ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల తన రాజీనామాను పలు నిరాధార ఆరోపణలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అవన్నీ పూర్తిగా అబద్ధమని, తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగత, స్వచ్ఛంద నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తన సేవా కాలాన్ని అత్యంత సంతృప్తికరమైన ప్రయాణంగా పేర్కొంటూ… ఈ రాష్ట్రాన్ని సొంత ఊరిగా భావించానని, ఇక్కడి ప్రజలపై తనకున్న ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
ఏపీ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు, జూనియర్లకు, మరియు తనకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి పౌరుడికి కృతజ్ఞతలు తెలిపారు. తమ మద్దతుతోనే తాను ఈ స్థితికి చేరినట్టు పేర్కొన్నారు.ముందుకు సాగుతున్న తాను, సమాజానికి కొత్త రీతుల్లో సేవ చేయాలని, కృతజ్ఞత, స్పష్టత, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని తన సంకల్పాన్ని తెలియజేశారు. సిద్ధార్థ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వీఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు టాక్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ips-siddharth-kaushal-25-201105.html
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ 427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు.
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ను అరెస్ట్ చేసి 81 లక్షల రూపాయల విలువైన 26 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు.
అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ వద్ద గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగులగొట్టి త్రవ్వకాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ర్యాగింగ్ కు పాల్పడిన 13 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి చెప్పారు.
విశాఖలో కోకైన్ కలకలం రేపింది ఓ ఆఫ్రికన్ వద్ద 25 గ్రాముల కొకై న్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు రాష్ట్రంలో అసత్యపు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది.
రాయచోటి ఘటన జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని,దీనిపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఓక ప్రకటనలో హెచ్చరించారు.
మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ పలు పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఇవాళ ఉదయం ముందస్తు బెయిల్లో భాగంగా కోర్టు షరతుల మేరకు అత్కూరు, గన్నవరం, హనుమాన్ జంక్షన్, పటమట పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం చేసి వెళ్లారు
సింహాచలం అప్పన్న ఆలయంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో కూటమి సర్కార్ మరో మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించాలని నిర్ణయంచింది.
యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు.