భాగస్వామ్య సదస్సుకు ముందే ఏపీకి పెట్టుబడుల వరద

Publish Date:Nov 13, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుండగా, అందుకు ఒక రోజు ముందే అంటే గురువారం (నవంబర్ 13) దాదాపు 35 సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఓప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి దాదాపు మూడులక్షల  66 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.  అలాగే ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో నెలకొల్పనున్న పరిశ్రమలలో దాదాపు లక్షా 26 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల మేరకు   ఏబీసీ క్లీన్‌టెక్ & ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ సంస్థ రాష్ట్రంలో   1,10,250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనుంది.  అలాగే 13,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

అలాగే రీన్యూ పవర్ కంపెనీ పాతిక వేల రూపాయల పెట్టుబడితో ముందుకు వచ్చేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా పది వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి.   రీన్యూ ఇ-ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ  17 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తో సంస్థను ఏర్పాటు చేయానికి అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా 11 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.  ఇక రీన్యూ ప్రైవేట్ లిమిటెడ్-రూ 12500 కోట్ల రూపాయలు,  3250 మందికి ఉద్యోగ అవకాశాలు, నవయుగ ఇంజనీరింగ్ 2, 427 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్, 6300 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ సర్కార్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  ఇంకా చింతా గ్రీన్ ఎనర్జీ,  ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ, ఇండోసోల్, షిర్డీ సాయి సంస్థలు కూడా ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.  

అలాగే,   వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్,  స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా, విరూపాక్ష ఆర్గానిక్స్, అనంత్ టెక్నాలజీస్, ఏటీఆర్ వేర్ హౌసింగ్, లారస్ ల్యాబ్స్, మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్,  మల్లాది ఫార్మా సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 
ఇంకా ఈజౌల్, కోరమండల్, తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్స్ జూల్,  మణిపాల్ గ్రూప్, బెర్జాయ గ్రూప్, అమరావతి లైఫ్ సైన్సెస్, మైసిటీ, వివెన్స్ గ్రూప్,  ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూయర్ ఫండ్, ఏస్ అర్బన్ డెవలర్స్, క్రౌన్ ఎల్ఎన్జీ, ఆర్సీఆర్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.అదే విధంగా ఉమెన్ ఓవా అగ్రో ఫుడ్ పార్క్, ఐటీసీ ఫుడ్స్, గాడ్రేజ్ అగ్రో వెట్, బిస్లరీ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

By
en-us Political News

  
సిడ్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో సింధూ చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యూను 21-6, 21-9 తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 27 నిముషాలలో ముగించిన సింధు.. సెమీస్ లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచితో తలపడనుంది.
రాష్ట్రం నుంచి నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న లోకేష్ వారికి అభినందనలు తెలిపి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలని కోరానని పేర్కొన్నారు.
అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు..తన లేఖలో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, వారికి అట్రాసిటీ చట్టం కింద ఎలాంటి హక్కులు వర్తించవని గుర్తు చేశారు.
విధుల్లో భాగంగా ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లిన ఆయన.. ఇటీవల ఎంటీ సెట్టెబెల్లో అనే వాణిజ్య నౌకలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నౌకలో జనరేటర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్న సమయంలో దాడి జరగడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నౌక యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలిపింది.
ఆపిల్ సరికొత్త మ్యాక్ ఓఎస్ 27 గోల్డెన్ గేట్ బీటా వెర్షన్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాకుండా రోజువారీ వాడకంలో యూజర్లకు ఉపయోగపడే టాప్ 5 ఫీచర్లు, డిజైన్ మార్పులు మరియు పెర్ఫార్మెన్స్ రివ్యూ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమరావతిలో రూ. 2,534 కోట్లతో కేంద్ర సచివాలయం, GPRA క్వార్టర్ల నిర్మాణం షురూ కానుంది. రాబోయే 72 గంటల్లో CPWD టెండర్లు విడుదల చేయనుండటంతో రాయపూడితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా పుంజుకుంటోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రాజ్ కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు అతడిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ముగిసిన తర్వాత, పోలీసులు అతన్ని తిరిగి కడప జైలుకు రైలేలో తీసుకువస్తుండగా.. గూడూరు రైల్వేస్టేషన్ వద్ద రాజ్ కుమార్ పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సరికొత్త రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. విన్నర్, రన్నరప్ జట్లకు దక్కే కోట్ల ప్రైజ్ మనీ వివరాలు మరియు కొత్త టోర్నీ ఫార్మాట్ విశేషాలు మీకోసం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ఫేక్ మోసాలపై భారత ప్రభుత్వం బ్యాంకులు మరియు యూపీఐ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి.
భూమిపై మొట్టమొదటి సంక్లిష్ట కణాల (Eukaryotes) ఆవిర్భావం వెనుక ఉన్న జన్యు రహస్యాలను బార్సిలోనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్లు, బ్యాక్టీరియాల అద్భుత సమ్మేళనంతో జరిగిన ఈ జీవ పరిణామ క్రమం గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.
2027 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సురేశ్ రైనా ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ, ప్రిన్స్ యాదవ్ ఎంపికపై అనిల్ కుంబ్లే చేసిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ డీల్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో ఊరట లభించింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్ల కంటే కిందకు పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు రికార్డు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ తాజా అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ TG20 లీగ్‌లో వరంగల్ వారియర్స్ అద్భుత ప్రస్థానం. మహ్మద్ సిరాజ్ రాకతో పెరిగిన అంచనాలు, గ్రాస్‌రూట్ లెవెల్ క్రికెట్ విజన్ మరియు అప్డేట్స్ ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.