సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ముగింపు వేడుకలు
Publish Date:Jun 3, 2025
Advertisement
ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలు నేటి సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమన్ని నిర్వహిస్తోంది. ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవన్ పాల్గొననున్నట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్‌లో సేవలందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులకు ఈ సందర్భంగా సత్కరించనున్నారు. అంతేకాకుండా, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలాగైన కప్ గెలిచి తమ అభిమానుల కోరికను నెరవేర్చాలని ఆర్‌సీబీ వ్యూహాలు రచిస్తోంది. ఈ లీగ్ ఆవిర్భావం (2008) నుంచీ బరిలో నిలిచి టైటిల్‌ను ముద్దాడే క్షణం కోసం 18 ఏండ్లుగా వేచి చూస్తున్న ఆర్‌సీబీ , పంజాబ్ కింగ్స్ తమ కలను నెరవేర్చుకునే ప్రయాణంలో ఆఖరి దశకు చేరుకున్నాయి. సీజన్ ఆసాంతం స్ఫూర్తిదాయక విజయాలతో ఫైనల్ చేరిన ఈ ఇరుజట్ల మధ్య మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్-18 ఫైనల్ జరుగబోతున్నది.ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గతంలో 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఫైనల్స్ వరకు చేరినా, విజేతగా నిలవలేకపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత, 2025 సీజన్‌లో మరోసారి ఫైనల్‌కు అర్హత సాధించి, టైటిల్‌పై గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ఒకసారి ఫైనల్‌కు చేరి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇన్నేళ్లకు మళ్లీ ఫైనల్ బరిలో నిలిచి, తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.ఫైనల్ ముందు ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనర్ ఫిల్ సాల్ట్ జట్టుతో చేరాడు.తన భార్య తొలిబిడ్డకు జన్మనివ్వడంతో స్వదేశానికి వెళ్లాడు. తిరిగి మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో తిరిగి జట్టుతో చేరాడు. యూకేకి వెళ్లిన ఆయన తిరిగి ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి.
http://www.teluguone.com/news/content/ipl-2025-25-199227.html





