్చి ఇజ్రాయెల్‌పై పోరుకు ఉసిగొల్పింది. ఇజ్రాయెల్‌కు అమెరికా, నాటో కూటమి పూర్తి మద్దతు ఇస్తూ వచ్చాయి. 2024 ఏప్రిల్‌లో సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఇరానియన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ అధికారులు హతమయ్యారు. ఇరాన్‌ అక్టోబరులో ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడి చేసింది. తాజాగా ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరుతో ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌లోని నగరాలపై దాడి చేసినా, ప్రాణనష్టం తక్కువే. ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌ బాలిస్టిక్‌ మిసైళ్లు గణనీయమైన నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. మరోవైపు అణ్వాయుధ నిరోధ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే దిశగా ఇరాన్‌ యోచిస్తోంది.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పోరు ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు. మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని కనబరుస్తోంది.ఇరాన్‌ తీరంలోని హోర్ముజ్‌ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం నడుస్తోంది. ఈ జలసంధి బందయితే చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోయి ప్రపంచ ఆర్థికం దెబ్బతింటుంది. ఇప్పటికే ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్‌కు తాజా పరిణామాలతో చమురు ఎగుమతులు నిలిచిపోతే ద్రవ్యోల్బణం కట్టు తప్పుతుంది. అది రాజకీయ అస్థిరతకు దారితీయకమానదు. 

తాజాగా అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగాల్సిన అణు చర్చలు గాడి తప్పాయి. చర్చల నుంచి వైదొలగుతామనీ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ)తో మాత్రమే సంబంధాలు కొనసాగిస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. దారికి రాకపోతే ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. వెంటనే అణు ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదని హితవు పలికారు. ఇజ్రాయెల్‌ దాడులను విమర్శించిన రష్యా, చైనాలు ఇరాన్‌కు ఆయుధ, సాంకేతిక, దౌత్య సహాయాల్ని అందించి, ప్రత్యామ్నాయ సైనిక కూటములలో చేరాల్సిందిగా ప్రతిపాదించవచ్చు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పోరులో ప్రధాన దేశాలు జోక్యం చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత ముదరవచ్చు.

పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ దేశాల్లోని భారతీయ కార్మికులు, నిపుణులు జమచేసే విదేశ మారక ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం. పశ్చిమాసియాతో భారత్‌కు సైనిక వ్యూహపరమైన ప్రయోజనాలూ ఉన్నాయి. అందువల్ల ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్‌కు నష్టదాయకమే. చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు పెరిగిపోతాయి. రవాణా, పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటాయి. ఎరువుల కొరతతో ఆహారోత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ఇండియాకు ఇజ్రాయెల్‌తో రక్షణ, సాంకేతికపరంగా పొత్తు ఉంది. ఇరాన్‌లో చాబహార్‌ రేవును అభివృద్ధి చేయడం ద్వారా మధ్యాసియాతో రవాణా అనుసంధానం ఏర్పరచుకోవడానికి భారత్‌ కృషిచేస్తోంది. అందుకని ఇరాన్, ఇజ్రాయెల్‌లలో ఎటువైపూ మొగ్గలేని పరిస్థితి నెలకొంది. 

ప్రస్తుతం నడుస్తున్న యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్యే సాగుతుందా, ఇతర శక్తులూ జోక్యం చేసుకుంటాయా అన్నది త్వరలో తేలిపోతుంది. ఇజ్రాయెల్‌ దాడుల వల్ల ఇరాన్‌ బాగా బలహీనపడింది. భారత్‌కు ఇరాన్, ఇజ్రాయెల్‌లు రెండింటితో సత్సంబంధాలు ఉన్నందువల్ల మధ్యవర్తిత్వం వహించగల స్థితిలో ఉంది. మరి చూడాలి ఈ యుద్ద వాతావరణం ఏ మలుపులు తిరుగుతుందో?

By
en-us Political News

  
కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వంటి శాఖల మంత్రులను మనం ఇప్పటి వరకు చూశాం.. కాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా పామ్ ఆయిల్ మంత్రి వచ్చారు..జిల్లాలో ఆయన పామ్ ఆయిల్ సాగుపై దృష్టి సారించారు.
భార్యతో విభేదాల నేపథ్యంలో కోర్టుకెక్కిన ఓ జంటకు విడాకులు మంజూరయ్యాయి. కోర్టు తీర్పు విన్నాక ఇంటికి చేరుకున్న భర్త.. 40 లీటర్ల పాలతో స్నానం చేసి తాను ఇక స్వేచ్ఛాజీవినని సంతోషం వ్యక్తం చేశాడు.
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన ఆమె.. మల్లన్న దారుణంగా మాట్లాడారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి జోరుగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మాత్రం అయోమయంలో పడింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ సీపీఐ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి పోటీచేసి ఓడిపోయారు.
ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్‌లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు చాలా బాధాకరమన్నారు.
లష్కర్ బోనాల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు వేదాశీర్వచనాలిచ్చారు.
జ‌గ‌న్ చుట్టూ ఇంత మంది జ‌నం.. రియ‌లా ఫేకా? అస‌లేంటీ పొలిటిక‌ల్ ప‌బ్లిక్ స్టోరీ? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశం. బేసిగ్గా జ‌గ‌న్ కి బీసీ-ఎస్సీ-ఎస్టీ- ముస్లిం- క్రిష్టియ‌న్- మైనార్టీల్లో ఓటు బ్యాంకు ఉన్న మాట నిజం. ఆ సాలీడ్ ఓటు బ్యాంకే మొన్న‌టి ఎన్నిక‌ల్లో 39 శాతం ఓట్లు ప‌డేలా చేసింది.
మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఇవాళ ఉదయాన్నే కొందరు జాగృతి కార్యకర్తలు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు.
గ‌ణేశ్ సినిమాలో.. ఫేమ‌స్ డైలాగ్. నేను బ‌త‌కాలి త‌మ్మీ అంటూ ఆయ‌న చెప్పిన డైలాగుల‌కు అప్పట్లో య‌మ క్రేజుండేది. ఆపై గాయంలో ఆయ‌న ఖండిస్తున్న అనే డైలాగ్ కూడా చాలా చాలా ఫేమ‌స్ అయ్యింది.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కోట భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో మరో ప్రమాదం జరిగింది. ఎన్విరోవేస్ట్‌ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (జులై 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్తట్ మెంట్లన్నీ నిండియోయాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.