బీఆర్ఎస్ లో అంతర్మధనం

Publish Date:Apr 12, 2023

Advertisement

తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే కేసీఆర్ ఇదీ నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు నిర్వచనంగా చెప్పుకున్న మాట.  ఏది చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయవలసిందే. ఏది చెప్పినా కేసీఆర్ చెప్పవలసిందే. ఇతరులు ఎవరు ఏది చెప్పినా ఏది చేసినా కేసీఆర్ పేరున చేయవలిసిందే.  , సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదనే విధంగా పార్టీ ప్రభుత్వ వ్యవహారాలు నడిచాయి.  కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర మంత్రులు, పార్టీ పెద్దలు ఎవరు ఏమి చెప్పినా చివరకు కేసీఆర్ శంఖంలో పోస్తేనే అది తీర్ధం. ఆ మాటకు ఒక విలువ. అందుకు భిన్నంగా తొందరపడి ఏ మంత్రీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇంతవరకు ఏనాడూ  లేదు. 

అయితే  తెరాస, బీఆర్ఎస్ గా మారిన తర్వాత లేదా అంతకు కొంత ముందు నుంచి పరిస్థితి   మారుతూ వస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ రాజకీయాలు హీట్ ఎక్కిన నేపథ్యంలో ఇటు కుటుంబంలో అటు పార్టీ, ప్రభుత్వంలో చోటు చేకున్న పరిణామాలు కొత్త చర్చకు తెర తీశాయి. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చినప్పటి నుంచీ  కేసీఆర్  ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా  అది కూడా ఫోటోల్లో కనిపించడం, ప్రెస్ నోట్’లో వినిపించడమే కానీ నేరుగా ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. అసెంబ్లీలో లేదా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ సభలో తప్ప రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు లేదా మీడియా ముందుకు వచ్చిన సందర్భం ఇటీవల కాలంలో లేదనే చెప్పాలి.

 చివరకు రాష్ట్రంలో సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం,  టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీక్ , ఎస్ఎస్సీ పేపర్స్ లీక్ /మాల్ ప్రాక్టీసు వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్.. విడుదల చివరకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా కేసీఆర్ కుటుంబ పాలనని టార్గెట్ చేస్తూ చేసిన తీవ్ర విమర్శలు ఇలా.. ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి స్పందించలేదు. అయితే, ఉద్యమ కాలం నుంచీ కూడా కేసీఆర్  ప్రతికూల పరిస్థితుల్లో సైలెన్స్ గా ఉండడం, సమయం వచ్చినప్పడు   దూకుడు పెంచడం అనుభవంలో ఉన్న విషయమే అంటున్నారు. కేసీఆర్ విషయం అలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ జోష్ పెంచారు. సర్వం తానే అన్నట్లు (డీఫ్యాక్టో ముఖ్యమంత్రి)గా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక అధికార బీఆర్ఎస్ లో అయితే ఆయన అనుకూల వర్గం కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ట్రీట్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి కేటీఆర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడంతో పాటుగా, ఎన్నికలకు ముందుగా ఆయన్ని  ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, అయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళాలని పార్టీలో ఒక వర్గం ‘డిమాండ్’ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అదలా ఉంటే, ఏప్రిల్ 27న భారత రాష్ట్ర సమితి జనరల్ బాడీ మీటింగ్ జరగనున్న నేపధ్యంలో ఈ సమావేశంలో కేటీఆర్ ను భారాస రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం లేక పోలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇంతలోనే బీఆర్ఎస్ గుర్తింపు వ్యవహారం గందరగోళంలో పడింది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపే కానీ, ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిని నియమించిన పొరుగు రాష్ట్రం ఏపీ, పార్టీ విస్తరణ  ప్రారంభించిన కర్ణాటక, మహారాష్ట్ర సహా దేశంలో మరెక్కడా ఎలాంటి గుర్తింపు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ భవిష్యత్ ఒక విధంగా  డోలాయమానంలో పడిందని అంటున్నారు. అలాగే, ఒక విధంగా చూస్తే బీఆర్ఎస్ లో అంతర్మథనం జరుగుతోందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపద్యంలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్  ఆవిర్భావ దినోత్సవ  సభ లో ఏమి జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.