ఏపీ నుంచి  గుజరాత్ కి తరలిపోతున్న పరిశ్రమలు

Publish Date:Nov 3, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశం తగ్గిపోతుండడంతో అనేక సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కంపెనీలు  గుజరాత్ కి తరలిపోతున్నాయి. గతంలో కర్నూలు, కడప, అనంతపరం జిల్లాల్లో స్థాపించిన సంస్థలు అభివృద్ధిపరంగా ఎలాంటి నమ్మకం  కలగక పోవడంతో వాటి కార్యకలాపాలక స్వస్తి పలికి పెట్టు బడులకు ఎంతో అనుకూలమయిన, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్ర మయిన గుజరాత్ కు తరలి పోతున్నాయి. 

అనంతపురం జిల్లా నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల విండ్ మిల్ యూనిట్లు ఇప్పటికే తరలిపోయా యి. అవి ఉత్పత్తి చేస్తున్న గ్రీన్ విద్యుత్ కు తగినంత ధర పొందలేకపోవడమే అందుక ప్రధాన కారణమని తెలుస్తోంది. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం అనేక ప్రయివేటు కంపెనీలు సోలార్, విండ్ పవర్ యూనిట్లను ప్రారంభించాయి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటి నుంచి యూనిట్ నాలుగు రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రభుత్వం టారిఫ్ ను  మార్చి యూనిట్ కు  కేవలం రెండు రూపాయలే  యిస్తున్నది. 

ఇలానే, కళ్యాణదుర్గ, రామగిరి, రెడ్డం ప్రాంతాల్లో అనేక పెద్ద సంస్థలు నెలకొల్పిన యూనిట్లు  మెల్లగా ఎక్కడో ఉన్న గుజరాత్ లో తమ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నాయి. సుమారు వెయ్యి మెగావాట్ల యూని ట్లు ముఖ్యంగా అనంతపురం జిల్లాల్లో నెలకొల్పవలసినవి దూరంగా ఉన్న గుజరాత్ మేలని తరలి పోయాయని అంటున్నారు. వాస్తవానికి అనంతపురం జిల్లాలో కొండప్రాంతాలతో ఉన్నందువల్ల విండ్ విద్యుత్ కి ఎంతో అనుకూలం. ముఖ్యంగా ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య గాలి వేగం గంటకు 45 కి.మీ ఉంటుంది. ఇది విద్యుదుత్పత్తికి ఎంతో అనుకూలమని రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి కార్పోరేషన్ (నెడ్ కాప్) పేర్కొన్నది. 

ముఖ్యంగా ఉరవకొండ, సి.కె.పల్లి, వజ్రకరూర్, రామగిరి , రొడ్డం ప్రాంతాలు ఎంతో అనుకూలమని నెడ్ కాప్ అధికారులు పేర్కొన్నారు.  పైగా వారి యూనిట్లు పెట్టుకోవడానికి కనీసం ఒక్క ఎకరం ప్రభుత్వ భూమి కూడా తమకు లేదని, కొండ ప్రాంతాలన్నీ ప్రయివేటు కంపెనీలకు లీజుకు ఇచ్చేశారని వారితో రైతులు కూడా ఒప్పందాలు కుదుర్చకున్నారని అధికారులు చెప్పారు.  అయితే పవర్ టారిష్ తమకు ఉపయోగకరంగా లేదు గనుక ఈ ప్రయివేటు కంపెనీలు వాటి కొత్త యూనిట్ల ఏర్పాటు విషయలో పెద్దగా ఆసక్తీ చూపడం లేదు. 

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.