ఆసేవలు మరువలేం..వెలకట్టలేం.... 

Publish Date:Feb 18, 2022

Advertisement


అది కోవిడ్ మహమ్మారి ఉసురు తీస్తున్నవేళ ఆసుపత్రులు రోగులతో క్రిక్కిరిసిన వేళ అటు పురుషులు సైతం కోవిడ్ సేవలకు జంకుతున్న వేళ. ప్యాండ మిక్ ను సవాలుగా స్వీకరించి న ఫిజిషియన్ల సేవలను స్మరిస్తూ ఫిబ్రవరి నెలలో  జాతీయ మహిళ ఫిజిషియన్ల స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మజుందార్ షా మెడికల్ సెంటర్ నారాయణ  హెల్త్ సిటీ లో నిర్వహించిన కార్క్రమం లో కన్సల్టెంట్ నియో నాటలజిస్ట్,పిడియా ట్రీ షియన్, డాక్టర్ హరిణీ శ్రీధరన్ మాట్లాడుతూ కోవిడ్ ప్యాండ మిక్ జీవితాలనే మార్చేసిందని అని అన్నారు. వృత్తి పరమైన సవాళ్ళు ఎదురయ్యాయని,వ్యక్తి గతంగా కుటుంబాలలోనూ మార్పులు వచ్చాయని అన్నారు.   జాతీయ మహిళా ఫిజీషియన్ల దినోత్సవం సందర్భంగా ఇతర రంగాల లోనూ జరుపుకున్నప్పటికీ ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న మహిళలు పలు సవాళ్ళను కష్టాలను ఎదుర్కుంటూ అధిగమించామని డాక్టర్ హరిణీ శ్రీధరన్ వివరించారు . వాస్తవానికి ప్యాండమిక్ జీవితం సవాలుగా మారిందని అన్నారు.

ప్యాండ మిక్ సవాళ్లు....

ప్యాండ మిక్ ను మూడు రకాల సవాళ్లు గా విభజించారు.అవి వృత్తిపరమైన సవాళ్ళు, వ్య్సక్తిగత మైన సవాళ్ళు కుటుంబ పరమైన సమస్యలు ఎదుర్కున్నామని డాక్తర్ హరిణీ  శ్రీధరన్. వివరించారు. సార్క్ కోవిడ్ 2 ప్యాండ మిక్ మూడవ సంవత్సరం లో ప్రస్తుతం మనం ఉన్నామని. ప్రతి సంవత్సరం మన ఊహలకు అందకుండా  చాలా కొత్తగా విచిత్రమై నదిగా వ్యవహరిస్తోందని  పేర్కొన్నారు.

వ్యక్తి గత మైన సవాళ్లు....

పెద్ద సంఖ్యలో మరణాలు,మార్బి డిటీస్ ఫిజీషియన్ గా చూసామనిఅన్నారు. ప్యాండ మిక్ ఫిజీషియన్లకు మానసికంగా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిందని. ప్రతి రోజూ ఒక్కోవాతావరణం లో కొన్ని ఘంటలు గడిచిపోయయని. సరైన సమయంలో నిద్ర ఉండేది కాదని,సరైన సమయానికి ఆహారం సైతం ఉండేది కాదని చాలా అలిసిపోయే వారమని డాక్టర్ హరిణీ శ్రీధర్ అనుభవాన్ని పంచుకున్నారు.ఇంత సేవచేసిన ఒక్కోసారి సరైన ప్రోత్సాహం ప్రేరణ లభించేది కాదని  చాలా మంది వైద్య రంగం లో కి వచ్చినవారికి ఒకటే లక్ష్యం ఉంటుందని అది కేవలం రోగికి ప్రజలకు వ్యాధి నయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె అన్నారు. అయితే అలా చేయనప్పుడు ఒత్తిడి గురై సందర్భాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. చాలా అనారోగ్యం తో ఉన్న వారిపట్ల ఆందోళన ఉంటుందని నా కుటుంబం కూడా రేపు ఇలాంటి పరిస్థితే వస్తే అదే సమయానికి ఇంట్లో ఇన్ఫెక్షన్ వస్తే? అన్న సందేహం భయం మమ్మల్నీ మాకుటుంబాన్ని వెంటాడేది.

ఈ అంశాన్ని గురించి అమెరికన్ జర్నల్ సైకియాట్రీ లో కోవిడ్ వచ్చినవారిలో సహజంగానే ఆత్మ హాత్య చేసుకోవాలనే ఆలోచన ఒత్తిడి  వంటివి ఉండేవని స్త్రీలలోను సాధారణ ప్రజానీకం లోనూ చాలా ఎక్కువగానే ఉండేదని ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఫిజీషి యన్లలో ప్యాండ మిక్ సమయం లో మరింత ఎక్కువగా ఉండేదని ఆమె అన్నారు. చాలా మంది మహిళలు తాత్కాలికంగా వారి వారి ఉద్యోగాలను వృతిని మానుకున్నారని దీనికి వివిదరకాల ఉన్నాయని డాక్తర్ హరిణీ శ్రేధరన్ అన్నారు. మాకు చాలా గిల్టీ గా ఉండేదని మాకుటుంబానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అన్న భయం ఒకపక్క కుటుంబం ఎలా ఎదుర్కుంటుంది అనేవిష యం మమ్మల్ని మాకుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేసిందని అలాగే మరో పక్క వైద్యరంగం లో ఉంటూనే కోవిడ్ రోగులతో కాంటాక్ట్ ఉంటూనే పిల్లల సంరక్షణ పై నిర్లక్ష్యం చేసచేసమని పిల్లలకు ఎక్కడైనా వై రస్ కాంటాక్ట్ వస్తుందేమో అన్న భయం తో పిల్లల్ని దూరంగా ఉంచే వరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నపిల్లలని అలాగే మాఇంట్లో వృద్ధులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారని మళ్ళీ లాక్ డౌన్ రెండు సంవత్సరాలుగా సాగుతున్న పరిణామ క్రమం లో ఇంట్లో  వారికి పెద్దగా సహాయ పడలేదు.

అసలు ఎలాంటి సందర్భం ఎదుర్కోవాల్సి వచ్చిందంటే ముఖ్యంగా స్త్రీలు రెండు రకాల సందర్భాలలో ఎదుర్కునేందుకు శక్తి కావాలి. రెండు ఒత్తిడిని కలిగించే అంశాలే వృత్తిలోను, ఇంట్లోనూ ఒత్తిడే ఉంటుంది ఆ సమయంలో అటు భర్తకు భార్యగా, వృత్తిపరం గా  వైద్యురాలిగా ఒక మెట్టు దిగి ప్యాండ మిక్ లో ఉన్నరిస్క్ ను పక్కన పెట్టి ఇంటికి సంబందించిన విషయాలలో ముందుండి నడిపించమని వివరించారు.స్వచ్చందంగా కొన్ని ఘంటలు అదనంగా పనిచేశామని అమ్మే చెప్పారు. అయితే చాలామంది స్త్రీలు వారి వారి బాధ్యతల వల్ల ఇంటివద్దే ఉండిపోయారని అలాగే గిల్టీ తోనే పనిచేశామని ఆమె స్పష్టం చేసారు.

వృత్తిపరంగా ఎదురైన సమస్యలు....

వృత్తిపరంగా చాలా మంది మిత్రులు ముఖ్యంగా బంధువులు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురియ్యరనిచాలా చిన్న ఆసుపత్రులలో సైతం కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులుగా మార్చారని అందులో చాలామంది వృతి పరమైన ఉద్యోగాల అవసరం ఎక్కువగానే ఉంటుందని కొన్ని చోట్ల స్త్రీల అవసరం తక్కువగా ఉంటుంది. అయితే సందర్భాలలో వారు ఇచ్చే జీతాలకు  రాజీ పడక తప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఆర్ధికంగా ఎక్కడి కక్కడ లావాదేవీలు నిలిచిపోయాయని ఒక స్లంప్ ఏర్పడిన సందర్భంలో చాలా మంది  స్త్రీలకు గర్భం దాల్చిన లేదా నెలలు నిండిన స్త్ర్రేలకు ఇచ్చే మెటర్నటీ  సెలవులు  తిరిగి ఇవ్వలేదని ఇటీవల వెలువడిన వ్యాసం లో పేర్కొన్న అంశాలలో తాత్కాలిక కాంటాక్ట్- టేన్యుర్ పోస్టులు ఉన్న వారే ఉద్యోగం కోల్పోయారని ఉద్యోగం కొనసాగించినవారి పట్ల వ్యతిరేకత వ్యక్తం వచ్చింది. విద్య పరంగా,ప్రచురణలు ,కిలినికల్ గా వారు నిర్వహించిన పనితీరు. పురుషులు రానందువల్ల వారి అవకాశాల పై తీవ్రప్రభావం చూపింది.వారి అవకాశాలు మరింత దెబ్బతిన్నాయి. దానికరణంగా వారికి రావాల్సిన ప్రమోషన్స్ మహిళా ఫిజీషియన్స్ కు అవకాశాలు మెరుగు పడ్డాయి.బయటికి రాక తప్పలేదని ఆమె అన్నారు.వ్యక్తిగత ప్రభావం...నాకు నేనుగా చాలా అదృష్ట వంతు రాలినని అన్నారు. నాకుటుంబం నాకు పూర్తి మద్దత్తు ప్రకటించింది. పనిచేసే ప్రదేశంలో ప్యాండమిక్ సమయం లో చాలా మంది మహిళా ఫిజీషి యన్లు అందరికీ అలాజరగ లేదని ప్రస్తుత ప్యాండమిక్ మహిళా ఫిజీషియన్ల పై బాధ్యత ఉందని ఆసుపత్రులలో వైద్య పరంగా కాని పనిచేసే ప్రదేశాలలో పనిచేసిన ఆపని తీరును ఇప్పుడు గుర్తింపు లభించడం అభినందనీయమని ఆమె అన్నారు. ఎవరికీ తోచిన విధంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అందరి సహకారం తో సవాళ్ళను ఎదుర్కున్న మహిళా ఫిజీశియన్లు మాట్లాడతారని వారి అనుభవాన్ని మనకు పంచుతారని ఇప్పుడైణా చాలామంది స్త్రీలు వృత్తిపట్ల ఆకర్షితులు అవుతారని వస్తారని ఆశిస్తున్నట్లు అందుకే ప్యాండ మిక్ సమయంలో వారి సేవలు మరువలేమని-వారి సేవలకు వెలకట్ట లేమని డాక్టర్ హరిణీ శ్రీధరన్ అన్నారు.     

By
en-us Political News

  
ద్రాక్ష ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనది.
ఒక లీటరు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయట. నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంద‌ని, ప్రాణాంతక వ్యాధులపై బెర్లిన్ - జర్మనీలో జ‌రిగిన‌ మెడికల్ కాన్ఫరెన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.
ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.
వేసవి వచ్చిందంటే చాలామంది పుచ్చకాయలు, చెరకు రసం, మామిడి పండ్లు, తాటిముంజలు మొదలైనవి తినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు.
శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది.
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ.
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే.
బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి.
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక.
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది.
జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.