తొలి ఏకాదశి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల కిటకిట
Publish Date:Jul 6, 2025
Advertisement
తొలి ఏకాదశి సందర్బంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే నమ్మకంతో వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చాయి. దీంతో లిఫ్ట్‌దారి, ఘాట్ రోడ్డు వైపు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు త్వరితగతిన దర్శనాలు పూర్తిచేసుకుని కొండపై నుంచి దిగువకు పంపేందుకు ఈవోశీనానాయక్ తో పాటు ఏఈవోలు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా రద్దీని ఈవో పరిశీలిస్తున్నారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలకు అనుమతిపై నియంత్రణ విధించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యంతో పులకించిపోయాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పవిత్రమైన ఈ రోజున శ్రీమహావిష్ణువును దర్శించుకోవడం, ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఆలయ ప్రాంగణాలు “గోవిందా.. గోవిందా..” నామస్మరణతో మార్మోగిపోయాయి.
http://www.teluguone.com/news/content/indrakeeladri-25-201401.html





