ఐపీఎల్ పునఃప్రారంభం.. కోల్‌కతాతో ఆర్సీబీకి కీలక మ్యాచ్

Publish Date:May 17, 2025

Advertisement

భారత్‌, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. పఠాన్‌ కోట్‌, జమ్ములో పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పునఃప్రారంభం కానుంది. రాత్రి 7:30లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ , కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనున్నాయి. 
అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్రమాదమూ ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటివరకు తాను ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 12 మ్యాచుల్లో అయిదింట్లో విజయం సాధించి, ఆరో స్థానంలో ఉంది. 

ఈ లీగ్ దశ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో దాని స్థానం పదిలం అవుతుంది. కానీ, ఈ సీజన్‌లో సొంత మైదానంలో అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఆర్‌సీబీకి, అదే మైదానంలో కేకేఆర్‌తో జరిగిన పేలవమైన రికార్డు మరో తలనొప్పిగా మారింది. నిజానికి, 2015 నుంచి ఈ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా చేతిలో వరుసగా ఓడిపోతూనే ఉంది. అంటే, శనివారం ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఆర్‌సీబీ 10 సంవత్సరాల చరిత్రను మార్చాల్సి ఉంటుంది.

చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన బాగాలేదు. ఈ మైదానంలో ఆడిన చివరి 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా ఆర్‌సీ  బీపై విజయం సాధిం చింది. 2015 తర్వాత ఆర్‌సీబీ వారి సొంత గడ్డపై ఒక్కసారి కూడా కేకేఆర్‌ను ఓడించలేకపోయింది. అదే సమయంలో, ఈ మైదానంలో రెండు జట్ల మొత్తం రికార్డులు చూస్తే ఆర్‌సీబీ వెనుకబడి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరగగా, బెంగ ళూరు కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. కోల్‌కతా 8 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 35 మ్యాచ్‌లు జరిగాయి. ఆర్‌సీబీ  15 గెలిచి, 20 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, ఈ సీజన్‌లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ అనేక పాత రికార్డులను బద్దలు కొట్టింది. అది 17 సంవత్సరాల తర్వాత చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, 10 సంవత్సరాల తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించగలిగింది. ఆర్‌సీబీ ఇప్పుడు కోల్‌కతాపై కూడా అదే ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.

By
en-us Political News

  
జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
బోయింగ్ 787 విమానం.. గాల్లోకి ఎగిరిన 30 సెకన్లకే.. తాము భోంచేస్తున్న సమయంలో వచ్చి మీద పడి.. తమ వారి ప్రాణాలను పట్టుకుపోతుందని వారు అస్సలు ఊహించలేదు.
అహ్మదాబాద్‌ ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం ఘటనపై టాటా గ్రూప్ విచారం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం టాటా గ్రూప్ ప్రకటించింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్లు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ధృవీకరించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం సంఘటనా స్థలాన్ని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. విమానం కూప్పకూలిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు ప్రమాద ఘటన వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు.
ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో ఒకే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ సీపీ మాలిక్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సీటు ఏ11 ప్రయాణికుడు నడుచుకుంటూ బయటకు వచ్చినట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి.
విమానం ఎక్కాలంటేనే కాదు, దిగాలన్నా అదృష్టం ఉండాలి... ఇది ఏదో సినిమాలో డైలాగు. ఈ రోజు అది నిజమని మరో మారు రుజువైంది.
గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి అవకాశం లేదని ఆయన అసోసియేట్ ప్రెస్‌తో అన్నారు. ఆ విమానంలో మొత్తం 242 మంది ఉండగా.. వారంతా దాదాపు చనిపోయి ఉంటారని పరోక్షంగా వెల్లడించారు.
కూటమి సర్కార్ ఏడాది పాలన సభ కార్యక్రమం వాయిదా పడింది. ఏడాది పాలన పూర్తి సందర్భంగా విజయవాడలోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో తన అకౌంట్ డీపీ & కవర్ పీక్‌ను నలుపు రంగులోకి మార్చింది. కాగా ఈ ప్రమాద నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై నెట్టింట విమర్శస్తున్నాయి.
అహ్మదాబాద్- లండన్ విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలింది. దీంతో 20 మందికి పైగా మెడికోలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్‌‌ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవియేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీలను వెంటనే రంగంలోకి దింపినట్లు ట్వీట్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.