పాయె.. అయిపాయె.. ఐప్యాక్ కూడా జగన్ కు జెల్ల కొట్టేసింది!

Publish Date:May 14, 2024

Advertisement

జగన్ పని అయిపోయింది. ఎన్నికలలో ఓటమి ఖరారైపోయింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంతో జగన్ పార్టీ మూటాముల్లె సర్దుకోవడమే మిగిలింది. ఆ మిగిలిన కాస్తా జూన్ 4న పూర్తైపోతుంది అన్నది ఇప్పటి వరకూ పరిశీలకులు, విపక్ష కూటమి నేతలూ చెబుతున్న మాట. సామాన్యుల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే అధికారికంగా ఫలితం వెలువడటానికి ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉన్నా.. జగన్ పని అయిపోయిందని చెప్పడానికి తిరుగులేని రుజువుగా ఐప్యాక్ నిలిచింది.

ఇన్నేళ్లుగా జగన్ వ్యూహాలు, ఎత్తుగడలన్నిటి వెనుకా నిలిచిన ఐ ప్యాక్ పోలింగ్ పూర్తి కాగానే జగన్ కు జెల్ల కొట్టేసిందని అర్ధమౌతోంది. పోలింగ్ సోమవారం (మే13) పూర్తయ్యింది. మే 15( బుధవారం ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ ఆయన టీమ్ జగన్ తో కలిసి విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు ఎప్పుడో నిర్ణయించేసుకున్నాయి. ఆ సందర్భంగా ఐ ప్యాక్ జగన్ ను సన్మానించాలని కూడా భావించింది. అయితే ఇప్పుడు ఆ విజయోత్సవ సంబరం, జగన్ సన్మాన కార్యక్రమం రెండింటినీ కూడా ఐప్యాక్ రద్దు చేసుకుంది.  

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే బుధవారం ఐప్యాక్ బృందంతో కలిసి జగన్ పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలేవారు. కానీ పోలింగ్ రోజు ఉదయం నుంచే ప్రజలలో కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత పోలింగ్ సరళితో ప్రస్ఫుటంగా కనిపించడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి ప్రజా వ్యతిరేకత సునామీలా ఈవీఎమ్ లలో నిక్షిప్తమైపోయిందని స్పష్టమైపోవడంతో  వైపీపీ బెంబేలెత్తిపోయింది. అలాగే ఐప్యాక్ కూడా మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోవడానికి రెడీ అయిపోయింది. దీంతో బుధవారం ( మే 15) విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ఐప్యాక్ కార్యాలయంలో జరగాల్సిన వేడుకలకు ఫుల్ స్టాప్ పడింది. జగన్ ను ఐ ప్యాక్ ఆఫీసుకు ఆహ్వానించి సన్మానించాలన్న రుషిరాజ్ సింగ్ ప్రణాళికకు గండిపడింది. జగన్ ఐప్యాక్ కార్యాలయానికి రావడం లేదనీ, ఆయన సన్మాన కార్యక్రమం రద్దైందనీ ఐప్యాక్ వర్గాల ద్వారానే విశ్వసనీయంగా తెలిసింది. 

ఈ మేరకు వైసీపీ నుంచి ఐప్యాక్ కు స్పష్టమైన సమాచారం అందింది.  దీంతో భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవాలన్న ఐప్యాక్, వైసీపీల ప్రణాళిక కార్యరూపం దాల్చకుండానే ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇది ఎన్నికలలో జగన్ కు విజయావకాశాలు ఇసుమంతైనా లేవన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా చాటుతోందని పరిశీలకులు చెబుతున్నారు.  అంతే కాదు ఐప్యాక్ సభ్యులకు కంపెనీ ఇచ్చిన  మెబైల్ ఫెన్ లు, ల్యాప్ టాప్ ల  బుధవారం (మే 15) ఉదయానికల్లా తిరిగి ఇచ్చేయాలని విస్పష్ట ఆదేశాలు అందాయి. అంతే కాదు వారికి ఇవ్వవలసిన ఈ నెల వేతనాలు, ఇతర అలవెన్సులు అందజేస్తామని తెలిపింది. అంతే కాకుండా ఎవరైన లాప్ టాప్, మెబైల్స్ రిటర్న్ చేయకుంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరిక కూడా జారీ అయ్యింది.

ఇంత అర్జంట్ గా ఐ ప్యాక్ సభ్యుల నుంచి పోన్లు, ల్యాప్ టాప్ లను వెనక్కు తీసుకోవడానికి కారణం ప్రభుత్వం మారితే తమ ఫేక్ ప్రోపగాండా బయటకు పొక్కి చిక్కుల్లో పడతామన్న భయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు జగన్ ఐప్యాక్  రిషిరాజ్ సింగ్ ఆయన టీమ్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, అంతే కాకుండా వారికి ఇస్తామన్న 50 కోట్ల రూపాయల ప్యాకెజీని హోల్డ్ లో పెట్టారనీ తెలుస్తోంది.   ఆ కారణంగానే ఐ ప్యాక్ జగన్ సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసుకుందని అంటున్నారు. 

By
en-us Political News

  
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.