తెరాస నేతల్లో అంతర్మథనం?

Publish Date:Jun 3, 2022

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో కాదేది స్పెక్యులేషన్’ కు అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇదిగో తోక అంటే అదిగో పాము అన్నట్లుగా రాజకీయ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటో ఆరో నిజం అయినా, చాలా వరకు గాలి కబుర్లుగానే మిగిలి పోతున్నాయి. 

సరే, అదలా ఉంటే తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు, తన పుట్టినరోజు జూన్ 4) సందర్భంగా ఒక రోజు ముందు గురువారం తిరుపతి వెళ్లారు. అక్కడినుంచి  అలిపిరి మెట్ల దారిలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు హరీశ్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందులో రాజకీయ వాసనలు ఏమీ లేవు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సమయంలోనూ ఆయన రాజకీయాలు మాట్లాడలేదు. 

తన పుట్టిన రోజును పురస్కరించుకుని తనపై ఉన్న ప్రేమను ప్రజ‌లకు ఉప‌యో‌గ‌పడే సేవా కార్యక్రమాల ద్వారా చాటా‌లని అభి‌మా‌నులు, కార్యక‌ర్తలకు హరీశ్ రావు సూచించారు. శుభాకాంక్షలు చెప్పడా‌నికి, ఆశీ‌ర్వదించ‌డా‌నికి వస్తా‌మంటూ ఫోన్లు చేస్తు‌న్నవా‌రిని నిరాశ పరు‌స్తు‌న్నం‌దుకు మన్నించా‌లని ట్వీట్‌ చేశారు. అభి‌మా‌నుల ఆద‌రా‌భి‌మా‌నాలు, ప్రేమను తన గుండెల్లో పెట్టు‌కుంటా‌నని పేర్కొ‌న్నారు.

నిజానికి ఆయన ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం తమ పుట్టిన రోజు శ్రీవారి సన్నిధిలోనే జరుపుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా.. కానీ, హరీష్ రావు తిరుమల యాత్ర విషయంలో సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ కథనాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, కీలక రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపధ్యంలో, హరీష్ రావు తమ రాజకీయ భవిష్యత్’కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని, ఈనేపధ్యంలోనే హరీష్ రావు స్వామి వారి అశీస్సులు తీసుకునేదుకు తిరుమల వెళ్ళారని అంటున్నారు. 

అయితే నిజం ఏమంటే గత కొన్నాళ్లుగా ప్రతి ఏడాది తన పుట్టిన రోజుకు  హరీశ్ రావు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.అదే ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగించిన హరీశ్.. ఈసారి స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిజానికి అందులోనూ విశేషం లేదు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి విజయం సాధించిన అనంతరం కూడా హరీశ్ రావు తిరుమల వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.ఆ సమయంలో కేసీఆర్ సతీమణి శోభ సైతం తిరుమల వెళ్లారు. అదే ఏడాది ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా హరీశ్ రావు తిరుమల వెళ్లారు.

ఒక్క హరీష్ రావు మాత్రమే కాదు తెలంగాణ మంత్రులు చాలా మంది ఏదో ఒక సందర్భంలో తిరుమల వెళుతూనే ఉన్నారు, స్వామి వారిని దర్శించుకుంటూనే ఉన్నారు. నిజానికి, కొద్ది నెలల క్రితం ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆపార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కుమార్తె, కవిత తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. ఆమె కూడా అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకనే కొండకు చేరుకున్నారు.మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు చెప్పారు.

అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ, ప్రభుత్వ పగ్గాలు కుమారుడు కేటీఆర్’ కు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో హరీష్ రావుతో పాటుగా మరికొందరు సీనియర్ నాయకులు తమ రాజకీయ భవిష్యత్’ విషయంలో ఆందోళన చెందుతున్నారని పార్టీ వర్గాలలోనూ వినిపిస్తోంది. హరీష్ తిరుమల వెళ్ళింది అందుకు కాకపోయినా, అధికార  తెరాస నాయకుల్లో  అంతర్మథనంజరుగుతొందనేది మాత్రం కాదనలేని నిజం అంటున్నారు. అదలా ఉంటే రాజకీయ పరిశీలకులు మాత్రం నిప్పులేనిదే పొగరాదు కదా అంటూ ముక్తాయింపు ఇస్తున్నారు.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.