విశాఖకు ఐఎన్ఎస్ నీలగిరి
Publish Date:Jun 23, 2025
Advertisement
తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ఏడాది జనవరి 15న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధ నౌకను ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ శ్రేణిలో నిర్మించారు. ఈ పద్ధతిలో నిర్మించిన తొలి నౌక ఇది. ఈ నౌకలో వినియోగించిన స్టెల్త్ టెక్నాలజీ కారణంగా ఐఎన్ఎస్ నీలగిరి శత్రువు రాడార్లలో కనిపించదు. ఈ నౌక విశాఖ తీరానికి చేరుకుంది. ఇప్పటికే విశాఖపట్నం తూర్పు తీర నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ నీలగిరి రాక విశాఖ నగర రక్షణకు అదనపు అలంబనగా ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఐఎన్ఎస్ నీలగిరికి తూర్పు నౌకాదళం ఘనంగా స్వాగతం పలికింది.
http://www.teluguone.com/news/content/ins-nilgiri-joins-indian-eastern-fleet-25-200478.html





