జగన్ రివర్స్ పాలన.. రివర్స్ టెండరింగ్.. రివర్స్ ఇన్వెస్ట్ మెంట్స్!

Publish Date:Aug 2, 2023

Advertisement

గత మార్చి నెల 3, 4 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘స్వప్న’ రాజధాని విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్’ నిర్వహించింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఆవిషయం గుర్తుందో లేదో కానీ, ఆ సందర్భంగా ఆయన అదే వేదిక నుంచి రెండు కీలక  ప్రకటనలు చేశారు. 

ఈ సదస్సు ద్వారా, రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చి పడుతుందని చేయెత్తి మరీ చెప్పు కొచ్చారు. అలాగే, వట్టి పెట్టుబడులే కాదు, పెట్టుబడులతో పాటుగా..లక్షల్లో ఉద్యోగాలు వచ్చిపడుతున్నాయని ప్రకటించారు. ఒకటి రెండు కాదు, ఏకంగా 20 రంగాలకు సంబంధించి, 340 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, తద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు, ఓ ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి, తమ ట్రేడ్ మార్క్ చిరునవ్వు చెరగకుండా, సగర్వంగా చెప్పారు. 

అదే  వేదిక నుంచి ముఖ్యమంత్రి విశాఖ వాసులకు మరో ‘తీపి’ కబురు కూడా వినిపించారు విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని వెల్లడించారు. అలాగే  తాను త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తానంటూ ముఖ్యమంత్రి సదస్సు వేదికగా పారిశ్రామిక దిగ్గజాలు - ఆహుతుల సమక్షంలో ప్రకటించారు.

సరే రాజధాని విషయం కాసేపు పక్కన పెడడాం..  పెట్టుబడుల మాటేమిటి? అవైనా వచ్చాయా, అంటే, ఆ ఒక్కటీ అడగొద్దనేదే సర్కార్ స్వాముల సమాధానం. నిజమే విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్  వంటి సదస్సుల్లో కుదుర్చుకున్న ఎంఓయూలు అన్నీ, గ్రౌండ్ కావు. కొన్ని ఒప్పందాలు కాగితాలకే  పరిమితం అవుతాయి. అందులో కొన్ని ఉత్తుతి ఒప్పందలుంటాయి. కొన్నిటి విషయంలో ఎక్కడో చిక్కుముడి పడి ఆగి పోతాయి. ఇంకొన్ని కొంచెం ఆలస్యంగా మొదలవుతాయి ... కానీ, ఎన్నో కొన్నయితే ఖాయంగా ఇప్పటికే గ్రౌండ్ కావాల్సింది. కానీ, ‘వైరైటీ’ గా జగన్ రెడ్డి ప్రభుత్వం కుదుర్చుకున్న, పోనీ కుదుర్చుకున్నామని స్వయంగా  ముఖ్యమంత్రి ప్రకటించిన  రూ.13 లక్షల కోట్లలో నుంచి కోట్ల తీసేసి లక్షల్లో చూసినా ఆ రూ.13 లక్షల పెట్టుబడులు అయినా వచ్చాయా ..అంటే లేదనే సమాధానమే వస్తోంది.

నిజానికి, విశాఖ సమ్మిట్ తర్వత కాదు, జగన్ రెడ్డి నాలుగేళ్ళ పై చిలుకు పాలనలో రాష్టానికి కొత్తగా వచ్చిన పెట్టుబడులు ఏంటో తెలిస్తే, సిగ్గుతో తలదించుకోక తప్పుదు. అవును జగన్ రెడ్డి పాలనలో పెట్టుబడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అధోగతికి చేరింది. అట్టడుగు స్థాయికి చేరుకుంది. ఇదేదో ఎవరో జగన్ రెడ్డి అంటే గిట్టని వ్యతిరేకులు చేస్తున్న ఆరోపణ కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే, 2019 నుంచి 2022 వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 5751 కోట్లు .. అంటే, దేశం మొత్తం పెట్టుబడులలో 0.4 శాతం. ఇంత తక్కువగా పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం దేశంలో  ఏపీ తప్ప మరోటి లేదనడంలో సందేహం లేదు. 

కొత్తగా పెట్టుబడులు రాకపోవడం ఒకటైతే గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ( కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం అయిదేళ్ళలో రూ. 6 లక్షల కోట్లకు పైబడిన పెట్టుబడులు వచ్చాయి) అంతకు ముందు  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు అనేక మంది జగన్ రెడ్డి అరాచక పాలన భరించలేక రాష్ట్రం వదిలి పోయారు.   

రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర  చంద్రబాబు నాయుడు హయాంలో  ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురానికి వచ్చింది, చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి. విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే జగన్ రెడ్డి పాలనలో  సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.దీంతో లూలు గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పాటు  ఇప్పుడున్న పరిస్థితిలో ( అనగా జగన్ రెడ్డి అధికారంలో ఉండగా ..)  ఇక మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని తేల్చి చెప్పేసింది.

అంత వరకు ఎందుకు, చిత్తూరు జిల్లాకు చెందిన  గల్లా వారి,  అమర రాజా కంపెనీ, జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను, తెలంగాణకు తరలించుకు పోయింది.. ఇలా చెప్పాలంటే చాల చాలా ఉన్నాయి. ఒక్క మాటలో ముగించాలంటే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు ..ఆ సాహాసం చేసే పెట్టుబడి దారులు లేరు.  ఉన్న  పెట్టుబడులు నిలిచే పరిస్థితీ లేదు. పెట్టుబడులు రానిదే రాష్ట్రం ముందుకు సాగదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు ... అప్పులు మాత్రమే మిగులుతాయి. మరి రాష్ట్ర భవిష్యత్ ..? ఈ ప్రశ్నకు జవాబు ప్రజలే చెప్పవలసి ఉంటుంది . ఓటు వారి చేతిలో నే వుంది.

సరే మళ్లీ గ్లోబల్ సమ్మిట్ దగ్గరకు వస్తే.. ఆ సమ్మిట్ లో పెట్టుబడులు పెడతామంటూ కోట్లూ, బూట్లూ వేసుకు వచ్చిన వారంతా నిజంగా పారిశ్రామిక వేత్తలేనా అన్న అనుమానాలు అప్పట్లోనే వచ్చాయి. భోజనాల దగ్గర వారు చేసిన గలాటా.. వారిలో కొందరిని ఐప్యాక్ సభ్యులుగా గుర్తించి అందుకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో గ్లోబల్ సమ్మిట్ ఓ ప్రహసనం అని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తయి. అయితే సాక్షాత్తూ ముఖ్యమంత్రే గొప్పగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటించేసరికి కొందరు కాకపోతే కొందరైనా అందులో ఎంతో కొంత గ్రౌండ్ కాకపోతుందా అని ఆశించారు. అయితే  వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి కూడా వాస్తవాలు మాట్లాడడని తేలిపోయింది. మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ జరిగిన నాలుగు నెలల తరువాత అటువంటి సమ్మిట్ ఒకటి తన హయాంలో జరిగిందన్న సంగతిని జగన్ తో సహా ఆయన కేబినెట్ పూర్తిగా మరచిపోయింది. 

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.